ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శం
కాకతీయ, పెద్దవంగర :ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శప్రాయుడని తెలంగాణ రాష్ట్ర బీసీ ఇంటిలెక్సవల్ ఫోరమ్ కన్వీనర్ డాక్టర్ కూరపాటి రమేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కొండా లక్ష్మణ్ బాపూజీ 111 వ జయంతి సందర్బంగా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ సమాజం కోసం, ప్రజల హక్కుల కోసం విశేషంగా కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. తొలి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన నేటి తరానికి ఆదర్శప్రాయుడని కొనియాడారు. ప్రజా ఉద్యమం కోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యాగం చేసి పోరాట పంథాను ఎంచుకున్నారని అయన గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ ఇంటిలెక్సవల్ ఫోరమ్ కోఆర్డినేటర్ డాక్టర్ కూరపాటి రాధిక,మహబూబాబాద్ జిల్లా బీసీ ఇంటిలెక్సవల్ ఫోరం కోఆర్డినేటర్ ఎదునూరి శ్రీనివాస్,మండల పద్మశాలి సంఘ అధ్యక్షులు రాపోలు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు గుల్లపల్లి సదానందం, నాయకులు వేముల రాజు,గుడ్ల రమేష్, రాష్ట్ర కోఆర్డినేటర్ కొంగ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

