మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీలపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి
భూ దందాలు చేస్తే నిరూపించాలి:విజయ్ యాదవ్
కాకతీయ, ఇనుగుర్తి: మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవిత భూదందా చేశారని డాక్టర్ భూక్య మురళి నాయక్ తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదని తొర్రూరు ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కసరబోయిన విజయ్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ శంకర్ నాయక్, కవిత ఎమ్మెల్యే ఎంపీ పదవుల్లో ఉన్నప్పుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించారన్నారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మురళి నాయక్ పరిపాలించడం చేతకాక నిత్యం మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాజీ ఎంపీ కవితలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అవివారికి తగవని, శంకర్ నాయక్ కవిత భూ దందాలు చేస్తే నిరూపించాలని లేదంటే ఇలాంటి ఆరోపణలు మరోసారి చేస్తే సహించేది లేదని విజయ్ యాదవ్ హెచ్చరించారు.

