epaper
Saturday, November 7, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పాకాల సరస్సులో ఇద్దరు చిన్నారులతో కలిసి వివాహిత ఆత్మహత్య

పాకాల సరస్సులో ఇద్దరు చిన్నారులతో కలిసి వివాహిత ఆత్మహత్య

*మృతురాలు గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన ఈరెల్లి మమతగా గుర్తింపు..

*కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక సమాచారం.. భర్త మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడని గ్రామస్తుల ఆరోపణ..

కాకతీయ, గీసుగొండ/ఖానాపూర్:
కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత తన ఇద్దరు చిన్న కుమార్తెలతో కలిసి పాకాల సరస్సులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులో గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన ఈరెల్లి మమత (30),తన కుమార్తెలు హర్షిణి (4),కావ్య (3)తో కలిసి ప్రాణాలు విడిచారు. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన మమత ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన ఈరెల్లి సుమన్ సుమారు ఎనిమిదేళ్ల క్రితం హసన్‌పర్తి మండలం బైరాన్‌పల్లికి చెందిన మమతను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు.సుమన్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, మమత నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించు కుంటున్నారు.ఈ క్రమంలో సుమన్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని,ఈ విషయమై మమత ప్రశ్నించడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ పరిణామాలతో మనస్తాపానికి గురైన మమత తన ఇద్దరు చిన్నారులతో కలిసి పాకాల సరస్సులో దూకినట్లు పేర్కొన్నారు.సమాచారం అందుకున్న ఖానాపురం ఎస్ఐ రామ్మోహన్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు,ఆత్మహత్య కు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో ఎలుకుర్తి హవేలీ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప బొగ్గు గనిపై ఎన్‌జీటీ సుమోటో కేసు!

రామప్ప బొగ్గు గనిపై ఎన్‌జీటీ సుమోటో కేసు! వారసత్వ కట్టడం సమీపంలో గని...

పది పాఠశాలలకు చేరని సీఎం బ్రేక్‌ఫాస్ట్‌!

పది పాఠశాలలకు చేరని సీఎం బ్రేక్‌ఫాస్ట్‌! అల్పాహారం అందక ఆకలితోనే తరగతి గదుల్లో...

ఇనుగుర్తి ఫారెస్ట్ బౌండరీల గుర్తింపు..

ఇనుగుర్తి ఫారెస్ట్ బౌండరీల గుర్తింపు.. అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు తొర్రూర్...

పేదల గుడిసెలు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా?

  పేదల గుడిసెలు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? వైఎస్సార్‌ నగర్‌ వాసులకు వెంటనే పట్టాలు...

పేదల గుడిసెల జోలికొస్తే ఊరుకునేది లేదు!

పేదల గుడిసెల జోలికొస్తే ఊరుకునేది లేదు! వైఎస్సార్‌ నగర్‌ వాసులకు అండగా ఉంటా 30...

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్‌ను రద్దు చేయాలి

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్‌ను రద్దు చేయాలి కాలం చెల్లిన క‌మిటీకి కొన‌సాగే...

పెద్దవంగరను కరువు మండలంగా ప్రకటించాలి.

పెద్దవంగరను కరువు మండలంగా ప్రకటించాలి. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య,మండల నాయకుల...

యూరిన్ టెస్టులతో గంజాయి వినియోగదారుల గుర్తింపు.. ముగ్గురు పట్టివేత

యూరిన్ టెస్టులతో గంజాయి వినియోగదారుల గుర్తింపు.. ముగ్గురు పట్టివేత THC ఆనవాళ్లు గుర్తించిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.