epaper
Friday, November 20, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వ్యవసాయ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్‌!

వ్యవసాయ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్‌!
ముగ్గురు ప్రధాన నిందితుల అరెస్ట్‌..
నలుగురు బాలుర అదుపులోకి
రూ.18.44 లక్షల విలువైన 84 మోటార్లు, నాలుగు వాహనాలు స్వాధీనం

కాకతీయ, వరంగల్‌ బ్యూరో : వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్‌ నీటి మోటార్లను అపహరిస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నర్సంపేట పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్‌ చేయగా, మరో నలుగురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.18,44,800 విలువైన 84 మోటార్లు, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌ కుమార్‌ గురువారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గురువారం ఉదయం రాజుపేట క్రాస్‌ రోడ్డు వద్ద ఎస్‌ఐ రాజన్‌బాబు సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఏడుగురు పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సీసీఎస్‌ సిబ్బంది సహకారంతో విచారించారు. డీజే ఆపరేటర్లు, స్టేజ్‌ డెకరేషన్‌ పనులు చేసే నిందితులు జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించేందుకు రాత్రివేళల్లో నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, ఖానాపూర్‌, నెక్కొండ, ములుగు మండలాల శివారు గ్రామాల్లో మోటార్లు దొంగిలించినట్లు అంగీకరించారు. రాజుపేట శివారులోని చెట్ల పొదల్లో దాచిన 84 మోటార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు హంస ప్రశాంత్‌, అన్న శివప్రసాద్‌, ఎస్‌.కె. దస్తగిరి అలియాస్‌ షైర్‌గా గుర్తించారు. ఒక ట్రాలీ ఆటో, ఒక ప్యాసింజర్‌ ఆటో, పల్సర్‌, షైన్‌ మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ మోటార్ల భద్రతపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే పోలీసులకు, డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని డీసీపీ సూచించారు. ముఠాను పట్టుకున్న పోలీసు సిబ్బందికి నగదు రివార్డులు అందజేశారు. సమావేశంలో ఏసీపీ రవీందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ ముస్కా శ్రీనివాస్‌, ఎస్‌ఐ రాజన్‌బాబు, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు హరికృష్ణ, రాఘవేందర్‌రావు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వరంగల్‌ చెత్తపై శాస్త్రీయ అధ్యయనం!

వరంగల్‌ చెత్తపై శాస్త్రీయ అధ్యయనం! జీడబ్ల్యూఎంసీ–ఎంఎస్ఎస్ఆర్ఎఫ్‌ సంయుక్తంగా వేస్ట్‌ ఆడిట్‌కు శ్రీకారం 90 ఇళ్లతో...

పుష్కర ఘాట్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

పుష్కర ఘాట్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి నిర్ణీత గడువులో అభివృద్ధి పనులు...

ఈ-వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ!

ఈ-వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ! సేకరణ నుంచి తరలింపు వరకు ప్రతి దశపై...

నిట్‌–కిట్స్‌ మధ్య బలోపేతమైన విద్యా బంధం

నిట్‌–కిట్స్‌ మధ్య బలోపేతమైన విద్యా బంధం పునరుద్ధరించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు సంయుక్త పరిశోధనలు,...

ఎంజీఎంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ!

ఎంజీఎంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ! బెడ్‌షీట్లు ఎప్పటికప్పుడు మార్చాలి.. పరిశుభ్రత పాటించాలి భద్రతా సిబ్బంది...

పరకాల శ్మశాన వాటికకు ఆధునిక హంగులు!

పరకాల శ్మశాన వాటికకు ఆధునిక హంగులు! పోచంపల్లి ఫౌండేషన్‌ ద్వారా అభివృద్ధి పనులు వరంగల్‌...

అచ్చ విద్యాసాగర్‌కు నాగుర్ల ఘన నివాళి

అచ్చ విద్యాసాగర్‌కు నాగుర్ల ఘన నివాళి తెలంగాణ ఉద్యమ సహచరుడి మృతిపై సంతాపం కాకతీయ,...

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి స్థానిక మండలంలో కాంగ్రెస్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.