epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చేతులెత్తి క్ష‌మాప‌ణ కోరుతున్నా..

  • అమ‌ర‌వీరుల ఆశయాలు నెర‌వేర‌లేదు
  • 1200 మంది అమరులైతే 580 మందికి మాత్రమే న్యాయం
  • బీఆర్ఎస్ ప‌దేళ్ల‌లో త‌గినంత గౌర‌వం ద‌క్క‌లేదు
  • ఒక్కో కుటుంబానికి ప్ర‌భుత్వం రూ. 1 కోటి ఇవ్వాలి
  • 33 జిల్లాలు, 119 నియోజకవర్గాల్లో ‘జనం బాట’
  • ఆత్మగౌరవంతో కూడిన అభివృద్దే ల‌క్ష్యం
  • బీసీ రిజర్వేషన్ల కోసం జాగృతి పోరాటం
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
  • హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అమరవీరులకు.. వారి కుటుంబాలకు చేతులెత్తి క్షమాపణ కోరుతున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఏ ఆశయాల కోసం వారు ప్రాణత్యాగం చేశారో ఆ ఆశయాలు నెరవేరలేదన్నారు. 1200 మంది అమరులైతే 580 మందికి మాత్రమే న్యాయం జరిగిందని చెప్పారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి రూ. 1 కోటి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకూ తాను పోరాటం చేస్తానని ప్రమాణం చేశారు. ‘జనం బాట’ కు బయలు దేరే ముందు హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు.

సరైన గౌర‌వం ద‌క్క‌లేదు

తెలంగాణ సాధనం కోసం అమరలైన వారికి ఇవ్వాల్సిన గౌరవం తగినంత ఇవ్వలేకపోయామని కవిత అన్నారు. తాము ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు, ఉద్యోగం ఇస్తామని చెప్పామని.. వారిలో 580 మాత్రమే ఇచ్చామని తెలిపారు. మిగిలిన వారికి న్యాయం చేయలేకపోయామన్నారు. ఉద్యమకారుల్లో కొంతమందికి రాజకీయంగా అవకాశాలు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తాను మంత్రిగా లేకపోయినా.. ఎంపీగా.. ఎమ్మెల్సీగా అమరవీరులకు కుటుంబాలకు మరో రూపంలో డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేడుకల్లో చెప్పానని గుర్తు చేశారు. తాను ఇంకా ఎక్కువగా కొట్లాడాల్సి ఉండేదని.. అమరవీరులకు, వారి కుటుంబాలను చేతులెత్తి క్షమాపణలు కోరారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ బాగుండాలని వారందరూ ప్రాణంత్యాగం చేశారని.. వారి కుటుంబాలకు రూ.కోటి విధంగా పోరాటం చేస్తానని ప్రమాణం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం రూ.కోటి ఇవ్వకపోతే.. ప్రభుత్వాన్ని మార్చేసి.. వచ్చే ప్రభుత్వంతో అయినా వారికి న్యాయం జరిగే విధంగా చేస్తానని భరోసా ఇచ్చారు.

మేధావుల‌తో చ‌ర్చ‌లు

33 జిల్లాలు, 119 నియోజకవర్గాల్లో ‘జనం బాట’ పేరుతో జనం కోసం బయలుదేరుతున్నానని కవిత తెలిపారు. ప్రతి ఒక్కరికీ సమానంగా రాజకీయ, ఆర్థిక పరమైన అవకాశాలు దక్కాలని.. బీసీ రిజర్వేషన్ల కోసం జాగృతి ఇప్పటికే పోరాటం చేస్తోందని.. వాటిని సాధించుకుంటామన్నారు. అన్ని జిల్లాల్లో మేధావులను కలుస్తానని.. ఎక్కడ అభివృద్ధి ఆగిపోయిందో తెలుసుకుంటామన్నారు. జాగృతిలో ఇప్పటి వరకు పని చేసిన వాళ్లు మళ్లీ కలిసి రావాలని ఆహ్వానించారు. ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలన్నదే తన అభిమతమని అన్నారు కవిత.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.