ఉపసర్పంచ్‌ల హక్కుల కోసం సమరశంఖం
డిసెంబర్ 27న కరీంనగర్‌లో రాష్ట్రస్థాయి బహిరంగ సభ
కరీంనగర్ జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఆకుబత్తిని విజయ్‌కుమార్
సర్కస్ గ్రౌండ్‌లో సభ.. సన్నాహక సమావేశం, పోస్టర్ ఆవిష్కరణ
కాకతీయ, శంకరపట్నం: గ్రామ పంచాయతీల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులకు తగిన గుర్తింపు, గౌరవం, హక్కులు, అధికారాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 27న కరీంనగర్‌లో రాష్ట్రస్థాయి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఉపసర్పంచ్‌ల ఫోరం నాయకులు తెలిపారు. సభ విజయవంతం కోసం కరీంనగర్‌లోని సంగీత కాన్ఫరెన్స్ హాల్‌లో సన్నాహక సమావేశం నిర్వహించి పోస్టర్‌ను ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఆకుబత్తిని విజయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
గ్రామ పంచాయతీల పాలనలో బాధ్యతలు నిర్వహిస్తున్న తమకు తగిన ప్రాధాన్యం, గుర్తింపు లేకపోవడం బాధాకరమని నాయకులు పేర్కొన్నారు. హక్కులు, అధికారాల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 27న కరీంనగర్ సర్కస్ గ్రౌండ్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి సభకు తెలంగాణవ్యాప్తంగా ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

