epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఖైదీల్లో ప‌రివ‌ర్త‌నే ల‌క్ష్యంగా కృషి చేయాలి: బండి సంజయ్

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : ఖైదీల్లో ప‌రివ‌ర్త‌న తీసుకురావ‌డ‌మే జైళ్ల‌శాఖ సాధించే అసలైన విజయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. జైలు పరిపాలన అనేది కేవలం భద్రతకే పరిమితం కాకుండా, సంస్కరణ, పునరావాసానికి కూడా సాధనమని అన్నారు. ఈ దిశలో స్వచ్ఛత ,ఆరోగ్యం, విద్య, క్రీడలు లేదా కళలు వంటి పోటీలను నిర్వహిస్తూ జైళ్ల శాఖ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమన్నారు.

తెలంగాణ జైళ్ల శాఖ, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, న్యూ ఢిల్లీ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా 7వ ప్రిజన్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవిన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ , డైరెక్టర్ జనరల్ ఆలోక్ రంజన్, అదనపు డైరెక్టర్ జనరల్ రవి జోసెఫ్ లొక్, తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతోపాటు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జైలు విభాగాల నుండి పలువురు అధికారులు హాజరయ్యారు.

ఈ మహోత్సవంలో 22 ఈవెంట్ల కోసం మొత్తం 26 ట్రోఫీలు మరియు 40 పతకాలు ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమ ప్రదర్శన చేసింది. తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా 17 ట్రోఫీలు గెలుచుకుంది. అన్ని పతకాలు మరియు ట్రోఫీలు గెలుచుకున్న వారికి బండి సంజయ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహుమతి ప్రదానం చేశారు.

ఈసంద‌ర్భంగా కేంద్ర‌మంత్రి మాట్లాడుతూ.. జైళ్లు భారత రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితాలోకి వచ్చే అంశమ‌న్నారు.. ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా 2022 ప్రకారం దేశంలో మొత్తం 1330 జైళ్లు ఉన్నాయి. అందులో 148 సెంట్రల్ జైళ్లు, 428 జిల్లా జైళ్లు, 574 సబ్ జైళ్లు, 91 ఓపెన్ జైళ్లు, 42 ప్రత్యేక జైళ్లు, 34 మహిళా జైళ్లు, 10 బోర్స్టల్ పాఠశాలలు మరియు 3 ఇతర జైళ్లు ఉన్నాయ‌న్నారు. ప్రస్తుతం దేశంలోని జైళ్ళలో సుమారు 5.73 లక్షల మంది ఖైదీలు ఉన్నార‌న్నారు.

నేటి రోజుల్లో జైలు పరిపాలన అనేది కేవలం భద్రతకే పరిమితం కాకుండా, సంస్కరణ మరియు పునరావాసానికి కూడా సాధనంగా ఉండాల‌న్నారు. సమాజంలో తిరిగి చేరబోయే ప్రతి ఖైదీ జీవితంలో మార్పు తీసుకురావడమే అసలైన విజయంగా పరిగణించాల‌న్నారు. ఈ దిశలో మీరు చేస్తున్న ప్రశంసనీయమైనద‌ని జైళ్ల‌శాఖ అధికారుల‌ను కొనియాడారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.