ఘనంగా గుట్టయ్యగౌడ్ జన్మదిన వేడుకలు
కాకతీయ, నెల్లికుదురు:మండలంలోని నైనాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు పెరుమాండ్ల గుట్టయ్యగౌడ్ జన్మదిన వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీ నందు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన యుద్ధనౌక మారోజు వీరన్న కుమార్తె దిశా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని గుట్టయ్య గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గుగులోత్ జగన్ నాయక్, మహబూబాబాద్ మాజీ సర్పంచ్ భూక్య నెహ్రూ నాయక్, ట్రైబల్ జేఏసీ నాయకులు రవీందర్ రాథోడ్, సురేష్ నాయక్, భాస్కర్ నాయక్, నరేష్ నాయక్, లక్ష్మణ్ ముదిరాజ్తో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

