epaper
Tuesday, September 29, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గ్రామ ప్రజల ఆరోగ్యం కోసమే హెల్త్‌ క్యాంప్‌

గ్రామ ప్రజల ఆరోగ్యం కోసమే హెల్త్‌ క్యాంప్‌
చిన్ననాగారం సర్పంచ్‌ చెడుపాక సుజాత యాకయ్య
177 మందికి వైద్య పరీక్షలు.. ఉచిత మందుల పంపిణీ

కాకతీయ, ఇనుగుర్తి: గ్రామ ప్రజల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయించినట్లు సర్పంచ్‌ చెడుపాక సుజాత యాకయ్య తెలిపారు. మంగళవారం ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో సేవ్‌ యువర్‌ లివర్‌ ఫౌండేషన్‌, సాయిరాం హాస్పిటల్స్‌ సహకారంతో ఉచిత వైద్య శిబిరం, మందుల పంపిణీ నిర్వహించారు. సర్పంచ్‌ చెడుపాక సుజాత యాకయ్య, ఎంపీడీవో పార్థసారధి, వార్డు సభ్యులు శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామంలోని పేదలు వివిధ రుగ్మతలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఖమ్మం నుంచి వైద్య నిపుణులు వచ్చి సేవలందించడం అభినందనీయమని సర్పంచ్‌ తెలిపారు. సేవ్‌ యువర్‌ లివర్‌ ఫౌండేషన్‌, సాయిరాం హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని ఎంపీడీవో పార్థసారధి అన్నారు. సుమారు 25 మంది వైద్యులు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు సేవలందించారని తెలిపారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న 177 మందికి వైద్య సేవలు అందించి, పరీక్షల అనంతరం ఉచిత మందులు పంపిణీ చేసినట్లు ఫౌండేషన్‌ డైరెక్టర్‌ గెడ్డం సామ్యూల్‌ తెలిపారు. డాక్టర్‌ ప్రశాంతి, డాక్టర్‌ పవన్‌, వైద్య సిబ్బంది సేవలందించారు. మాజీ సర్పంచ్‌ బైరు చిన్న బాలయ్య, వార్డు సభ్యులు నిడిగంటి చంద్రమౌళి, మునిగంటి సరిత రాజు, చెడుపాక అలివేలు వెంకన్న, బైరు నాగన్న, కొయ్యడి యాదగిరి, బత్తిని రాములు గౌడ్‌, పెదగోని వెంకటయ్య, బైరు యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రమాదాల నివారణే లక్ష్యం

ప్రమాదాల నివారణే లక్ష్యం వర్ధన్నపేట,రాయపర్తిలో రోడ్డు ప్రమాద స్థలాల పరిశీలన వరంగల్...

పాఠశాలలో ఐటీడీఏ పీఓ ఆకస్మిక తనిఖీ

పాఠశాలలో ఐటీడీఏ పీఓ ఆకస్మిక తనిఖీ విద్యార్థుల విద్యా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ...

పారిశుద్ధ్యంలో జవాన్లదే కీలక పాత్ర

పారిశుద్ధ్యంలో జవాన్లదే కీలక పాత్ర ప్రతి వార్డుపై జవాన్లు పూర్తి పట్టు సాధించాలి నిర్లక్ష్యంపై...

మేడారంలో ‘ప్యారడైజ్‌’ చిత్ర బృందం

మేడారంలో ‘ప్యారడైజ్‌’ చిత్ర బృందం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నాని, సంపూర్ణేశ్‌బాబు,...

తండ్రిని కర్రతో కొట్టి చంపిన తనయుడు

తండ్రిని కర్రతో కొట్టి చంపిన తనయుడు మద్యం మత్తులో తల్లిని కొడుతున్నాడని ఘాతుకం కర్రతో...

కాంగ్రెస్‌ నుంచి ఐదుగురి బహిష్కరణ

కాంగ్రెస్‌ నుంచి ఐదుగురి బహిష్కరణ లక్ష్మణ్‌ నాయక్‌పై దాడి ఘటనలో క్రమశిక్షణ చ‌ర్య‌లు హనుమకొండ...

గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి గుండె నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు.. వైద్యులను సంప్రదించాలి ధూమపానం,...

కేటీఆర్‌ను కలిసిన పెద్ది స్వప్న

కేటీఆర్‌ను కలిసిన పెద్ది స్వప్న నర్సంపేట నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చ కాకతీయ, నర్సంపేట...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.