epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నక్సలిజం నిర్మూలనలో కోబ్రా పాత్ర ప్రశంసనీయం: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

కాకతీయ, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ప్రత్యేక విభాగమైన కోబ్రా స్కూల్ ఆఫ్ జంగిల్ వార్‌ఫేర్ అండ్ టాక్టిక్స్ (సి ఎస్ జే డబ్ల్యూ టి ) కేంద్రంలో నూతనంగా నిర్మించిన ట్రైనింగ్, ఏవీ హాల్ బిల్డింగ్, సబ్ ఆర్డినేట్ ఆఫీసర్స్ మెస్ భవనం, 180 మంది జవాన్లకు బ్యారక్ (సైనిక నివాసాలు)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బెలగావ్ సౌత్ ఎమ్మెల్యే, బీజేపీ తెలంగాణ ఇంచార్జీ అభయ్ పాటిల్, ఎమ్మెల్యే విఠల్ హళగేకర్, సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ ఏడీజీ రవీదీప్ సాహి, కె.కె. సెక్టార్ ఐజీ డా. విపుల్ కుమార్, డీఐజీ సుభాష్ చంద్రతోపాటు జిల్లా కలెక్టర్, సీఈవో, డీఎఫ్ఓ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీఎర్పీఎఫ్‌ సేవ, నిబద్ధతకు కేంద్ర మంత్రి ప్రశంస..
నిష్పాక్షికత, జాతీయత, సేవ, నిబద్ధతలకు ప్రతీకగా సీఆర్పీఎఫ్ నిలుస్తుందని బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగినా సీఆర్పీఎఫ్ బలగాలు లేకుండా నిర్వహించడం అసాధ్యమని, ఏ రాష్ట్రానికి కేంద్ర బలగాల అవసరం వచ్చినప్పుడు తొలుత సీఆర్పీఎఫ్ బలగాలను మాత్రమే కోరుతారని చెప్పారు. ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని అనుకుంటే అందులో సీఆర్పీఎఫ్ పాత్ర మరవలేనిదని అన్నారు. నక్సలిజం ప్రభావిత ప్రాంతాలు గణనీయంగా తగ్గాయని, ఇందులో సీఆర్పీఎఫ్ ప్రత్యేక విభాగమైన కోబ్రా దళం పాత్ర ప్రశంసనీమని అన్నారు. కోబ్రా దళం సహా ఇతర బలగాల ద్వారా నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో అభివృద్ధి గాలి వీస్తోందని చెప్పారు. నక్సలిజం పూర్తిగా అంతరించే రోజులు దూరంలో లేవని, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శనంలో వచ్చే మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు.

కోబ్రా స్కూల్ నూతన భవనాల వివరాలు..
రూ.36 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనాలలో ఆధునిక ట్రైనింగ్, ఏవీ హాల్, సబ్ ఆర్డినేట్ ఆఫీసర్స్ మెస్, 180 మంది జవాన్లకు బ్యారక్‌లు ఉన్నాయి. ఇందులో ఆధునిక ఆడిటోరియం, సెమినార్ హాల్, తరగతి గదులు, ఆడియో, విజువల్ గది, శాండ్ మోడల్ రూమ్, ఐఈడీ మోడల్ రూమ్, ఇతర శిక్షణా సంబంధిత సదుపాయాలు ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. జవాన్లకు ఎప్పటికప్పుడు ఆధునిక శిక్షణ, సదుపాయాలు అందించడం అత్యంత ముఖ్యమని, దేశ సేవకు త్యాగం చేసే సైనికుల సంక్షేమం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సీఎర్పీఎఫ్, కోబ్రా దళం వంటి ప్రత్యేక బలగాలు దేశ భద్రతలో వెన్నెముకగా నిలిచేలా కృషి చేస్తోందని బండి సంజయ్ అన్నారు. నేషన్ ఫస్ట్ అనే మంత్రాన్ని గుండెల్లో పెట్టుకుని దేశ సేవ చేయాలని జవాన్లకు సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.