epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బిహార్ తుది జాబితాలో మహిళా ఓటర్లే ఎక్కువ..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: బిహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తాజాగా తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం అర్హులైన ఓటర్ల సంఖ్య 7.42 కోట్లకు చేరింది. అయితే ఈసారి ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారిలో మహిళలే ఎక్కువగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తుది జాబితా ప్రకారం పురుష ఓటర్ల సంఖ్య 3.8 శాతం తగ్గి 15.5 లక్షలు తగ్గగా, మహిళా ఓటర్ల సంఖ్య 6.1 శాతం తగ్గి 22.7 లక్షలు తగ్గింది. అంటే పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే ఎక్కువగా తొలగించారు. ఈ పరిస్థితి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బిహార్ రాజకీయాల్లో మహిళా ఓటర్లు ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తారు.

మహిళా ఓటర్ల తొలగింపులో గోపాల్‌గంజ్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 15.1 శాతం అంటే 1.5 లక్షల మహిళలు జాబితా నుంచి తొలగించారు. జనవరిలో ఇక్కడ మహిళా ఓటర్లు 10.3 లక్షలుగా ఉండగా, తుది జాబితాలో 8.3 లక్షలకు తగ్గారు. రెండో స్థానంలో మధుబని జిల్లా (1.3 లక్షలు), మూడో స్థానంలో పూర్వి చంపారన్ (1.1 లక్షలు) ఉన్నాయి. అలాగే సారణ్, భగల్‌పూర్ జిల్లాల్లో కూడా ఒక్కో లక్ష మహిళలు జాబితా నుంచి తొలగించబడ్డారు. ఆసక్తికరంగా ఈ జిల్లాలు అన్నీ పొరుగు రాష్ట్రాలు లేదా దేశాలకు సరిహద్దుగా ఉన్నాయి.

పురుష ఓటర్లలో కూడా తొలగింపులు జరిగాయి కానీ సంఖ్య మహిళలతో పోలిస్తే తక్కువ. మధుబని జిల్లాలో 95,000 పురుషులు, పాట్నాలో 90,000, సారణ్‌లో 86,000, పూర్వ చంపరన్‌లో 85,000, గోపాల్‌గంజ్‌లో 80,000 మంది పురుష ఓటర్లు జాబితా నుంచి తొలగించారు. మహిళా, పురుష ఓటర్లు ఎక్కువగా తొలగించబడిన ఆరు జిల్లాలు ఉన్నాయి. అవి గోపాల్‌గంజ్, మధుబని, పూర్వి చంపరన్, సారణ్, భగల్‌పూర్, పాట్నా. వీటిలో మొత్తం 59 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత 2020 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో మహాఘట్‌బంధన్ 25 సీట్లు, ఎన్డీయే 34 సీట్లు గెలుచుకున్నాయి.

అయితే గతంలో ఈ నియోజకవర్గాల్లో ఓట్ల తేడా చాలా తక్కువగా ఉంది. ఉదాహరణకు, సీ‌ఎస్‌డీఎస్ సర్వే ప్రకారం 38% మహిళలు ఎన్డీయేకు, 37% మహిళలు మహాఘట్‌బంధన్‌కు ఓటు వేశారు. ఇక పురుష ఓటర్లలో 36% ఎన్డీయేకు, 38% మహాఘట్‌బంధన్‌కు మద్దతిచ్చారు. అంటే కేవలం 11,500 ఓట్ల తేడాతో ఎన్డీయే ఆధిక్యం సాధించింది.ఇప్పుడు లక్షలాదిమంది మహిళా ఓటర్లను తొలగించడం వల్ల రాబోయే ఎన్నికల్లో గణనీయమైన మార్పు రావచ్చని భావిస్తున్నారు.

మహిళల ఓటు కీలకమని గుర్తించిన ప్రధాన పార్టీలు ఇప్పటికే వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల బిహార్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనను ప్రారంభించారు. ఈ పథకం కింద 75 లక్షల మహిళలకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. ఇది మహిళా ఓటర్లపై ప్రభావం చూపుతుందేమో చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా...

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య రూ.14 లక్షల సాయం...

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు సెయింట్‌ థెరిస్సా పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం బస్సు ఫీజులు...

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.