epaper
Sunday, September 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జనగామ అభివృద్ధికి రూ.40 కోట్లకు పైగా పనులు

జనగామ అభివృద్ధికి రూ.40 కోట్లకు పైగా పనులు
పారిశుధ్యానికి పెద్దపీట.. రూ.1.77 కోట్లతో వాహనాలు
54 మందికి నియామక పత్రాలు అందజేత
మురుగు నీటి శుద్ధి ప్లాంట్‌కు రూ.38 కోట్లతో శ్రీకారం
విద్య, వైద్య, మౌలిక వసతుల పనులకు శంకుస్థాపనలు
జనగామ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నాం
రాష్ట్ర గృహ నిర్మాణం, రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాకతీయ, జనగామ : జనగామ జిల్లా అభివృద్ధికి రూ.40 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర గృహ నిర్మాణం, రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం శ్రీకారం చుట్టారు. జనగామ మున్సిపల్‌ కార్యాలయంలో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి.. పారిశుధ్యం, విద్య, వైద్యం, మౌలిక వసతులకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేశారు. జనగామ మున్సిపాలిటీకి రూ.1.77 కోట్ల విలువైన 16 చెత్త సేకరణ ఆటోలు, ఒక జేసీబీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపాలిటీలో పనిచేసేందుకు ఎంపికైన 30 మంది శానిటరీ వర్కర్లు, 20 మంది డ్రైవర్లు, నలుగురు ఎలక్ట్రీషియన్లు కలిపి 54 మందికి నియామక పత్రాలు అందజేశారు. రూ.2 కోట్లతో చేపట్టనున్న డంపింగ్‌ యార్డు షెడ్‌, మెషినరీ పనులకు, రూ.38 కోట్లతో నిర్మించనున్న మురుగు నీటి శుద్ధి ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు.
తహసీల్దార్‌ కార్యాలయం.. పాఠశాలల్లో పనులు
తరిగొప్పుల మండలంలో రూ.2.25 కోట్లతో నిర్మించనున్న తహసీల్దార్‌ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. బచ్చన్నపేట మండలం కట్కూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, ఎంపీపీఎస్‌ పాఠశాలల్లో రూ.38.75 లక్షలతో చేపట్టనున్న మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు శిలాఫలకాలను ఆవిష్కరించారు. పోచన్నపేట ఎంపీపీఎస్‌లో రూ.24 లక్షలు, రామచంద్రాపురం ఎంపీపీఎస్‌లో రూ.23 లక్షలు, జనగామలోని కోర్టు సమీపంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల బాలికల విభాగంలో రూ.20 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 12 కేజీబీవీలు, 15 పీఎం శ్రీ పాఠశాలలు, 28 జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలల్లో రూ.1,92,31,996 వ్యయంతో అవుట్‌డోర్‌ బాస్కెట్‌బాల్‌ కోర్టుల నిర్మాణ పనులను ప్రారంభించారు. విద్యార్థులకు విద్యతోపాటు క్రీడా వసతులు అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఈ పనులు చేపట్టారు. జనగామ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఆవరణలో రూ.19.25 లక్షలతో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చంపక్‌ హిల్స్‌లోని మాతా-శిశు ఆసుపత్రిలో రూ.7.35 లక్షలతో ఆక్సిజన్‌ ప్లాంట్‌కు 50 మీటర్ల సీసీ రోడ్డు, పార్కింగ్‌ ప్రాంతంలో గ్రావెల్‌ నింపడం, సెప్టిక్‌ ట్యాంక్‌ నుంచి డ్రెయిన్‌ వరకు పైప్‌ డ్రెయిన్‌ ఏర్పాటుకు సంబంధించిన పనులను ప్రారంభించారు. జనగామ ఐడీఓసీ వద్ద రూ.10 లక్షలతో పార్కింగ్‌ టైల్స్‌, ఫెన్సింగ్‌, రూ.31 లక్షలతో కలెక్టరేట్‌ భవనానికి ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జనగామ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి, మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉపసర్పంచ్‌ బీఆర్‌ఎస్‌లో చేరినా కాంగ్రెస్‌కు నష్టం లేదు

ఉపసర్పంచ్‌ బీఆర్‌ఎస్‌లో చేరినా కాంగ్రెస్‌కు నష్టం లేదు ప్రజలిచ్చిన పదవికి, వార్డు ప్రజల...

ఉపన్యాస పోటీల్లో నూతన్ సాయికి తృతీయ స్థానం

ఉపన్యాస పోటీల్లో నూతన్ సాయికి తృతీయ స్థానం జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ...

ఇనుగుర్తిలో కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి ఉపసర్పంచ్‌

ఇనుగుర్తిలో కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి ఉపసర్పంచ్‌ అనుచరులతో కలిసి గులాబీ గూటికి సత్తూరి...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం బీసీల రాజ్యాధికారం కోసం...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి...

వరంగల్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

వరంగల్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం గ్రామస్థాయి నుంచే అంతర్జాతీయ క్రీడాకారులను తయారు...

16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత కాకతీయ, వరంగల్ బ్యూరో : పీడీఎస్...

శ్మ‌శాన వాటికకు దారేది?

శ్మ‌శాన వాటికకు దారేది? కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.