ఘనంగా సింగపురం ఇందిరా జన్మదిన వేడుకలు!
క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ శుభాకాంక్షలు
కాకతీయ, హనుమకొండ: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి సింగపురం ఇందిరా జన్మదిన వేడుకలను గురువారం ఆమె క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కేక్ కట్ చేసి, టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తల సందడితో కార్యాలయం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సింగపురం ఇందిరాను శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ సిద్ధాంతాల వ్యాప్తికి చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు సింగపురం నాగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల మహేందర్, జిల్లా కార్యదర్శి శాగంటి మణి, తాటికొండ సంపత్, చిల్పూర్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు కల్లకోలు బాలరాజు, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కొమురయ్య, కన్వీనర్ కోర్నెల్, కార్యదర్శి పులి శ్రావణ్, గుర్రపు యాదగిరి, మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న, నారగోని పద్మ, యువ నాయకుడు సింగపురం ఇమ్మాన్యుయేల్ రాజ్, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


