epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మోదీ రైతుల పక్షపాతి

  • 1.7 కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపేందుకే ధన్ ధాన్య క్రుషి యోజన
  • కరీంనగర్ డెయిరీకి కేంద్రం నుండి అన్ని విధాలా సహకారం అందిస్తా..
  • డెయిరీ ప్రొడక్ట్స్ ను ఆపేందుకు కొందరు యత్నిస్తున్నారు
  • లక్షమంది పాడి రైతులతో నడుస్తున్న సంస్థ ఇది
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

కాకతీయ, కరీంనగర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల పక్షపాతి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు భారీగా పెరిగినప్పటికీ, ఆ భారం రైతులపై పడకుండా కేంద్రం భరిస్తోందని, రైతులకు సబ్సిడీ ధరకే యూరియాను అందించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. దేశంలోని 1.7 కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘‘ధన్-ధాన్య కృషి యోజన’’ అనే పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఏటా రూ.24 వేల కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. మొదట దశలో 100 జిల్లాల్లో అమలు చేస్తూ, ఒక్కో సంవత్సరం రూ.24 వేల కోట్ల చొప్పున ఆరేళ్ల పాటు నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు.

లక్ష మంది పాడి రైతుల జీవనోపాధి కరీంనగర్ డెయిరీ

నరేంద్ర మోదీ ఢిల్లీలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన రూ.42 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారని బండి సంజయ్ గుర్తుచేశారు. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని కరీంనగర్ మిల్క్ డెయిరీ ప్రాంగణంలో ఆయన ప్రత్యక్ష ప్రసారం వీక్షించారు. అనంతరం కేంద్రం, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జికా) ఆర్థిక సహకారంతో రూ.90 కోట్ల 70 లక్షల వ్యయంతో నిర్మించిన ఆటోమెటిక్ కర్డ్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కరీంనగర్ డెయిరీ అనేది 27 ఏళ్ల చరిత్ర గల సంస్థగా, లక్ష మంది పాడి రైతుల జీవనోపాధికి ఆధారంగా నిలుస్తోందన్నారు. ఈ సంస్థ రోజుకు 2 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోందని, 40 లక్షల లీటర్ల పెరుగును విక్రయిస్తున్నదని తెలిపారు. ప్రత్యక్షంగా 600 మందికి, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధిని కల్పిస్తున్నదన్నారు. 2021లో ఈ డెయిరీకి 3 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కేంద్రం నుంచి నిధులు వచ్చాయని గుర్తు చేశారు.

కరీంనగర్ డెయిరీ అభివృద్ధిలో రాజేశ్వరరావు పాత్ర అనన్యసాధారణమని సంజయ్ అన్నారు. గతంలో డెయిరీ ఆస్తులను కబ్జా చేయాలనే ప్రయత్నాలు జరిగినప్పుడు తాను కార్పొరేటర్‌ గా ఉద్యమాలు చేసి ఆ ఆస్తులను కాపాడామని ఆయన గుర్తు చేశారు. సిరిసిల్లలో డెయిరీని అధికారులు సీజ్ చేసినప్పుడు కలెక్టర్‌తో మాట్లాడి తిరిగి ప్రారంభించామన్నారు. కరీంనగర్ డెయిరీ ఉత్పత్తులను నిలిపేయడానికి రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు ప్రయత్నిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని బండి వెల్లడించారు. ఈ విషయంపై తాను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని, డెయిరీ ఉత్పత్తులు ఆగకూడదని, వాటిని మరింత విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశ ప్రయోజనాలే ప్రధానికి ప్రథమమని, అంతర్జాతీయంగా కూడా మోదీ తీసుకున్న పలు నిర్ణయాలు దేశ ప్రతిష్ఠను పెంచాయని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.