బేతుపల్లి చెరువు కథ సుఖాంతం
అందరూ సేఫ్….
బేతుపల్లి చెరువును సందర్శించిన మంత్రి తుమ్మల
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్డిఆర్ఎఫ్, ఎన్ డి ఆర్ ఎఫ్ , ఫైర్ సిబ్బందికి ప్రత్యేక
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కాకతీయ, ఖమ్మం బ్యూరో:
ఈరోజు ఉదయం సత్తుపల్లి మండల పరిధిలోని బేతుపల్లి చెరువు వద్ద ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ , ఫైర్ సిబ్బందిని కలుసుకొని వారిని అభినందించారు. నిన్న సాయంత్రం ఎనిమిది మంది మత్స్యకారులు చిక్కుకొనగా వారిని రక్షించేందుకు వెళ్లిన ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాల పడవ బోల్తా పడిన సంఘటన విధితమే….వాళ్లందరిని క్షేమంగా ఒడ్డుకి చేర్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ,ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలను ఫైర్స్ సిబ్బందిని , తుమ్మల అభినందించారు. నిన్న సాయంత్రం నుంచి బేతుపల్లి చెరువు వద్ద ఉండి ఈ దుర్ఘటనను పర్యవేక్షించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులకు స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాఘమై దయానంద విజయ్ కుమార్ లకి మంత్రి తన ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాత్రి వేళ అయినా చిమ్మ చీకటిలో ఈ 16 మంది సురక్షితంగా బయటికి రావటం ఆనందాన్ని కలిగించిందని మంత్రి తుమ్మల తెలిపారు. జరిగిన సంఘటనని నిన్న సాయంత్రం నుంచి మంత్రి స్వయంగా అధికారులు స్థానిక శాసన సభ్యురాలు తో కలిసి ఆయన నిరంతరం పర్యవేక్షించారు.


