epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మంత్రి సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్‌

మాజీ ఓఎస్డీ సుమంత్ ఇంట్లో త‌ల‌దాచుకున్న‌ట్లు పోలీసుల అనుమానాలు
సెర్చ్ చేసేందుకు వెళ్లిన పోలీసుల‌పై మంత్రి త‌న‌య సుస్మిత ఆగ్ర‌హం
కాంగ్రెస్‌లో ఉంటున్నామా.. మ‌రేదైనా పార్టీలో ఉన్నామంటూ ఘాటు వ్యాఖ్య‌లు
సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఘ‌ట‌న వీడియో..!

డెక్క‌న్ ప్ర‌తినిధుల‌కు పాయింట్ బ్లాంక్‌లో సుమంత్ గ‌న్‌?
ఉత్త‌మ్ స్వ‌యంగా సీఎంకు ఫిర్యాదు.. సుమంత్‌పై సీఎం రేవంత్ సీరియ‌స్‌..!

కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : మంత్రి కొండా సురేఖ ఇంటి వ‌ద్ద‌కు టాస్క్‌ఫోర్స్ వెళ్ల‌డంపై ఇప్పుడు దుమారం రేపుతోంది. అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న ఎన్. సుమంత్‌ను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఆయనపై పలు తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం పీసీబీ కార్యదర్శి రవి గగులోతు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పీసీబీలో ఓఎస్‌డ్డీ నియమితులైన సుమంత్.. డిప్యుటేషన్‌పై మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి నుంచి వచ్చిన నోట్ ఆధారంగా 2024 ఫిబ్రవరిలో సుమంత్‌ను పీసీబీలో నియమించి.. వెంటనే మంత్రి పేషీకి పంపించారు. అప్పటి నుంచి ఆయన మంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సుమంత్‌పై సీఎం రేవంత్ సీరియ‌స్‌..!

న‌ల్గొండ జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులను సుమంత్ డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. సుమంత్ పాయింట్ బ్లాంక్ ఏరియాలో గ‌న్ పెట్టి బెదిరించిన‌ట్లుగా కంపెనీ ప్ర‌తినిధులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి స్వయంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఈ విష‌యాన్ని ముఖ్యమంత్రి చాలా సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి ఆఫీసులో కూడా సుమంత్ డబ్బుల కోసం గన్‌తో బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ రెండు ఘటనల్లో సుమంత్‌పై ఆరోప‌ణ‌లు రావ‌డంతోనే ఆయ‌న్ను విధుల నుంచి త‌ప్పించిన‌ట్లుగా విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. సుమంత్ వ్య‌వ‌హారం ప్రభుత్వ, పార్టీ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది. విధుల నుంచి త‌ప్పించిన త‌ర్వాత సుమంత్ అదృశ్యమవడంతో, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. దీంతో టాస్క్ ఫోర్స్ బృందాలు బుధవారం సాయంత్రం మంత్రి నివాసం వద్ద సడన్ సర్చ్ ఆపరేషన్ చేపట్డడం క‌ల‌క‌లం రేపింది.

మా ఇంటికి ఎందుకు వచ్చారు..?

టాస్క్‌ఫోర్స్ పోలీసులు త‌మ ఇంటికి రావ‌డంతో మంత్రి సురేఖ త‌న‌య సుస్మిత ప‌టేల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మా తల్లిని టార్గెట్ చేస్తున్నారా..? అంటూ టాస్క్ ఫోర్స్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సుమంత్ చేసిన త‌ప్పేంటి.. ఒక్క ఆధార‌మైనా ఉందా అంటూ ఆమె పోలీసుల‌ను ప్ర‌శ్నించారు. ఇక్క‌డ ఉన్నాడ‌ని మీకెవ‌రు చెప్పారు.. ఇలా ఎప్పుడు ప‌డితే అప్పుడు ఇంట్లోకి వ‌చ్చేస్తారా..? అంటూ మండిప‌డ్డారు. మేం కాంగ్రెస్ గ‌వ‌ర్నమెంటులోనే ఉన్నామా..? ఇంకా మ‌రేదైనా పార్టీలో ఉన్నామా అంటూ ఆక్రోశం వెళ్ల‌గ‌క్కారు. మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెళ్ల‌డం ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.