epaper
Friday, November 13, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తమ్ముడిని హత్య చేసిన అన్నకు జీవిత ఖైదు!

తమ్ముడిని హత్య చేసిన అన్నకు జీవిత ఖైదు!
వరంగల్‌ ప్రధాన జిల్లా న్యాయస్థానం తీర్పు
కాకతీయ, నల్లబెల్లి: కన్నతల్లి కళ్ల ముందే కుటుంబంలో విషాదం నింపిన తమ్ముడి హత్య కేసులో నిందితుడైన అన్నకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన కుండె రవి (40), తన తమ్ముడు కుండె కుమార్‌ (32)ను హత్య చేసిన కేసులో వరంగల్‌ ప్రధాన జిల్లా న్యాయస్థానం గురువారం ఈ తీర్పు వెలువరించింది. నిందితుడికి జీవిత ఖైదుతోపాటు రూ.2 వేల జరిమానా విధించింది. మృతుడి తల్లి కుండె ఇలమ్మ ఫిర్యాదు మేరకు నల్లబెల్లి పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్‌ నంబర్‌ 18/2024గా ఐపీసీ 302 సెక్షన్‌ కింద కేసు నమోదైంది. అప్పటి దుగ్గొండి సీఐ పి. కిషన్‌ దర్యాప్తు చేపట్టగా, అనంతరం సీఐ బి. రాజగోపాల్‌ అభియోగపత్రం దాఖలు చేశారు. ఎస్సీ నంబర్‌ 30/2026గా విచారణకు వచ్చిన కేసులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మురళీధర్‌రావు ప్రాసిక్యూషన్‌ తరఫున వాదనలు వినిపించారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి శిక్ష విధించింది. ప్రస్తుతం కేసు పర్యవేక్షణ బాధ్యతలను దుగ్గొండి సీఐ జె. శంకర్‌రావు నిర్వహిస్తున్నారు. కోర్టు లైజన్‌ అధికారిగా ఎస్‌ఐ కాంతేటి హరికృష్ణ, కోర్టు డ్యూటీ అధికారిగా ఖానాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పీసీ 2473 నామిండ్ల మహేశ్‌ సమన్వయం చేశారు. సమర్థవంతంగా దర్యాప్తు చేసి, పటిష్ట ఆధారాలు సమర్పించిన పోలీసు అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సాఫ్ట్‌బాల్‌ క్రీడలో సత్తా చాటాలి

సాఫ్ట్‌బాల్‌ క్రీడలో సత్తా చాటాలి రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ నిరూపించుకోవాలి కరీమాబాద్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు...

ఘనంగా సింగపురం ఇందిరా జన్మదిన వేడుకలు!

ఘనంగా సింగపురం ఇందిరా జన్మదిన వేడుకలు! క్యాంపు కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి...

ఉద్యమకారుల హక్కుల సాధనకు మరో ఉద్యమం!

ఉద్యమకారుల హక్కుల సాధనకు మరో ఉద్యమం! రేపు హనుమకొండలో రెండో దశ ఉద్యమకారుల...

పీఎం రాహత్‌ పథకం అమలులో నిర్లక్ష్యం వద్దు

పీఎం రాహత్‌ పథకం అమలులో నిర్లక్ష్యం వద్దు రోడ్డు ప్రమాద బాధితులకు నగదు...

ఐఎల్‌పీఏ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి!

ఐఎల్‌పీఏ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి! నవంబర్‌ 14న హనుమకొండలో ఆరో రాష్ట్ర...

తరగతి గదుల నుంచి ఆసుపత్రి వరకు

తరగతి గదుల నుంచి ఆసుపత్రి వరకు ఐటీడీఏ పీఓ క్షేత్రస్థాయి పరిశీలన రైనిగూడెం ఆశ్రమ...

దొడ్ల కొత్తూరులో భారీగా నాటుసారా నిల్వలు

దొడ్ల కొత్తూరులో భారీగా నాటుసారా నిల్వలు పోలీసుల కార్డన్‌ సెర్చ్‌లో 4 వేల...

బియ్యం ధరలపై అధికారుల కొరడా

బియ్యం ధరలపై అధికారుల కొరడా ఏటూరునాగారంలో రకాలను బట్టి గరిష్ఠ ధరల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.