epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?
బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు!
కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌
గత విభేదాలకు ముగింపు.. బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానం
బీజేపీపై అనుచరుల్లో సందేహాలు..
వ‌రంగ‌ల్ తూర్పులో ముస్లిం ఓట్లే కీల‌క‌మ‌వ‌డంతో ఆ పార్టీకి దూరంగా ఉండాల‌ని యోచ‌న‌
మ‌రోవైపు బీసీ నినాదంతో సొంత పార్టీ ఆలోచనలో కొండా మురళి
బీసీ సంఘాలతో వరుస సంప్రదింపులు
త్వరలోనే బిగ్‌ అప్‌డేట్‌.. కొండా సురేఖ పోస్టుతో రాజకీయ కలకలం

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్‌లో కొండా కుటుంబం కొనసాగడంపై అనుమానాలు బలపడుతున్నాయి. మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తప్పించిన పరిణామాల నేపథ్యంలో.. ఆ కుటుంబం తదుపరి రాజకీయ అడుగులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్‌, బీజేపీ నేతలు కొండా దంపతులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వయంగా కొండా దంపతులతో మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో బీఆర్ఎస్‌లో పనిచేసిన అనుభవం ఉండటం, ఆ పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్న పరిస్థితి లేకపోవడం ఇప్పుడు ఆ కుటుంబానికి బీఆర్ఎస్‌ వైపు తిరిగి చూసే అవకాశాన్ని పెంచినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు బీజేపీ నుంచి కూడా కొందరు నేతలు టచ్‌లోకి వెళ్లినప్పటికీ.. ఆ పార్టీ వైపు వెళ్లే విషయంలో కొండా అనుచరుల్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్‌లో చేరాలా, లేక బీసీ నినాదంతో సొంత రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలా అన్న డైలమాలో కొండా కుటుంబం ఉన్నట్లు సమాచారం.

కేటీఆర్‌ ఫోన్‌.. కొండాకు ఆహ్వానం

కొండా కుటుంబంతో బీఆర్ఎస్‌ మళ్లీ మంతనాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కేటీఆర్‌ స్వయంగా కొండా సురేఖకు ఫోన్‌ చేసి మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో జరిగిన విభేదాలను పక్కనపెట్టి.. ఇకపై అలాంటి పరిస్థితులు ఉండవని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. కొండా సురేఖను అక్కగా సంబోధిస్తూ పార్టీలోకి రావాలని కేటీఆర్‌ ఆహ్వానించినట్లు సమాచారం. అయితే కొండా దంపతులు మాత్రం ఇప్పటివరకు బీఆర్ఎస్‌లో చేరుతామని స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. కేటీఆర్‌ ఫోన్‌ చేసిన విషయం బయటకు వచ్చిన తర్వాత కొండా సురేఖ కొన్ని టీవీ చర్చల్లో చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతంలో తాను పనిచేసిన పార్టీలతో పోలిస్తే వైఎస్‌ రాజశేఖరరెడ్డి తర్వాత కేసీఆర్‌ చాలా మంచి నాయకుడన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేయడం.. బీఆర్ఎస్‌తో మళ్లీ సాన్నిహిత్యం పెరుగుతున్నదనే చర్చకు బలం చేకూర్చింది.

అప్పుడేం జరిగింది?

గతంలో కొండా దంపతులు బీఆర్ఎస్‌లో పనిచేశారు. అయితే వరంగల్‌ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ పరిణామాల్లో ఏర్పడిన విభేదాల కారణంగా వారు ఆ పార్టీకి దూరమయ్యారు. అప్పట్లో జరిగినవి పెద్ద రాజకీయ ఆరోపణలు, అవినీతి వ్యవహారాలు కాదని.. పార్టీలో తమకు కొంత స్వతంత్రత, ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న ఆకాంక్షతోనే విభేదాలు వచ్చాయని కొండా సురేఖ గతంలో పలుమార్లు చెప్పినట్లు వారి సన్నిహితులు గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా అప్పటి తూర్పు ఎమ్మెల్యే వర్గానికి సంబంధించిన కార్యక్రమాలు, అప్పటి మేయర్‌ నన్నపనేని నరేందర్‌ తదితరులతో సమావేశాలు తమకు తెలియకుండా జరగడం వంటి పరిణామాలు ఆమెను మనస్తాపానికి గురిచేశాయని ఆమె గతంలో కొన్ని చర్చల్లో వెల్లడించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన కొండా దంపతులు ఇప్పటివరకు అదే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే తాజా పరిణామాలతో గతంలోని ఆ విభేదాలు మళ్లీ రాజకీయ చర్చకు వచ్చాయి.

బీజేపీ వైపు ఎందుకు వెనకడుగు?

కొండా దంపతులతో బీజేపీకి చెందిన ఒకరిద్దరు కాదు.. పలువురు నేతలు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే ఆ పార్టీ వైపు వెళ్లడంపై కొండా కుటుంబం పెద్దగా ఆసక్తి చూపడం లేదని వారి అనుచర వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో ఉన్న సామాజిక, రాజకీయ ఓటు సమీకరణాలేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొండా దంపతుల అనుచర వర్గంలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు గణనీయంగా ఉన్నారని, తూర్పు నియోజకవర్గ రాజకీయాల్లోనూ ముస్లిం ఓటు బ్యాంకు కీలకంగా ఉంటుందని వారి అనుచరులు చెబుతున్నారు. బీజేపీలో చేరితే ఆ ఓటు బ్యాంకుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలపై పెద్దగా మొగ్గు చూపకుండా.. బీఆర్ఎస్‌ లేదా సొంత రాజకీయ వేదిక అనే రెండు మార్గాలపైనే కొండా కుటుంబం దృష్టి పెట్టినట్లు సమాచారం.

బీసీ నినాదంతో కొత్త పార్టీ?

బీఆర్ఎస్‌లో చేరడం ఒక మార్గమైతే.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడంపైనా కొండా మురళి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వివిధ కుల సంఘాలతో ఆయన నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కొన్ని సంఘాల ప్రతినిధులతో సమావేశమై.. బీసీ సామాజిక వర్గం ఆధారంగా స్వతంత్ర రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది, ఇప్పటికే ఉన్న రాజకీయ పార్టీలో చేరడం మంచిదా అనే అంశాలపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ నినాదంతో కొత్త రాజకీయ శక్తిని నిర్మించే అవకాశాలపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇది ఇప్పటికీ ఆలోచనల దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై కొండా కుటుంబం తమ సన్నిహితులు, అనుచరులు, వివిధ సామాజిక వర్గాల నేతల అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్‌లోనూ గందరగోళమే!

కొండా దంపతులు తిరిగి బీఆర్ఎస్‌లోకి వస్తారన్న ప్రచారం ఆ పార్టీలోనూ చర్చకు దారితీసింది. అయితే వరంగల్‌ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్‌ నేతలు మాత్రం తమకు ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు మరికొందరు సీనియర్‌ నేతలను సంప్రదించినప్పుడు.. కొండా దంపతులు బీఆర్ఎస్‌లోకి వస్తున్నట్లు తమకు తెలియదని, పార్టీ అధిష్ఠానం నుంచి కూడా ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో కేటీఆర్‌ స్థాయిలో జరుగుతున్న సంప్రదింపులు పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ఎంతవరకు తెలుసన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు కేటీఆర్‌ స్వయంగా సంప్రదింపులు జరిపినట్లు వస్తున్న సమాచారంతో.. అధిష్ఠానం స్థాయిలో ఏదైనా వ్యూహం సిద్ధమవుతోందా అన్న చర్చ మొదలైంది.

కొండా పోస్టుతో మరింత ఉత్కంఠ

ఈ రాజకీయ పరిణామాల మధ్య కొండా సురేఖకు సంబంధించిన సామాజిక మాధ్యమ పోస్టులు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ఆమె పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ ఖాతాల్లో ఒకదానిలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో త్వరలోనే బిగ్‌ అప్‌డేట్‌ రానుందనే అర్థం వచ్చేలా పోస్టు పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మరో పోస్టుపై తమకు సంబంధం లేదని స్పష్టం చేస్తూ మరో సందేశం వెలువడింది. ఒకవైపు త్వరలో కీలక ప్రకటన ఉంటుందన్న సంకేతం.. మరోవైపు కొన్ని పోస్టులతో తమకు సంబంధం లేదన్న వివరణ రావడం కొండా కుటుంబం నుంచి ఏదో కీలక రాజకీయ ప్రకటనకు రంగం సిద్ధమవుతోందా అన్న ఉత్కంఠను పెంచింది. ప్రస్తుతం కొండా కుటుంబం ముందున్న మూడు మార్గాలపై రాజకీయ చర్చ సాగుతోంది. కాంగ్రెస్‌లోనే కొనసాగడం, బీఆర్ఎస్‌లోకి తిరిగి వెళ్లడం, బీసీ నినాదంతో సొంత రాజకీయ వేదిక ఏర్పాటు చేయడం.. ఈ మూడింటిలో ఏ దారిని ఎంచుకుంటారన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. అయితే తాజా పరిణామాలు, బీఆర్ఎస్‌ నుంచి వచ్చిన ఆహ్వానం, కొండా సురేఖ వ్యాఖ్యలు, కొండా మురళి బీసీ సంఘాలతో జరుపుతున్నట్లు చెబుతున్న సంప్రదింపులు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సంకేతాలను కలిపి చూస్తే.. కాంగ్రెస్‌లో కొండా కుటుంబం భవిష్యత్‌పై మాత్రం రాజకీయంగా పెద్ద ప్రశ్నే తలెత్తింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.