epaper
Thursday, November 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అల్పాహార పథకంతో అద్భుత ఫలితాలు

అల్పాహార పథకంతో అద్భుత ఫలితాలు
విద్యార్థుల్లో పోషకాహార లోపం తగ్గుదల.. పాఠశాలల్లో పెరుగుతున్న హాజరు శాతం

కాకతీయ,శంకరపట్నం:ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు పాఠశాలల్లో హాజరు శాతం పెంపొందించేందుకు అల్పాహార పథకం ఎంతగానో దోహదపడుతోందని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో హరే కృష్ణ మూవ్‌మెంట్ (అక్షయ పాత్ర) ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం 8:30 గంటలకు నాణ్యమైన, పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమన్నారు. మిల్లెట్, రాగిజావ, పాలు వంటి పోషకాహారం తీసుకోవడం వల్ల విద్యార్థుల్లో రక్తహీనత, బలహీనత తగ్గడంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఉదయం ఖాళీ కడుపుతో పాఠశాలలకు వచ్చే నిరుపేద విద్యార్థులకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరమని, తల్లిదండ్రులపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందని తెలిపారు. విద్యార్థులు పౌష్టికాహారం తీసుకుంటూ చదువుపై ఏకాగ్రత పెంచుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సంక్షేమం కోసం అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అక్షయ పాత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ మచ్చ గీత, మండల ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాశ్, ఎంపీడీవో అనిత, తహసీల్దార్ సురేఖ, పీసీసీ సభ్యుడు, మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి తిరుపతి, పీఏసీఎస్ చైర్మన్లు కీసర సంపత్, గోపగోని బస్వయ్య గౌడ్, సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, గాజుల మహేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదల జీవితాల్లో భరోసా నింపడమే లక్ష్యం.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

పేదల జీవితాల్లో భరోసా నింపడమే లక్ష్యం.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. రుద్రంగిలో...

హైలెవల్‌ బ్రిడ్జి కోసం వాగులో దిగి వినూత్న నిరసన!

హైలెవల్‌ బ్రిడ్జి కోసం వాగులో దిగి వినూత్న నిరసన! నాలుగు గంటల పాటు...

ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం

ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం పరిశుభ్రతతోనే...

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలి.. తహసీల్దార్‌కు...

ఉపసర్పంచ్‌లు,వార్డు సభ్యుల హక్కుల సాధనకు భారీ బహిరంగ సభ

ఉపసర్పంచ్‌లు,వార్డు సభ్యుల హక్కుల సాధనకు భారీ బహిరంగ సభ డిసెంబర్ 27న కరీంనగర్‌లో...

నూతన ఎస్సై నరేష్ రెడ్డికి టీడీపీ నాయకుల శుభాకాంక్షలు

నూతన ఎస్సై నరేష్ రెడ్డికి టీడీపీ నాయకుల శుభాకాంక్షలు కాకతీయ,శంకరపట్నం:కేశవపట్నం పోలీస్‌స్టేషన్ నూతన...

బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి

బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి క‌రీంన‌గ‌ర్ జిల్లా అదనపు కలెక్టర్‌...

హరీశ్‌రావును కలిసిన ఉపసర్పంచ్ విజయ్‌కుమార్‌

హరీశ్‌రావును కలిసిన ఉపసర్పంచ్ విజయ్‌కుమార్‌ కాకతీయ, శంకరపట్నం: పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో చురుకుగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.