కేటీఆర్‌ను కలిసిన పెద్ది స్వప్న
నర్సంపేట నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చ
కాకతీయ, నర్సంపేట టౌన్ : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి, మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. సుదర్శన్‌రెడ్డి మృతిచెందిన అనంతరం తొలిసారిగా కేటీఆర్‌ను కలిసిన ఆమె కుటుంబ పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కుటుంబ యోగక్షేమాలు, పిల్లల చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నర్సంపేట నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగినట్లు సమాచారం. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తానని కేటీఆర్ స్వప్నకు తెలిపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

