epaper
Friday, September 25, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మంత్రుల చుట్టూ.. ‘నాన్‌-లోకల్‌’ వలయం!

మంత్రుల చుట్టూ.. ‘నాన్‌-లోకల్‌’ వలయం!
లోకల్‌ క్యాడర్‌కు అంద‌నంత దూరంగా మినిస్ట‌ర్లు
అన్‌ప్రియారిటీగా మారుతున్న ఖ‌మ్మం నేత‌లు.. బయటివారికే పెద్దపీట!
గెలిపించిన వాళ్లకు గేట్లు.. కొత్తగా వచ్చినవాళ్లకు పలుకుబడి!
అధికారుల వద్దా వారిదే హవా.. భూ వ్యవహారాల్లోనూ జోక్యం!!
లోకల్‌ లీడర్లలో మంట.. మంత్రుల తీరుపై అంతర్గత అసంతృప్తి
కాకతీయ, ఖమ్మం బ్యూరో: ఎన్నికల్లో భుజం భుజం కలిపి పనిచేసిన స్థానిక క్యాడర్‌ ఒకవైపు.. అధికారం వచ్చాక మంత్రుల చుట్టూ చేరిన ‘నాన్‌-లోకల్‌’ నేతలు మరోవైపు! ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన స్థానిక నాయకులు, కార్యకర్తలు మాత్రం మంత్రులను కలవడానికే ఇబ్బందులు పడుతుండగా.. నియోజకవర్గంతో పెద్దగా సంబంధం లేని కొందరు నేతలు మంత్రుల చుట్టూ చక్కర్లు కొడుతూ అధికారుల వద్ద తమ పలుకుబడిని పెంచుకుంటున్నారనే చర్చ సాగుతోంది. ఎన్నికల సమయంలో అవసరమైన లోకల్‌ క్యాడర్‌.. ఇప్పుడు అధికార వ్యవహారాల్లో ఎందుకు కనిపించడం లేదు? అన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి పార్టీ అభ్యర్థుల విజయానికి పనిచేసిన స్థానిక నేతలు, కార్యకర్తలు ఇప్పుడు తమకే ప్రాధాన్యం లేకపోవడంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కనపెట్టి.. ఆ తర్వాత మంత్రుల చుట్టూ చేరిన నేతలకు ప్రాధాన్యం పెరిగిందనే అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతోంది. “గెలిపించడానికి మేము ఇంటింటికీ తిరిగాం.. ఇప్పుడు మంత్రులను కలవాలంటే కూడా నాన్‌-లోకల్‌ నేతల అపాయింట్‌మెంట్‌ తీసుకోవాల్సి వస్తోంది. మా గోడు ఎవరికి చెప్పుకోవాలి?” అంటూ కొందరు సీనియర్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మంత్రుల క్యాంపు కార్యాలయాలు, జిల్లా పర్యటనలు, అధికారిక కార్యక్రమాల్లోనూ స్థానిక నేతల కంటే బయట ప్రాంతాలకు చెందిన కొందరే ఎక్కువగా కనిపిస్తున్నారనే చర్చ సాగుతోంది. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన క్యాడర్‌లో అసంతృప్తి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో వ్యతిరేకం.. ఇప్పుడు మంత్రులకు అత్యంత సన్నిహితం?
ఇక మరో చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. ఎన్నికల సమయంలో మంత్రుల విజయాన్ని కోరుకోని కొందరే ఇప్పుడు వారి చుట్టూ తిరుగుతూ అత్యంత సన్నిహితులుగా మారారనే విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి. అప్పట్లో ప్రత్యర్థి వర్గాలతో ఉన్నవారు ఇప్పుడు అధికార కేంద్రాల వద్ద కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ మారుతూ.. రాజకీయ అవసరాలకు అనుగుణంగా శిబిరాలు మారుస్తూ వచ్చిన కొందరికి ఇప్పుడు మంత్రుల వద్ద ప్రాధాన్యం ఎందుకు పెరిగిందన్నదే అసలు ప్రశ్నగా మారింది. ఎన్నికల్లో పనిచేసినవారి కంటే.. అధికారం వచ్చాక చేరినవారికే ప్రాధాన్యమా? అన్న చర్చ కాంగ్రెస్‌ శ్రేణుల్లో సాగుతోంది.
అధికారుల వద్ద పెత్తనం.. భూ వ్యవహారాల్లోనూ జోక్యం?
మంత్రుల చుట్టూ తిరుగుతున్న కొందరు నేతలు అధికారుల వద్ద కూడా తమ పలుకుబడిని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో పెద్దగా రాజకీయ బలం లేకపోయినా.. మంత్రులతో సాన్నిహిత్యాన్ని చూపిస్తూ అధికారులపై ప్రభావం చూపుతున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా భూములకు సంబంధించిన వ్యవహారాల్లో కొందరు నేతలు జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రులు జిల్లాలో లేదా నియోజకవర్గంలో లేని సమయంలోనూ సంబంధిత అధికారులను కలుస్తూ పనులు చక్కబెట్టుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. మంత్రులతో సాన్నిహిత్యం చూపిస్తే చాలు.. అధికారుల వద్ద పని జరిగిపోతుందనే భావన ఏర్పడితే అది చివరకు ప్రభుత్వ ప్రతిష్ఠపైనే ప్రభావం చూపుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మంత్రులకు అసలు గోడు చేరుతోందా?
లోకల్‌ నేతల అసంతృప్తికి మరో ప్రధాన కారణం.. మంత్రులకు తమ సమస్యలు నేరుగా చేరడం లేదన్న భావన. మంత్రుల చుట్టూ ఉన్నవారే సమాచారాన్ని ఫిల్టర్‌ చేస్తున్నారని కొందరు నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గంలో పార్టీ ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులు మంత్రుల దృష్టికి పూర్తిస్థాయిలో వెళ్లడం లేదనే చర్చ జరుగుతోంది. “చుట్టూ ఉన్నవాళ్లు చెప్పిందే వింటే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో మంత్రులకు ఎలా తెలుస్తుంది?” అని కొందరు సీనియర్‌ నేతలు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. స్థానిక క్యాడర్‌ను దూరం పెడితే భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.
లోకల్‌ క్యాడర్‌ మౌనం.. రేపటి రాజకీయానికి సంకేతమా?
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు, రాజకీయ అవకాశాలు, అధికారుల వద్ద పనుల విషయంలో తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని కొందరు స్థానిక నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సొంత పార్టీ ప్రభుత్వంపై బహిరంగంగా మాట్లాడితే నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో చాలామంది మౌనంగా ఉంటున్నారనే అభిప్రాయం ఉంది. పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారికి దిక్కు లేకపోతే.. కొత్తగా వచ్చినవారికి పెద్దపీట వేస్తే క్షేత్రస్థాయిలో క్యాడర్‌ మనోధైర్యం దెబ్బతినే ప్రమాదం ఉందని సీనియర్‌ నాయకులు అంటున్నారు. ఈ అసంతృప్తి బహిరంగ నిరసనగా మారకముందే మంత్రులు స్థానిక నాయకులతో నేరుగా మాట్లాడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రానున్న రాజకీయంలో ‘లోకల్‌’ లెక్క కీలకమే!
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్‌ ఉంది. ఎన్నికల విజయాల్లో ఈ క్యాడర్‌ పాత్ర కీలకంగా ఉంది. అలాంటి క్యాడర్‌లోనే ఇప్పుడు అసంతృప్తి పెరుగుతోందన్న చర్చ పార్టీకి రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. లోకల్‌ నాయకులను కలుపుకొంటారా?.. నాన్‌-లోకల్‌ నేతల ప్రభావాన్ని తగ్గిస్తారా? అన్నది ఇప్పుడు మంత్రుల ముందున్న రాజకీయ ప్రశ్నగా మారింది. అధికారంలో ఉన్న సమయంలోనే స్థానిక క్యాడర్‌తో సమన్వయం లేకపోతే.. ఆ ప్రభావం భవిష్యత్‌ రాజకీయ పరిణామాల్లో కనిపించే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. మొత్తంగా మంత్రుల చుట్టూ పెరుగుతున్న నాన్‌-లోకల్‌ వలయం.. లోకల్‌ క్యాడర్‌లో పెరుగుతున్న అసంతృప్తి ఖమ్మం కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయ సమీకరణాలపై కొత్త చర్చకు తెరలేపింది. ఈ అసంతృప్తిని మంత్రులు ఎలా చల్లారుస్తారన్నదే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు క్రేన్లు, గజ ఈతగాళ్లు,...

సేవే శ్వాసగా.. పువ్వాడ కుటుంబం

సేవే శ్వాసగా.. పువ్వాడ కుటుంబం ఏళ్లుగా పేదల కోసం ఉచిత సేవా కార్యక్రమాలు పువ్వాడ...

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.