epaper
Friday, November 6, 2026
epaper
BREAKING NEWS
Loading News...

2028 ఎన్నికల్లో బీసీల రాజకీయ సునామీ!

2028 ఎన్నికల్లో బీసీల రాజకీయ సునామీ!
ఓటు యుద్ధంతో రాజ్యాధికారం సాధిస్తాం
ప్రాతినిధ్యం కల్పించని పార్టీలకు రాజకీయంగా బుద్ధి చెబుతాం
బీసీ కులగణన కోసం దేశవ్యాప్త ఉద్యమం అవసరం
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ 
కాకతీయ, హైదరాబాద్ : ఓటు అనే ఆయుధంతో బీసీలంతా ఐక్యంగా నిలిస్తే వచ్చే ఎన్నికల్లో బీసీలే పాలకులవుతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. 2028 ఎన్నికల్లో బీసీలు రాజకీయ సునామీ సృష్టిస్తారని, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించని పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమరయ్య హాల్‌లో కనకాల శ్యాం కుర్మ అధ్యక్షతన జరిగిన బీసీ యువజన సంఘం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు అసెంబ్లీ, పార్లమెంటులో తగిన రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం అన్యాయమని జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వస్తున్న పార్టీలు వారికి సీట్లు కేటాయించడం లేదని, కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం లేదని విమర్శించారు. యువత ఇప్పటి నుంచే రాజకీయ చైతన్యంతో ఓటు యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ బీసీల్లో రోజురోజుకూ రాజకీయ చైతన్యం పెరుగుతోందన్నారు. ఈ చైతన్యాన్ని విస్మరించే పార్టీలు అధికారంలోకి రావడానికి వీలులేదని పేర్కొన్నారు. బీసీ కులగణన కోసం దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. మాజీ స్పీకర్‌, ప్రస్తుత శాసనమండలిలో బీఆర్‌ఎస్‌ పక్షనేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ బీసీలు రాజకీయాల్లో యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని, అన్ని పార్టీలు బీసీ ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్న ప్రజల ఆకాంక్షను గుర్తించాలని అన్నారు.
బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఈడిగ శ్రీనివాస్‌
సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఈడిగ శ్రీనివాస్‌ గౌడ్‌ను జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ నియమించారు. తాండూరు పట్టణం రెడ్డిగణపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ గౌడ్‌ విద్యార్థి దశ నుంచి 15 ఏళ్లుగా బీసీ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని, జిల్లా అధ్యక్షుల సూచన మేరకు ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్ష పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా స్వీకరిస్తున్నానని, గ్రామస్థాయి నుంచి సంఘాన్ని బలోపేతం చేసి బీసీల రాజకీయ అధికార సాధనకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, కుందారం గణేష్‌ చారి, కుల్కచర్ల శ్రీనివాస్‌ ముదిరాజ్‌, తాటికొండ విక్రమ్‌ గౌడ్‌, రావులకోల్‌ నరేష్‌ ప్రజాపతి, గొడుగు మహేష్‌ యాదవ్‌, పిట్ల శ్రీధర్‌, ఉప్పరి శేఖర్‌ సగర, కాటేపల్లి వీరస్వామి, కౌల జగన్నాథం, చంద్రశేఖర్‌ గౌడ్‌, డాక్టర్‌ రామాదేవి, పానుగంటి విజయ్‌, జాజుల లింగం గౌడ్‌, గూడూరు భాస్కర్‌ మేరు, కొప్పుల చందు గౌడ్‌, బూడిద మల్లికార్జున్‌ యాదవ్‌, తారకేశ్వరి, సంధ్యారాణి, గోద వరుణ్‌ కుమార్‌ గౌడ్‌, గౌతమి, స్వర్ణ గౌడ్‌, ఇంద్రం రజక, గజ్జెల సత్యరాజ్‌ గౌడ్‌, లక్ష్మణ్‌, సిద్ధాంతం శ్యామల, గుంటి మహేష్‌, దేవిక, శ్రావణి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మహిళలపై దాడి చేసిన వారిని జైలుకు పంపాలి!

మహిళలపై దాడి చేసిన వారిని జైలుకు పంపాలి! అల్మాస్‌గూడ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం డాక్టర్‌...

తెలంగాణలో బీజేపీ ఆటలు సాగనివ్వం!

తెలంగాణలో బీజేపీ ఆటలు సాగనివ్వం! కులమతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను ప్రజలు...

దమ్ముంటే బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి

దమ్ముంటే బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి నాగ్‌పూర్‌లో కాంగ్రెస్‌ గెలుపుతో బీజేపీకి భయం కాంగ్రెస్‌ సీనియర్‌...

జనగణనలో ఓబీసీ కాలమ్‌ తప్పనిసరిగా చేర్చాలి!

జనగణనలో ఓబీసీ కాలమ్‌ తప్పనిసరిగా చేర్చాలి! కులాలవారీ లెక్కలతోనే బీసీల జనాభాపై స్ప‌ష్ట‌త‌ మంత్రి...

ఓటు చోరీపై సమరభేరి!

ఓటు చోరీపై సమరభేరి! నవంబర్‌ 1న ఢిల్లీ నిరసనకు సన్నాహాలు గల్లీగల్లీలో ఓటు హక్కుల...

బ్రిక్స్‌ వేదికపై తెలంగాణ గొంతు

బ్రిక్స్‌ వేదికపై తెలంగాణ గొంతు ఢిల్లీ సమావేశాలకు బయలుదేరిన శాసనసభాపతి రాష్ట్ర ప్రగతి, కీలక...

నీటి వృథాపై జలమండలి కొరడా

నీటి వృథాపై జలమండలి కొరడా ప్యారడైజ్‌ హోటల్‌కు రూ.20 వేల జరిమానా తనిఖీల్లో తాగునీటి...

నీటి పొదుపే.. భవిష్యత్తుకు భరోసా!

నీటి పొదుపే.. భవిష్యత్తుకు భరోసా! ప్రతి ఇంట్లో 20 శాతం నీటి వినియోగం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.