జర్నలిస్టు ఫోరం జిల్లా జాయింట్ సెక్రటరీగా అంబటి సతీష్
కాకతీయ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా డిజిటల్ ఈ-పేపర్, యూట్యూబ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా జాయింట్ సెక్రటరీగా జనం గొంతు తెలుగు దినపత్రిక బ్యూరో చీఫ్ అంబటి సతీష్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఫోరం జిల్లా అధ్యక్షుడు కనుకుంట్ల రమేష్ శనివారం నియామక పత్రాన్ని అందజేశారు. జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఫోరం తరఫున కృషి చేయాలని సూచించారు. జర్నలిస్టుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, జర్నలిస్టుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని అంబటి సతీష్‌కుమార్ తెలిపారు. నియామకం పట్ల పలువురు జర్నలిస్టులు, పాత్రికేయ మిత్రులు ఆయనకు అభినందనలు తెలిపారు.

