ఇనుగుర్తి మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా 13 మంది ఎంపిక
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మానం
కాకతీయ, ఇనుగుర్తి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జెడ్పీహెచ్‌ఎస్ ఇనుగుర్తి పాఠశాలలో మండల ఉత్తమ ఉపాధ్యాయులను శనివారం ఘనంగా సన్మానించారు. ఎంఈఓ వి. వెంకట్‌రెడ్డి అధ్యక్షతన, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు సూరం భాస్కర్‌రెడ్డితో కలిసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్, మాధవ్, వీరన్న, మధుబాబు, మల్లయ్య, రేవతి, సారంగపాణి, యుగంధర్, స్వాతి, అమృతలక్ష్మి, శైలజ, నాగవాణి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఎంఈఓ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ సంఘాల బాధ్యులు భాస్కర్, వీరన్న, రమేష్, మధుబాబు, ప్రభాకర్, ఉప్పలయ్యతో పాటు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

