epaper
Thursday, November 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తెలంగాణ బిడ్డలు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలి..

తెలంగాణ బిడ్డలు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలి..

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

కాజీపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన..

కాకతీయ, వరంగల్ బ్యూరో :తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించి, ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, దేశంలో ఎక్కడా లేని విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బుధవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కాజీపేట ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రాంగణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, అభివృద్ధి సాధ్యమని, అందుకే ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కోటి సుమారు రూ.200 కోట్ల వ్యయంతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేశామని, ఒక్కో పాఠశాలను 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల విద్యార్థులు ఒకే ప్రాంగణంలో కలిసి చదువుకునేలా 12వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్య అందించనున్నట్లు వివరించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పారు. విద్యార్థులకు యూనిఫాం, బూట్లు, పుస్తకాలు, బ్యాగులతో పాటు రవాణా సదుపాయం కల్పిస్తామని, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తామని తెలిపారు. కుటుంబ అనుబంధాలకు ఆటంకం కలగకుండా సెమీ రెసిడెన్షియల్ విధానంలో పాఠశాలలు పనిచేస్తాయని పేర్కొన్నారు.

27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం..

రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు ఒకేసారి ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించామని భట్టి విక్రమార్క తెలిపారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేసిన పోషకాహారాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఒక గంట వ్యవధిలో ఇంతమంది విద్యార్థులకు అల్పాహారం అందించడం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ ప్రత్యేకమైన కార్యక్రమమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ విద్యావ్యవస్థను ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ హనుమకొండ నగరంతో పాటు కాజీపేట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, అందులో భాగంగానే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్ గౌడ్, ఆర్డీవో వెంకటేశ్, తహసీల్దార్ రాజు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డిప్యూటీ సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం!

డిప్యూటీ సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం! భ‌ట్టి కాళ్ల‌పై ప‌డిన ఎన్‌హెచ్ఎం మ‌హిళా...

ప్రభుత్వ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు

ప్రభుత్వ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు...

టీజీపీఎస్సీ ఛైర్మన్ తో కలెక్టర్ భేటీ..!

టీజీపీఎస్సీ ఛైర్మన్ తో కలెక్టర్ భేటీ..! - హన్మకొండ ఆర్ అండ్ బి...

ఆడా.. మగా.. చెప్తే జైలే..! స్కానింగ్ సెంటర్లపై కలెక్టర్ కొరడా..!

ఆడా.. మగా.. చెప్తే జైలే..! స్కానింగ్ సెంటర్లపై కలెక్టర్ కొరడా..! - వరంగల్...

భూరీసర్వే లో తప్పు చేస్తే జైలే

భూరీసర్వే లో తప్పు చేస్తే జైలే నవంబర్ నెలాఖరులోగా తొలి విడత 70...

‘తెలంగాణ వంటిల్లు’ నూతన రెస్టారెంట్ ప్రారంభం

‘తెలంగాణ వంటిల్లు’ నూతన రెస్టారెంట్ ప్రారంభం *రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన యూత్...

సూర్య తండాకు కమ్యూనిటీ కోఆర్డినేటర్ నియమించాలి…

సూర్య తండాకు కమ్యూనిటీ కోఆర్డినేటర్ నియమించాలి... డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగపద్మజకు సూర్య...

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి ఏటూరునాగారం జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.