epaper
Monday, September 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జనసభలోనే నా పోరాటం

జనసభలోనే నా పోరాటం
కేసీఆర్‌ మాటలే స్ఫూర్తిగా.. ప్రజల మధ్యే నా ప్రయాణం
పట్టభద్రుల గొంతుకగా మూడేళ్లుగా నా పోరాటం
నిరుద్యోగం.. యువతను పట్టిపీడిస్తున్న సామాజిక సమస్య
కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు భరోసా కావాలి
జెన్‌జీకి సరైన నాయకుడు కేటీఆర్‌
ప్రజలే నా రాజకీయ ఆస్తి.. రాబోయే ప్రభుత్వానికి వారధిగా ఉంటా
నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్‌ కాంటెస్టెడ్‌ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి

ఎన్నికల్లో గెలవడం.. ఓడిపోవడం రాజకీయ ప్రయాణంలో సహజమే. కానీ ప్రజల్లో, ప్రజలతో ఉండాలి. పోరాడుతూ ముందుకు వెళ్లాలి. ‘గో హెడ్‌ రాకేష్‌’ అంటూ మా అధినేత కేసీఆర్‌ చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయాను. చట్టసభలో అడుగుపెట్టే అవకాశం రాకపోయినా.. జనసభలో ఉన్నాను. ప్రజలతోనే ఉన్నాను. గత మూడేళ్లుగా విద్యార్థి నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా అనేక వర్గాల గొంతుకగా పోరాడుతూనే ఉన్నాను. వారి సమస్యలపై ఉద్యమిస్తూనే ఉన్నాను. ఉమ్మడి వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నాను. విద్యార్థి నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం నిరంతరం పోరాడుతున్నానంంటూ నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్‌ కాంటెస్టెడ్‌ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ డిజిటల్‌ మీడియా యూనియన్‌ ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఏనుగుల రాకేష్‌రెడ్డి తన వ్యక్తిగత, రాజకీయ అంశాలపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

 

15 రోజుల ముందే ఎన్నికల బరిలోకి..

బీఆర్ఎస్‌ పార్టీలో చేరిన కొద్దిరోజులకే పార్టీ అధిష్ఠానం నాపై ఎంతో నమ్మకం ఉంచింది. గత ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చింది. అయితే అప్పట్లో పెద్దగా సమయం లేదు. కేవలం 11 రోజుల ముందే ఎన్నికల బరిలోకి దిగాను. అందులో రెండు రోజులు నామినేషన్‌కే వెళ్లిపోయాయి. 34 నియోజకవర్గాలు.. మూడు ఉమ్మడి జిల్లాలు కావడంతో పోటీ చేయాలా.. వద్దా అని తొలుత ఆలోచించాను. దీనికి తోడు పార్టీ అధికారం కోల్పోవడం, వలసలు జరుగుతుండడంతో కొంత భయం కూడా వేసింది. కానీ పార్టీ పెద్దలు ఇచ్చిన ప్రోత్సాహంతో ముందుకు వెళ్లాను. కేటీఆర్‌, హరీశ్‌రావు చెరి సగం బాధ్యత తీసుకుని ప్రచారంలో తిరిగారు. నేను ప్రచారంలోకి దిగిన తర్వాత గెలుపుపై ధీమా పెరిగింది. మల్లన్న అప్పటికే రెండుసార్లు ఓడిపోవడం, పట్టభద్రుల ఓటరు నమోదులో కీలక పరిస్థితులు ఉండటం, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండటం వంటి అంశాలు ఫలితంపై ప్రభావం చూపాయి. నేను కొత్తగా ఎమ్మెల్సీ బరిలో నిలవడం, సమయం లేకపోవడంతో కొంత వెనుకబడ్డాను. అయినా సుమారు 10 వేల ఓట్ల తేడానే వచ్చింది. ఓడిపోయినందుకు బాధపడలేదు. పార్టీ నాకు అండగా నిలిచింది. డిసప్పాయింట్‌ కావద్దని చెప్పింది.

జనసభలో కొట్లాడతానన్న మాటకు కట్టుబడ్డా..

పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్‌ కేంద్రం నుంచే ఒక మాట చెప్పాను. చట్టసభలోకి వెళ్లే అవకాశం రాలేదు.. కానీ మళ్లీ జనసభలోకి వెళ్లి అక్కడి నుంచే కొట్లాడతానని చెప్పాను. ఆ మాటకు కట్టుబడి మూడేళ్లుగా పట్టభద్రుల సమస్యలపై పోరాడుతున్నాను. రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు, 46 జీవోపై సుప్రీంకోర్టుకు వెళ్లాను. గ్రూప్‌-1 అవకతవకలపై ప్రశ్నిస్తే పరువునష్టం దావా వేశారు. ఉద్యోగుల కోసం కూడా పోరాడాను. పీఆర్సీ, డీఏ, ఓపీఎస్‌, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రశ్నించాను. పట్టభద్రుడైన ప్రతి ఒక్కరి సమస్యను నా సమస్యగా భావించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. ఎదురించి పోరాడాను. డీఎస్సీ నిర్వహించకుండా టెట్‌ వేయడం ఏంటని ప్రశ్నించాను. నిరుద్యోగుల బాకీ కార్డు తీసుకొచ్చాను. జలవిహార్‌లో 10 వేల మందితో సభ నిర్వహించాను. యువ సంగ్రామ సభలో కీలకంగా పనిచేశాను. గ్రాడ్యుయేట్‌ సెక్షన్‌లోని ప్రతి సమస్యపై పోరాడాను. పట్టభద్రులు నిర్వహించిన ఆందోళనలకు పిలిస్తే వెళ్లాను.

నిరుద్యోగం ఒక సామాజిక సమస్య..

నిరుద్యోగం ఒక సామాజిక సమస్య. సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఇది చాలా పెద్దది. నిరుద్యోగి జీవితం అధ్వానంగా మారుతుంది. వారి బాధలు చాలా దారుణంగా ఉంటాయి. నేను వాటిని దగ్గరుండి చూశాను. సమాజంలో నిరుద్యోగులపై ఒక చులకన భావన కూడా ఉంటుంది. యువతకు ఉద్యోగం అంటే ఎమోషనల్‌ అటాచ్‌మెంట్‌. ఉద్యోగం కోసం ఎంత తిప్పలైనా పడతారు. ఎన్నేళ్లయినా ఎదురుచూస్తారు. ఈ క్రమంలో వారి వయస్సు, కుటుంబం, సరదాలు ఇలా అన్నీ మిస్‌ అవుతారు. వయసుతో ముడిపడిన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. నోటిఫికేషన్‌ ఎప్పుడు వస్తుందో తెలియదు. వయసు అయిపోతుంటుంది. స్పష్టత లేకపోవడంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం చేసే తప్పిదాల వల్ల యువత మానసిక సంఘర్షణకు గురై దారి తప్పుతున్నారు. యూపీఎస్సీ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. నోటిఫికేషన్‌ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది.

వేణు లేఖ నన్ను కలచివేసింది..

నిరుద్యోగుల సమస్యల్లో నన్ను అత్యంత బాధపెట్టిన ఘటన ఖమ్మంలో వేణు అనే నిరుద్యోగి ఆత్మహత్య. అతను రాసిన లేఖ నాకు కన్నీళ్లు తెప్పించింది. నిరుద్యోగుల జీవితాన్ని కవిత రూపంలో ఆవిష్కరించాడు. ‘ఇల్లు లేదు.. నాన్న తాటి చెట్లు ఎక్కుతడు. అమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. నాకు ఉద్యోగం చేయాలనేది కల’ అని వేణు లేఖలో రాశాడు. ఆ లేఖ చదివినప్పుడు నిరుద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మరోసారి అర్థమైంది. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు నిర్దిష్టమైన జాబ్‌ క్యాలెండర్‌ ఉండాలి. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో ముందే స్పష్టంగా తెలియాలి. అప్పుడే వారు తమ చదువు, కోచింగ్‌, ఉద్యోగ ప్రయత్నాలను ఒక ప్రణాళిక ప్రకారం కొనసాగించగలుగుతారు.

లైబ్రరీలో కనిపించిన నిరుద్యోగుల బాధ..

వరంగల్‌ సెంట్రల్‌ లైబ్రరీకి వెళ్లినప్పుడు అక్కడ చదువుకునే పిల్లల బాధలను కళ్లారా చూశాను. వాళ్లతో కలిసి నేను కూడా భోజనం చేస్తూ మాట్లాడాను. రూ.5 భోజనం చేస్తున్నారని తెలిసింది. ఐదు రోజులూ ఇలాంటి భోజనమే చేస్తారా అని అడిగితే అవునని చెప్పారు. ఇక్కడ భోజనం మిస్‌ అయితే ఛాయ్‌తో కడుపు నింపుకోవాల్సిందేనన్నారు. ఇల్లు వదిలి వచ్చి మూడునాలుగేళ్లు అవుతోందని, ఇంకా తల్లిదండ్రులపై ఆధారపడటం ఎలా అని వాళ్లు చెప్పడం నాకు బాధనిపించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి సిద్ధమవుతున్న నిరుద్యోగుల్లో చాలామందికి ఖరీదైన కోచింగ్‌ ఫీజులు, ట్యూషన్‌ ఫీజులు, హాస్టల్‌ ఖర్చులు భరించే స్థోమత లేదు. అలాంటి విద్యార్థులను, నిరుద్యోగులను నేను చాలా మందిని చూశాను.

కోచింగ్‌ భారం లేకుండా ఈ-క్లాసెస్‌ యాప్‌..

విద్యార్థులు, నిరుద్యోగులకు కొంతైనా ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ‘రాకేశ్‌రెడ్డి ఈ-క్లాసెస్‌ యాప్‌’ను రూపొందించాను. 2026 మేలో ఖమ్మంలో ఈ యాప్‌ను ప్రారంభించాను. అనంతరం హన్మకొండలోనూ ఆవిష్కరించాను. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగులకు కోచింగ్‌ ఫీజు, హాస్టల్‌ వంటి ఖర్చుల భారాన్ని తగ్గించడమే దీని ఉద్దేశం. పోటీ పరీక్షలకు సంబంధించిన కోర్సులు, స్టడీ మెటీరియల్‌, మాక్‌ టెస్టులు, అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధనను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చేలా దీనిని రూపొందించాను. నిరుద్యోగుల కోసం కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే పరిమితం కాలేదు. వారి సమస్యకు నా వంతుగా పరిష్కారం చూపే ప్రయత్నం కూడా చేస్తున్నానని చెప్పేందుకు ఈ-క్లాసెస్‌ యాప్‌ను తీసుకొచ్చాను.

ఔట్‌సోర్స్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల పరిస్థితి దారుణం..

ఔట్‌సోర్స్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్య వర్ణనాతీతం. రాష్ట్రంలో 8 లక్షల మంది ఉద్యోగులు ఉంటే.. అందులో ప్రభుత్వ ఉద్యోగులు 3 లక్షలు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్స్‌ ఉద్యోగులు 5 లక్షలు ఉంటారు. ఏజెన్సీల నుంచి రిక్రూట్‌ చేసుకోవడం వల్ల వారికి జీతాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని శాఖల్లో ఆరు నెలలైనా జీతం పడటం లేదు. ఎన్నటికైనా ప్రభుత్వ ఉద్యోగులం కాలేకపోతామా అనే ఒక్క చిన్న ఆశతో పనిచేస్తున్నారు. కానీ ఔట్‌సోర్స్‌లో స్టార్ట్‌ అయి.. ఔట్‌సోర్స్‌లోనే రిటైర్‌ అవుతున్నారు. వాళ్లకు కూడా ప్రభుత్వం నుంచి జీతభత్యాలు ఇవ్వాలి. వాళ్ల కోసం ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి అందులోంచి జీతం ఇవ్వాలి. ఔట్‌సోర్స్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను గుర్తించి వారికి హెల్త్‌ కార్డు, ఉద్యోగ భద్రత కల్పించాలి. నెలనెలా వేతనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

నైపుణ్యాలతో ఉపాధి.. శిఖర స్కిల్‌ సెంటర్‌..

నిరుద్యోగ సమస్యను కేవలం ఉద్యోగ నోటిఫికేషన్లు, పోటీ పరీక్షల కోణంలోనే చూడకుండా.. నైపుణ్యాలు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా కూడా కొంతవరకు పరిష్కరించవచ్చని నేను భావించాను. అందుకే ‘శిఖర స్కిల్‌ సెంటర్‌’ను ప్రారంభించాను. మహిళలకు ఉచితంగా వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నాను. మహిళలు ఆర్థికంగా స్వయం ఆధారితంగా మారేలా టైలరింగ్‌, బ్యూటీషియన్‌, మగ్గం వర్క్‌ వంటి శిక్షణలు అందిస్తున్నాం. శిక్షణ పొందిన తర్వాత ఉద్యోగం చేసుకోవడంతోపాటు సొంతంగా ఉపాధి, చిన్న వ్యాపారం ఏర్పాటు చేసుకునే అవకాశాలు కల్పించడమే దీని ఉద్దేశం. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండదు. ఉపాధి కల్పించినా నిరుద్యోగాన్ని తగ్గించవచ్చు. ముఖ్యంగా మహిళలు ఒక నైపుణ్యం నేర్చుకుని తమ కాళ్లపై తాము నిలబడాలి. అందుకే శిఖర స్కిల్‌ సెంటర్‌ ద్వారా వారికి అవసరమైన నైపుణ్యాల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నాను.

ఖమ్మంపై ఈసారి ప్రత్యేక దృష్టి..

గత పట్టభద్రుల ఎన్నికల్లో ఖమ్మంలో నాకు తక్కువగా ఓట్లు వచ్చాయి. అందుకే ఈసారి అక్కడ ఎక్కువగా ఫోకస్‌ చేశాను. ఖమ్మం రాకేశ్‌రెడ్డి పుట్టిన గడ్డ అనే స్థాయిలో తిరిగాను. కార్యక్రమాలు నిర్వహించాను. అక్కడి పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులు నన్ను అదే స్థాయిలో రిసీవ్‌ చేసుకున్నారు. పట్టభద్రులకు అండగా నిలవాలని, వాళ్ల సమస్యలపై పోరాడాలని సంకల్పించుకుని మూడేళ్లు కాలుకు చక్రాలు కట్టుకుని తిరిగాను. ‘‘గోదావరి ఇవతల.. అవతల పరుగులు తీసినట్టే సాగింది ఈ మూడేళ్లు’’ అని చెప్పగలను. మూడు ఉమ్మడి జిల్లాలు వరంగల్‌, నల్గొండ, ఖమ్మం మూడు విభిన్న నేపథ్యాలున్న ప్రాంతాలు. ఒక్కో జిల్లాలో ఒక్కో తీరు ఉంది. ఎమ్మెల్సీ బరిలో నిలవడం, ప్రచారం చేయడం, ఇప్పుడు సమస్యలపై తిరగడం నాకు గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. ఎమ్మెల్సీ అనేది కలలో కూడా ఊహించలేదు. కానీ నాకు ఒక మంచి అనుభవాన్ని ఇచ్చింది.

కేసీఆర్‌ ఒక శిఖరం..

కేసీఆర్‌ లాంటి నాయకుడు మరొకరు ఉండరు. రారు. ఆయన ఒక శిఖరం. ఆయనకు ఆయనే సాటి. కేసీఆర్‌ ఉద్యమ నేతగా అందరూ ఆదరించే వ్యక్తి. తెలంగాణ కోసం కొట్లాడి సాధించి చూపించారు. ఎందుకోసం తెలంగాణ తెచ్చుకున్నామో.. ఆ సమస్యలను పరిష్కరించారు. రైతుబంధు, ఫ్లోరైసిస్‌ సమస్యను గట్టెక్కించేందుకు మిషన్‌ భగీరథ, నేత కార్మికుల కోసం చేనేత బంధు, కల్యాణలక్ష్మి ఇలా ప్రతి ఒక్కటి ప్రజల సమస్యలను కళ్లతో చూసి పెట్టినవే. తెలంగాణలోని ప్రతి సమస్యపై ఆయనకు అవగాహన ఉంది. ఆయన ఎప్పుడు ఖాళీగా ఉండరు. బయటికి రారు అని అంతా అంటుంటారు. కానీ రాష్ట్రంలోని సమస్యలపై మేథోమథనం చేస్తుంటారు. ఒకసారి కేసీఆర్‌తో కలిసి లంచ్‌ చేస్తూ మాట్లాడినప్పుడు.. ‘‘నా పొలంలో నీళ్లు ఎలా ఉన్నాయో.. ఎరువులు సరిపడా ఉన్నాయో లేవో ఎలా చూసుకుంటానో.. రాష్ట్రంలోని ప్రతి పొలాన్ని అలాగే చూసుకోవాలని నా కోరిక’’ అని చెప్పారు. అందుకే ఆయన ఎప్పుడు రివ్యూలు పెట్టినా మొదట వ్యవసాయం, రైతులపైనే ఉండేది.

జెన్‌జీలకు సరైన నాయకుడు కేటీఆర్‌..

కేటీఆర్‌ ప్రస్తుత జనరేషన్‌కే కాకుండా రానున్న తరాలను కూడా ఆలోచిస్తారు. కేటీఆర్‌ అంటే ఫ్రంట్‌ లీడర్‌. ఎప్పుడూ కొత్త కోణంలో రాజకీయం చేయాలని చెబుతుంటారు. ఇప్పుడు నాయకులంతా జెన్‌జీ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఐటీ హబ్‌, టీఎస్‌ఐపాస్‌ ఇలా ఎన్నో కార్యక్రమాలను వారి కోసమే తీసుకొచ్చారు. జెన్‌జీలు పాలనలో వేగం, కచ్చితత్వాన్ని కోరుకుంటారు. ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. అందుకే జెన్‌జీ తరానికి కేటీఆర్‌ సరైన నాయకుడు. హరీశ్‌రావు కూడా ఛరిష్మా ఉన్న నాయకుడు.

ఈసారి బీఆర్ఎస్‌ జెండా ఎగరడం ఖాయం..

ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ జెండా ఎగరడం ఖాయం. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌పై యువతలో కొంత వ్యతిరేకత ఉన్నది వాస్తవమే. కానీ ఇప్పుడు ఆ భావన పోయింది. కేసీఆర్‌ హయాంలోనే రెండు లక్షల ఉద్యోగాలు వచ్చాయి. నోటిఫికేషన్లు వచ్చాయనే విషయం యువతకు అర్థమైంది. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల ఆశలతో ఆడుకుంది. ఈ విషయాన్ని యువత గమనించింది. సింగరేణిలో కారుణ్య నియామకాలు కూడా చాలా పెద్ద విజయం. సింగరేణిలో 30 వేల ఉద్యోగాలుంటే అందులో 18 వేలు కారుణ్య నియామకాలు బీఆర్ఎస్‌ హయాంలోనే జరిగాయి. కేసీఆర్‌ ఏనాడు ఉద్యోగాలు ఇచ్చి నియామక పత్రాలు అందించి ప్రచారం చేసుకోలేదు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా మరోసారి అవకాశం వస్తుందన్న నమ్మకం ఉంది.

నిజాయితీగా కొట్లాడతా.. ప్రజలే నా రాజకీయ ఆస్తి..

ఈ మూడేళ్లలో రామకోటి రాసినదానికంటే ఎక్కువగా నేను నిరుద్యోగుల సమస్యను పట్టించాను. నేను ఇచ్చే హామీ ఒక్కటే.. ప్రభుత్వాన్ని నిజాయితీగా నిలదీస్తా. పట్టభద్రుల సమస్యలపై నిజాయితీగా కొట్లాడతా. సభా గౌరవం పెంచేలా వ్యవహరిస్తా. రాబోయే బీఆర్ఎస్‌ ప్రభుత్వానికి వారధి అవుతా. ఏ సమస్యల కోసం కొట్లాడానో.. ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తా. మూడు ఉమ్మడి జిల్లాల్లోని నేతలంతా నాకు సహకరిస్తున్నారు. కేటీఆర్‌, హరీశ్‌రావు చెరి సగం బాధ్యత తీసుకుంటారు. అందరితో కలిసి పోయాను. తాజాగా కేటీఆర్‌ మూడు జిల్లాల నాయకులతో సమావేశమై.. ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీని కైవసం చేసుకోవాలని సూచించారు. గతసారి దగ్గరకు వచ్చి చేజారిపోయింది. ఈసారి విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది.

రాజకీయాలంటే ఇష్టం..అందుకే ఇటు వైపు వ‌చ్చా..

ఉద్యోగాన్ని, సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం పనిచేయడం నాకు సంతృప్తినిస్తోంది. ఏడేళ్లపాటు ఉద్యోగం చేశాను. నేను ఉద్యోగం వదిలే సమయానికి ఏడాదికి రూ.24 లక్షల ప్యాకేజీ నాది. సిటీ బ్యాంక్‌, ఫేస్‌బుక్‌ లాంటి సంస్థల్లో పనిచేశాను. రాజకీయాలంటే ఇష్టం ఉండడంతో 2013లో ఉద్యోగం వదిలి బీజేపీలో చేరాను. సమస్యలు చూస్తూ.. ఎదుర్కొంటూ పెరిగాను. వాటిని పరిష్కరించేలానే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయ ప్రయాణంలో ఆస్తులు అమ్ముకున్నా.. ప్రజలతో ఏర్పడిన అనుబంధమే నాకు పెద్ద సంపద. రాజకీయంలో ఆస్తులు అమ్ముకున్న బాధ కంటే పోగు చేసుకున్న జనం ఎక్కువ అనే ఆనందం ఉంది. యూత్‌ నన్ను ఇష్టపడతారని నమ్ముతున్నాను. హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌ నా స్వగ్రామం. తల్లిదండ్రులు గోపాల్‌రెడ్డి, కోమల. తమ్ముడు సుఖేష్‌రెడ్డి. పదో తరగతి వరకు వరంగల్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదివాను. ఇంటర్‌ గుంటూరులో పూర్తి చేశాను. స్టేట్‌లో 9వ ర్యాంకు రావడంతో బిట్స్‌ పిలానీలో అడ్మిషన్‌ పొందాను. అక్కడ స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌లో పనిచేశాను. రెండుసార్లు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాను. ఆ తర్వాత ఏడేళ్లపాటు ఉద్యోగం చేశాను. ఉద్యోగం వదిలే సమయానికి ఏడాదికి రూ.24 లక్షల ప్యాకేజీ ఉండేది. 2013లో ఉద్యోగం వదిలి బీజేపీలో చేరాను. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మూడు ఎకరాల భూమిని అమ్ముకున్నాను. వరంగల్‌లో స్మార్ట్‌ సిటీతోపాటు స్లమ్‌ సిటీనీ చూశాను. బీజేపీలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికీ వెళ్లాను. ఒక్కో ఇంట్లో పది నిమిషాలు కూర్చొని వారి కష్టసుఖాలు తెలుసుకున్నాను. వాళ్లు కూడా నన్ను అంతే ఆప్యాయంగా స్వీకరించారు. అదే ప్రజల అనుబంధం.. అదే నా రాజకీయ ఆస్తి.

ఉత్త‌రం కాక‌తీయ ఎడిట‌ర్‌
అరెల్లి కిర‌ణ్ గౌడ్‌
-7396604266

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నగర పరిశుభ్రతలో నిర్లక్ష్యానికి తావులేదు

నగర పరిశుభ్రతలో నిర్లక్ష్యానికి తావులేదు చెత్త సేకరణ, వ్యర్థాల తరలింపుపై ప్రత్యేక దృష్టి జీడబ్ల్యూఎంసీ...

16 ఏళ్ల తర్వాత తెరుచుకున్న బడిలో విద్యార్థులకు చేయూత

16 ఏళ్ల తర్వాత తెరుచుకున్న బడిలో విద్యార్థులకు చేయూత సొంత నిధులతో రూ.10...

రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం

రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి లోపాలను...

రూ.10 వేలతో 100 కప్పులు, సాసర్ల అందజేత

రూ.10 వేలతో 100 కప్పులు, సాసర్ల అందజేత గీసుకొండ సర్పంచ్‌ వీరగోని రాజ్‌కుమార్‌...

ఆక్రమణలపైనే రోడ్డు వేస్తారా?

ఆక్రమణలపైనే రోడ్డు వేస్తారా? ఆక్రమణలు తొలగించకుండానే రోడ్డు నిర్మాణానికి అధికారుల హడావుడి కమిషనర్‌ క్షేత్రస్థాయిలో...

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కాదు.. ప్రజల గుండెల్లో ఉన్నారు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కాదు.. ప్రజల గుండెల్లో ఉన్నారు ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానం...

ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి

ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి ఆక్రమణలకు తావులేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి ప్రభుత్వ...

ఆలస్యమైనా అదిరిపోయింది

ఆలస్యమైనా అదిరిపోయింది కొత్త యూనిఫామ్‌లతో విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఆనందం దుస్తులతోపాటు బూట్లు, బెల్టుల పంపిణీ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.