epaper
Thursday, September 24, 2026
epaper
BREAKING NEWS
Loading News...

యూపీఐపై ఎండీఆర్‌ భారం

యూపీఐపై ఎండీఆర్‌ భారం
లావాదేవీలపై ప్రభావం స్వల్పమే
రూ.2 వేలపైనే ఎండీఆర్‌.. 96 శాతం లావాదేవీలకు మినహాయింపు
మొత్తం విలువలో 10 శాతానికే ఛార్జీల ప్రభావం
రూ.75 వేల లావాదేవీపై గరిష్ఠంగా రూ.300
రూ.1,000 కోట్ల టర్నోవర్‌ వ్యాపారాల నుంచే 80 శాతం వసూళ్లు
ఎండీఆర్‌లో 5 శాతం ప్రత్యేక నిధికి మళ్లింపు
ఎన్‌పీసీఐ సీఈఓ దిలీప్‌ ఆస్బే

కాక‌తీయ‌, హైదరాబాద్ : యూపీఐ లావాదేవీలపై కొత్తగా అమల్లోకి రానున్న మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) వల్ల లావాదేవీల పరిమాణం, విలువపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) సీఈఓ దిలీప్‌ ఆస్బే తెలిపారు. మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో కేవలం 10 శాతం మేరకే ఎండీఆర్‌ ఛార్జీల ప్రభావం ఉండొచ్చన్నారు. కొత్త విధానం ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థలోనే పెట్టుబడిగా వినియోగిస్తామని చెప్పారు. 13వ ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనామిక్స్‌ కాన్‌క్లేవ్‌ 2026లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఎన్‌పీసీఐ కొత్త నిబంధనల ప్రకారం అక్టోబర్‌ 15 నుంచి రూ.2,000 దాటిన పర్సన్‌-టు-మర్చంట్‌ (పీ2ఎం) యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ వర్తించనుంది. రూ.75,000కు మించిన లావాదేవీలపై ఈ ఛార్జీ గరిష్ఠంగా రూ.300కు పరిమితం చేశారు. రూ.2,000 దాటినప్పటికీ పర్సన్‌-టు-పర్సన్‌ (పీ2పీ) లావాదేవీలకు ఈ ఛార్జీ వర్తించదు.

96 శాతం లావాదేవీలకు ప్రభావం లేదు

జీరో ఎండీఆర్‌ పరిధిలోని చిన్న వ్యాపారులకు కూడా మినహాయింపు ఉంటుందని దిలీప్‌ ఆస్బే తెలిపారు. కొత్త విధానం వల్ల సుమారు 96 శాతం పీ2ఎం లావాదేవీలు ప్రభావితం కాకుండా ఉంటాయని అంచనా వేశారు. రైల్వేలు, టెలికమ్యూనికేషన్స్‌, ఇన్సూరెన్స్‌, ఇంధనం, వ్యవసాయ ఉత్పాదకాలు వంటి కొన్ని రంగాల్లో రూ.2,000 దాటిన చెల్లింపులపై ప్రతి లావాదేవీకి రూ.5 చొప్పున ఫ్లాట్‌ ఎండీఆర్‌ వర్తించనుంది. సుమారు రూ.1,000 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్‌ కలిగిన వ్యాపారాల నుంచే దాదాపు 80 శాతం ఎండీఆర్‌ వసూలవుతుందని ఆస్బే వెల్లడించారు. ఇప్పటివరకు క్రెడిట్‌ కార్డు లావాదేవీలపై ఛార్జీలు చెల్లిస్తున్న వ్యాపారుల నుంచే అధిక మొత్తంలో ఎండీఆర్‌ వస్తుందని వివరించారు. వ్యాపారులు ఈ భారాన్ని వినియోగదారులపై మోపకుండా వ్యవస్థను రూపొందించాలని అభిప్రాయపడ్డారు.

3 ఏళ్లలో రూ.3,000 కోట్ల నిధి

ఎండీఆర్‌ వసూళ్లలో 5 శాతాన్ని యువ పారిశ్రామికవేత్తలు, మద్దతు అవసరమైన రంగాల కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక నిధికి మళ్లించాలని ప్రతిపాదించినట్లు ఆస్బే తెలిపారు. ఎన్‌పీసీఐ, ఆర్‌బీఐ, ఇతర భాగస్వాములతో కలిసి నిధి రూపకల్పనపై పనిచేస్తున్నామని చెప్పారు. 3 ఏళ్లలో ఈ నిధి సుమారు రూ.3,000 కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. దేశంలో దాదాపు 2 కోట్ల మంది వ్యాపారుల వద్ద సౌండ్‌బాక్స్‌లు ఉండగా, మరో 4 కోట్ల మంది వ్యాపారులు కేవలం క్యూఆర్‌ కోడ్‌లను వినియోగిస్తున్నారని ఆస్బే వివరించారు. ఎండీఆర్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని సౌండ్‌బాక్స్‌లు, కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలు వంటి డిజిటల్‌ చెల్లింపుల సాంకేతికతల్లో తిరిగి పెట్టుబడిగా వినియోగిస్తామని తెలిపారు. మూలధన మార్కెట్‌ లావాదేవీలపై 0.02 శాతం ఎండీఆర్‌, గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుందని వెల్లడించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో 10 చోట్ల తనిఖీలు

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో 10 చోట్ల తనిఖీలు బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు హైదరాబాద్‌,...

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వమా.. కమిటీల ప్రభుత్వమా?

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వమా.. కమిటీల ప్రభుత్వమా? ఉద్యోగుల సమస్యలపై కమిటీల పేరుతో కాలయాపన పెండింగ్‌...

బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యుత్‌ రంగానికి స్వర్ణయుగం

బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యుత్‌ రంగానికి స్వర్ణయుగం విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 7,778 నుంచి...

సింగరేణి సంక్షోభానికి కాంగ్రెస్‌దే బాధ్యత

సింగరేణి సంక్షోభానికి కాంగ్రెస్‌దే బాధ్యత కరెంటు కోతలపై సింగరేణి భవన్‌ వద్ద బీఆర్‌ఎస్‌...

19 రకాల గోదావరి రుచులతో అన్నసమారాధన

19 రకాల గోదావరి రుచులతో అన్నసమారాధన కాకతీయ, కూకట్‌పల్లి: వినాయకచవితి సందర్భంగా హైదరాబాద్‌...

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.