epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తెలంగాణ విమోచన దినోత్సవం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారు ముఖ్య అతిధిగా హాజరై, అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, సర్దార్ వల్లభాయ్ పటేల్‌ గారికి నివాళులు అర్పించారు. ఇదే సందర్భంలో, కేంద్ర బలగాల గౌరవ వందనాన్ని కూడా రాజ్ నాథ్ సింగ్ గారు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి గారు, గజేంద్ర సింగ్ షెకావత్ గారు, బండి సంజయ్ కుమార్ గారు, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు గారు, పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ గారు ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి గారు మాట్లాడిన ముఖ్యాంశాలు:

ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవం (హైదరాబాద్ ముక్తి దివస్) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబడుతోంది.

1948 సెప్టెంబర్ 17న ఆర్మీ నిజాం ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి, ట్యాంకుల ద్వారా విజయవాడ, నాగపూర్, బాంబే నుండి మూడు దిక్కులుగా వచ్చి, నిజాం రాజ్యమైనటువంటి హైదరాబాద్ సంస్థానం మీద ప్రజల రక్షణ కోసం ఆర్మీ పోరాడింది.

ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ గారు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషాకరం.

భారత సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంన్నాం.

దేశానికి 15 ఆగస్టు 1947న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, తెలంగాణలో కొన్ని జిల్లాలు కర్ణాటకలో కొన్ని మహారాష్ట్రలో కలిసిపోయాయి.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడే నిజాం రాజ్యం భారతదేశంతో కలవకుండా స్వతంత్రంగా ఉండాలని నిజాం ఐక్యరాజ్య సమితికి అనేక ఉత్తరాలు రాశారు. పాకిస్తాన్‌తో కలవడం కోసం కూడా చర్చలు జరిపారు.

అయినప్పటికీ నిజాం ప్రైవేట్ ఆర్మీ అయిన ఎంఐఎం పార్టీకి సంబంధించిన రజాకారులు గ్రామాల మీద దాడులు చేసి, గ్రామాలను దోచుకోవడం, గ్రామీణ ప్రజలను అనేక రకాలుగా దౌర్జన్యాలు చేయడం, వేలాది మందిని హత్య చేయడం జరిగింది. హిందూ మహిళలను వివస్త్రలు చేసి బతుకమ్మలాడించిన ఘటన కూడా మనకు తెలిసిందే.

అటువంటి దౌర్జన్యకాండ జరుగుతున్నప్పుడు, 13 నెలల తర్వాత, 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చొరవతో భారత సైన్యం నిజాం రాజ్యమైన హైదరాబాద్ సంస్థానం మీద యుద్ధం ప్రకటించి ముందుకు వచ్చి, ఆ రోజు మనకు మూడు రంగుల జెండాను ఎగురవేశారు. ఇక్కడ స్వేచ్ఛ, స్వాతంత్రం కల్పించడం జరిగింది.

అటువంటి చరిత్ర, స్వాతంత్ర్యం వచ్చిన రోజుల గురించి గతంలో కాంగ్రెస్ పార్టీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని, పాలకులు గాని ఈ తరానికి, నవతరానికి తెలియకుండా దుర్మార్గంగా తొక్కిపెట్టడం జరిగింది.

మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు పాఠ్యాంశాల్లో లేకపోవడం, విద్యార్థులకు కళాశాలలో చెప్పకపోవడం, బయట చెప్పకపోవడం, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణం.

మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు, మూడు రంగుల జెండా ఎగిరిన రోజును ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీలు అనిచివేస్తూ, చరిత్రను దాచిపెడుతున్నాయో తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాలి.

నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలోని కొన్ని జిల్లాలు కర్ణాటకలో కలిశాయి. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా హైదరాబాద్ ముక్తి దివస్ పేరుతో అధికారికంగా నిర్వహిస్తోంది.

కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిసాయి. ఈ ప్రాంతంలోని జిల్లా గల తెలంగాణ ప్రాంతానికి చెందిన జిల్లాలు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు హైదరాబాద్ ముక్తి దివస్ పేరుతో మహారాష్ట్రలో నిర్వహిస్తున్నాయి.

మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది? హైదరాబాద్ ముక్తి దివస్ ను ఎందుకు అధికారికంగా నిర్వహించలేదు?

ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గాని, గతంలో గాని, ఇప్పుడు గాని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, హైదరాబాద్ ముక్తి దివస్ ను అధికారికంగా నిర్వహించడం లేదు?

ఇంకా ఎందుకు హైదరాబాద్ ముక్తి దివస్ పేరుకు పేర్లు మార్చి, ఈరోజు ఈ రాజకీయ పార్టీలు, ఈ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజల పోరాటాన్ని, స్వాతంత్రం కోసం సమర్పించిన అనేక అమరవీరుల త్యాగాలను, ఫలితాలను, ఆకాంక్షలను అవమానం చేస్తున్నారు?

అందుకే, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని బిజెపీ ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, గత మూడు సంవత్సరాల క్రితం ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం చేయకపోయినా, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ఎలా నిర్వహించబడుతున్నదో తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించమని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆదేశించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మొదటిసారిగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకున్నాం.

గత 78 సంవత్సరాలుగా హైదరాబాద్ ముక్తి దివస్, హైదరాబాద్ లిబరేషన్ డే జరపకపోవడానికి కారణం ఏమిటంటే, నిజాం రాజ్యంలో కాసిం రజ్వీ నేతృత్వంలో ఎంఐఎం పార్టీ స్థాపించబడింది. వారి ప్రైవేట్ ఆర్మీ అయిన రజాకార్లు వందేమాతరం అని నినదించకుండా, త్రివర్ణ పతాకం ఎగరనివ్వకుండా అనేక మందిని ఊచకోత కోశారు.. అనేకమందిని హింసించారు.

అందుకే, ఆ ఎంఐఎం పార్టీకి భయపడి ఇన్ని సంవత్సరాలుగా ఈ చరిత్రను, త్యాగాలను, బలిదానాలను, వాస్తవాలను కొన్ని పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతున్నాయి.

అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటున్నాం.

ఓట్ల కోసమే ఈ ఎంఐఎం పార్టీకి భయపడి తెలంగాణ చరిత్రను వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడుతున్నారు.

మజ్లిస్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాం కొట్టే ఈ రాజకీయ పార్టీలకు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారు.

వచ్చే మూడు సంవత్సరాల తర్వాత, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, గ్రామ గ్రామాన, అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్ద పండుగగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ లిబరేషన్ డే, హైదరాబాద్ విముక్తి ఉత్సవాలు నిర్వహిస్తాం.

ఈరోజు విశ్వకర్మ దివస్ కూడా కావడం మరొక ప్రత్యేక సందర్భం. ఇదే రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినం కూడా.

గత 11 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా, ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ ఒక్కరోజు కూడా హాలిడే తీసుకోకుండా పనిచేస్తున్న నాయకుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మాత్రమే.

అటువంటి నరేంద్ర మోదీ గారు గత 11 సంవత్సరాలుగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను దేశంలో తీసుకొచ్చారు.

నీతి, నిజాయితీకి ప్రతిరూపంగా, సమర్ధవంతమైన ప్రధానిగా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించి, భారతదేశానికి సేవ చేస్తున్న నరేంద్ర మోదీ గారికి తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మోదీ గారి నాయకత్వంలో భారతదేశం మరింత బలపడాలి, అభివృద్ధి చెందాలి. భారతదేశ గౌరవం మరింత పెరగాలని కోరుకుంటున్నాను.

విశ్వకర్మ జయంతి సందర్భంగా కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

1948లో భారత ఆర్మీ హైదరాబాద్ (తెలంగాణ) ప్రాంతానికి వచ్చి, నిజాం సైన్యం అయిన రజాకార్లను అణచివేయడం కోసం యుద్ధం ప్రకటించి, ఇక్కడ ప్రజలకు స్వేచ్ఛను అందించడం జరిగింది.

ఆ సమయంలో గజేంద్ర సింగ్ షెకావత్ గారి కుటుంబ సభ్యులు కూడా ఆ ఆర్మీలో పాల్గొని పోరాటంలో భాగమయ్యారు.

నిజాంకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో, భారత సైనికుల తరఫున వారి కుటుంబ సభ్యులు కూడా పోరాడారు. ఈ సందర్భంగా వారికి మన ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు చేస్తున్న సేవకు వందనం ప్రకటిస్తున్నాం.

ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి త్యాగాలు చేసిన అమరవీరులను ప్రజల ఆత్మలో తిలకించుకుని, మన సంస్కృతిని, ఐక్యతను నిలుపుకోవాలి.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ గారు, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, కల్చర్ సెక్రటరీ వివేక్ అగర్వాల్ గారు, సీఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ గారు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, ఇతర పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్ అధికారులు, పోలీస్ అధికారులు, కళాకారులు, విద్యార్థులు, యువకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున హాజరయ్యారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.