epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మేడిగ‌డ్డ‌లో పేలుళ్ల శ‌బ్దాల‌పై విచార‌ణేది..?

మేడిగ‌డ్డ‌లో పేలుళ్ల శ‌బ్దాల‌పై విచార‌ణేది..?
బ్యారేజీ 20వ పిల్లర్‌ను పేల్చే కుట్ర..?
కాళేశ్వ‌రంపై ఆది నుంచి కాంగ్రెస్, బీజేపీ బుర‌ద‌
స్క్రిప్ట్ రాసుకున్న‌ట్లుగా ప‌రిణామాలు జ‌రిగాయి
ఎన్.డీ.ఎస్.ఏ ఎందుకు మేడిగడ్డ వద్ద మౌనం వహిస్తోంది..?
బ్యారేజీ కుంగడంపై బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : మేడిగడ్డ ప్రాజెక్టులో 20వ పిల్లర్‌ను ఎవరో పేల్చే కుట్ర చేశారంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్సం చ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అక్టోబర్ 21, 2023న మేడిగడ్డ వద్ద పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించాయని, అక్టోబర్ 22న మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ ఫిర్యాదులో అసాంఘిక శక్తులు ఉన్నట్లు ప్రస్తావించారని పేర్కొన్నారు. 2022లో రికార్డు స్థాయి వరదలు వచ్చినా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు తట్టుకున్నాయని, ఇప్పుడు ఒక్క పిల్లర్ మాత్రమే ఎందుకు కుంగిపోయిందో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. మహదేవ్‌పూర్ పోలీసులు వెంటనే విచారణ చేసి ఉంటే నిజాలు బహిర్గతం అయ్యేవని విమర్శించారు. మేడి గడ్డ వద్ద పేలుళ్ల శబ్దాల పై ఇప్పటివరకు ఎలాంటి విచారణ జరగలేదని, ఎవరి స్టేట్మెంట్ కూడా రికార్డు చేయలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చివేసే కుట్ర వెనుక కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయని ఆరోపించారు. శ‌నివారం తెలంగాణ భవన్‌లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వెనుక గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల ప్ర‌మేయం ఉందంటూ అనుమానాలు వ్య‌క్తం చేశారు. అసాంఘిక శక్తులపై విచారణ జరపక పోవడంపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని అన్నారు.

మేడిగడ్డ పేలుళ్లపై సిట్ ఏర్పాటు చేయాలి

మేడిగడ్డ పేలుళ్లపై ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఏర్పాటు చేసి నిజాలను వెలికితీయాల‌ని మ‌రోసారి డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. దీని వెనుక రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉన్నారా లేదా అనేది సిట్ ద్వారా తేల్చాలని డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్ర‌తిష్ఠ‌ను దెబ్బతీయడానికి, ప్రాజెక్టు వైఫ‌ల్య‌మైంద‌ని బుర‌ద జ‌ల్లేందుకు కాంగ్రెస్, బీజేపీ మొద‌ట్నుంచి కుట్ర పన్నాయని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దింపడానికి కాంగ్రెస్, బీజేపీ కలిసి స్క్రిప్ట్ రాసినట్లు డ్రామా ఆడుతూ వ‌స్తున్నాయ‌ని అన్నారు. కిషన్ రెడ్డి లేఖ రాయగానే ఎన్.డీ.ఎస్.ఏ వచ్చిందని, కానీ ఉత్తరాఖండ్‌ లో మొత్తం డ్యామ్ కొట్టుకు పోయినా ఎన్.డీ.ఎస్.ఏ వెళ్లలేదంటూ ధ్వ‌జ‌మెత్తారు. రేవంత్ రెడ్డి ఆంధ్రా పెట్టుబడిదారుల ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని, సీం రమేష్ కంపెనీలకు తెలంగాణలో కాంట్రాక్టులు లభించాయని ఆయన ఆరోపించారు. రేవంత్ వెనుక 20మంది ఆంధ్రా కాంట్రాక్టర్లు ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పిన మాటలను ప్రస్తావించారు. స‌మావేశంలో సుమిత్రానంద్, ఇంతియాజ్ అహ్మద్, అభిలాష్ రంగినేని, కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.