epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇదేం ప‌ని సారూ ?

  • ఎక్సైజ్ శాఖ అధికారుల తీరు వివాదాస్ప‌దం
  • సొంత ప‌నుల‌కు ప్ర‌భుత్వ వాహ‌నం
  • డ్యూటీ టైంలోనే ద‌ర్జాగా వెహికిల్‌లో మ‌ద్యం బాటిళ్ల త‌ర‌లింపు
  • రూర‌ల్ ఎక్జైజ్ శాఖ కార్యాల‌యంలోనే మందు పార్టీ!
  • ఓ అధికారి రిటైర్మెంట్ సంద‌ర్భంగా చిల్ అయిన సిబ్బంది
  • ఆఫీస‌ర్లే నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు
  • విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్‌

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : జిల్లాలోని కొంద‌రు ఎక్సైజ్ శాఖ అధికారుల తీరు వివాదాస్ప‌దంగా మారింది. విధులు విస్మ‌రిస్తూ ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు గాలికొదిలేశార‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘ‌ట‌న జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. విధి నిర్వ‌హ‌ణ కోసం ప్ర‌భుత్వం కేటాయించిన ప్ర‌భుత్వ వాహ‌నాన్ని త‌మ సొంత ప‌నుల‌కు వినియోగిస్తున్న వైనం వెలుగులోకి వ‌చ్చింది. అంతేగాక ఆఫీస్‌లోనే సిట్టింగ్ ఏర్పాటు చేసి ద‌ర్జాగా ప్ర‌భుత్వ వాహ‌నంలో మ‌ద్యాన్ని త‌ర‌లిస్తున్న దృశ్యం కాక‌తీయ కెమెరాకి చిక్కింది. ఇదేంట‌ని ప్ర‌శ్నిస్తే అధికారులు పొంత‌నలేని స‌మాధానాలు చెప్ప‌డం కొస‌మెరుపు.

అస‌లేం జ‌రిగింది..

క‌రీంన‌గ‌ర్ అంబేద్క‌ర్ స్టేడియం స‌మీపంలోని ఒక వైన్స్ నుంచి క‌రీంన‌గ‌ర్ రూర‌ల్ ఎక్సైజ్ శాఖ సిబ్బంది కొంతమంది విధి నిర్వ‌హ‌ణ కోసం కేటాయించిన ప్ర‌భుత్వ వాహ‌నంలో మ‌ద్యం త‌ర‌లించారు. అంతే కాకుండా ఒక వ్య‌క్తి వాహ‌నంలో పెట్టిన త‌ర్వాత మ‌రో ఇద్ద‌రు వ‌చ్చి అదే ప్ర‌భుత్వ వాహ‌నంలో వెళ్లిపోవ‌డం గ‌మ‌నార్హం.

ఆఫీస్‌లో రిటైర్‌మెంట్ ఫంక్ష‌న్‌?

విశ్వ‌స‌నీయ సమాచారం మేర‌కు.. క‌రీంన‌గ‌ర్ రూర‌ల్ అబ్కారీశాఖ‌లో విధులు నిర్వ‌హిస్తున్న‌ ఒక అధికారి కొంతకాలానికి రిటైర్‌మెంట్ కానున్నారు. దీంతో బుధ‌వారం క‌రీంన‌గ‌ర్ రూర‌ల్ ఎక్సైజ్ శాఖ కార్యాల‌యంలోనే ముంద‌స్తుగా వేడుకుల‌ను నిర్వ‌హించారు. ఈక్ర‌మంలోనే అధికారులు, సిబ్బంది అంతా క‌లిసి పార్టీ చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఇదే విష‌య‌మై అధికారి వివ‌రణ కోసం వెళ్లిన కాక‌తీయ ప్ర‌తినిధికి ఈ త‌తంగం కంట‌బ‌డండ‌తో క్ష‌ణాల్లోనే అధికారులు అంతా ఖాళీ చేశారు. ఇక్క‌డ ఎలాంటి పార్టీ జ‌ర‌గ‌డం లేద‌ని, అంతా సాధ‌ర‌ణంగా త‌మ విధులు నిర్వ‌హిస్తున్న‌ట్లు బుకాయించ‌డం కొస‌మెరుపు.

పొంత‌న‌లేని స‌మాధానం..

ప్ర‌భుత్వ వాహ‌నంలోనే మ‌ద్యం బాటిళ్లు త‌ర‌లిస్తున్న విష‌య‌మై కాక‌తీయ కరీంన‌గ‌ర్ రూర‌ల్ ఎక్జైజ్ శాఖ అధికారి ఎస్‌హెచ్‌వోను వివ‌ర‌ణ తీసుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా స‌ద‌రు అధికారి మాత్రం కార్యాల‌యంలో ఎలాంటి పార్టీ జ‌ర‌గ‌లేదు.. సిబ్బంది ఎవ‌రూ వాహ‌నంలో మ‌ద్యం త‌ర‌లించ‌లేదు అంటూ పొంత‌నలేని స‌మాధానం చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా మ‌ద్యం బాటిళ్ల‌ను త‌ర‌లించిన వాహ‌నం వాహ‌నం అదే కార్యాల‌యం ముందు ప్ర‌త్యేక్షవ‌డం.. కాసేప‌ట్లోనే అక్క‌డి నుండి త‌ర‌లించ‌డం మ‌రీ విశేషం.

విచార‌ణ జ‌రిపితే నిజాలు వెలుగులోకి..

నిబంధ‌న‌ల ప్ర‌కారం విధులు నిర్వ‌హించవ‌ల‌సిన అబ్కారీ శాఖ అధికారులు వాటిని విస్మ‌రిస్తూ ప్ర‌భుత్వ వాహ‌నాల‌ను త‌మ సొంత ప‌నుల‌కు వాడుకొవ‌డం ప‌ట్ల ప్ర‌జ‌లు అగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. అధికారులే ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌భుత్వ వాహ‌నంలో మ‌ద్యం బాటిళ్లు త‌ర‌లించ‌డం, కార్యాల‌యంలో మ‌ద్యంతో రిటైర్‌మెంట్ వేడుక‌లు నిర్వ‌హించ‌డంపై ఉన్న‌తాధికారులు విచార‌ణ జ‌రిపితే పూర్తి నిజాలు వెలుగు చూసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌జ‌లు అశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా ఉన్నతాధికారులు స్పందించి చ‌ర్య‌ల‌కు పూనుకుంటారో లేదో వేచి చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.