epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బీసీ రిజర్వేషన్లను బీఆర్ఎస్ అడ్డుకుంటోంది: సీఎం రేవంత్ రెడ్డి

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపై తమ ప్రభుత్వం నిజాయితీగా కృషి చేస్తోందని అన్నారు. అయితే ఈ ప్రయత్నానికి బీఆర్ఎస్ పార్టీ అడ్డుగా నిలుస్తోందని ఆయన మండిపడ్డారు. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గతంలోనే తమ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రెండు బిల్లులు అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపిందని గుర్తు చేశారు. అయితే గవర్నర్ ఆమోదం ఇవ్వకుండా వాటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపారని, అప్పటి నుంచి ఆ బిల్లులు అక్కడే పెండింగ్‌లో ఉన్నాయని ఆయన వివరించారు.

అలాగే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018, 2019లో చేసిన పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాల వల్లే రిజర్వేషన్ల అమలు కష్టంగా మారిందని సీఎం విమర్శించారు. ఈ చట్టాలను సవరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా, గవర్నర్ మళ్లీ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతికి పంపారని ఆయన తెలిపారు.

ఈ సమస్యపై కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించామని, కానీ బీఆర్ఎస్ ఎంపీలు సహకరించలేదని రేవంత్ ఆరోపించారు. బీసీల కోసం మాట్లాడుతున్నామని చెప్పుకునే గంగుల కమలాకర్ కూడా ఆ సమయంలో రాలేదని ఆయన విమర్శించారు. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం బీఆర్ఎస్ నాయకత్వానికి అస్సలు ఇష్టం లేదని ఆయన అన్నారు.

ప్రస్తుతం కూడా అసెంబ్లీలో బిల్లులను ఆమోదించకుండా బీఆర్ఎస్ గందరగోళం సృష్టిస్తోందని సీఎం ఆరోపించారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో తమ ప్రభుత్వం వెనక్కి తగ్గదని రేవంత్ స్పష్టం చేశారు. చివరగా, సహకరించని బీఆర్ఎస్‌కు భవిష్యత్తులో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.