epaper
Monday, September 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
హక్కులు, బాధ్యతలు తెలుసుకోవడం ప్రతి విద్యార్థి బాధ్యత
సైబర్‌ నేరాలు, బాలల హక్కులపై అవగాహన అవసరం
కరీంనగర్‌ జిల్లా ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆకుబత్తిని విజయ్‌కుమార్‌

కాకతీయ, శంకరపట్నం : కేశవపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల న్యాయ సేవా సమితి–హుజూరాబాద్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కేశవపట్నం ఉపసర్పంచ్‌, కరీంనగర్‌ జిల్లా ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆకుబత్తిని విజయ్‌కుమార్‌ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చిన్ననాటి నుంచే హక్కులు, బాధ్యతలు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బాలల హక్కులు, బాల్య వివాహాల నిషేధం, వేధింపులు, బుల్లీయింగ్‌, సైబర్‌ నేరాలు, సామాజిక మాధ్యమాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఇంటర్నెట్‌ను బాధ్యతాయుతంగా వినియోగించాలని, అపరిచితులతో వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు పంచుకోవద్దని సూచించారు. వేధింపులు, బెదిరింపులు ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులను ఆశ్రయించాలని తెలిపారు. చట్టం అందరికీ సమానమని, న్యాయం పొందేందుకు న్యాయ సేవా సంస్థలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. విద్యార్థులు తమ హక్కులను తెలుసుకోవడంతోపాటు ఇతరుల హక్కులను గౌరవించాలని విజయ్‌కుమార్‌ సూచించారు. కార్యక్రమంలో న్యాయ సేవా సమితి ప్రతినిధులు, న్యాయవాదులు దేవయ్య, నరసింహస్వామి, బక్కి అనిల్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుభాష్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సీఎం సభకు రుద్రంగి నుంచి భారీగా తరలివెళ్లాలి

సీఎం సభకు రుద్రంగి నుంచి భారీగా తరలివెళ్లాలి ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్‌...

జ్వరాలపై పరీక్షలు.. ఉచిత మందుల పంపిణీ

జ్వరాలపై పరీక్షలు.. ఉచిత మందుల పంపిణీ కాకతీయ, చందుర్తి: సీజనల్‌ వ్యాధుల ప్రభావం...

ఎరువుల దుకాణాల్లో స్టాక్‌ రికార్డులు, నిల్వల తనిఖీ

ఎరువుల దుకాణాల్లో స్టాక్‌ రికార్డులు, నిల్వల తనిఖీ మానకొండూర్‌ ఏడీఏ శ్రీధర్‌ ఆధ్వర్యంలో...

అంబేడ్కర్‌పై వ్యాఖ్యలు.. చందుర్తిలో దళితుల ఆగ్రహజ్వాల!

అంబేడ్కర్‌పై వ్యాఖ్యలు.. చందుర్తిలో దళితుల ఆగ్రహజ్వాల! రామస్వామిపై అట్రాసిటీ కేసు.. తక్షణ అరెస్టుకు...

అక్షర జ్ఞానంతో మహిళల్లో కొత్త వెలుగు..!!

అక్షర జ్ఞానంతో మహిళల్లో కొత్త వెలుగు..!! చందుర్తిలో ‘అమ్మకు అక్షరమాల’.. ఉల్లాస్ పరీక్షలకు...

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. - మానాల,...

జర్నలిస్టు ఫోరం జిల్లా జాయింట్‌ సెక్రటరీగా అంబటి సతీష్‌

జర్నలిస్టు ఫోరం జిల్లా జాయింట్‌ సెక్రటరీగా అంబటి సతీష్‌ కాకతీయ, పెద్దపల్లి :...

ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం కాకతీయ, శంకరపట్నం : తెలంగాణ సాయుధ పోరాటంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.