epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సంపన్నులతో సామాన్యులు ఢీ !

సంపన్నులతో సామాన్యులు ఢీ !

రూ.5వేలలోపే ప‌లువురి బ్యాంకు బ్యాలెన్స్

బిహార్​ ఎన్నికల్లో అత్యంత పేద అభ్యర్థుల పోటీ

ఆస‌క్తిరేపుతున్న అసెంబ్లీ ఎన్నిక‌లు

నవంబరు 6న తొలి విడత పోలింగ్

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన నేతల్లో అత్యధికులు కోటీశ్వరులే. అయితే కొందరు సామాన్యులు సాహసం చేసి వీరితో తలపడుతున్నారు. స్థిర, చరాస్తులేవీ లేకున్నా, బలం, బలగం కలిగిన దిగ్గజ నేతలను ఢీకొంటున్నారు. కేవలం రూ.1,000, రూ.2,000, రూ.5,000 బ్యాంకు బ్యాలెన్స్ కలిగిన పలువురు అభ్యర్థులు నవంబరు 6న తొలి విడత పోలింగ్ జరగనున్న పలు స్థానాల్లో పోటీ చేస్తున్నారు.

సామాన్యుల ఆత్మస్థైర్యం

అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ కేటగిరీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి రూ.10వేలను డిపాజిట్ చేయాలి. ఎస్‌‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు రూ.5వేలను డిపాజిట్ చేసి నామినేషన్ వేయాలి. ఇంతకంటే తక్కువ రేంజులో ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్ కలిగిన పలువురు వ్యక్తులు ఆత్మస్థైర్యంతో నామినేషన్లు వేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకున్నారు. వారంతా మేం సైతం ఎన్నికల ప్రచార బరిలోనూ దూసుకెళ్తున్నారు. తమతమ స్థాయిల్లో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

అభ్యర్థుల సగటు ఆస్తి విలువ : రూ.3.26 కోట్లు

అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), బిహార్ ఎలక్షన్ వాచ్ కీలకమైన సమాచారంతో తాజాగా ఓ సంయుక్త నివేదికను విడుదల చేశాయి. దాని ప్రకారం, నవంబరు 6న తొలి విడత పోలింగ్ జరగనున్న 121 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 1,303 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ రూ.3.26 కోట్లు.

ముజాహిద్ ఆలం : ఆస్తుల విలువ రూ.1000

బిహార్‌లోని దర్భంగ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి మహ్మద్ ముజాహిద్ ఆలం పోటీ చేస్తున్నారు. ఆయన ఎస్‌యూసీఐ (కమ్యూనిస్ట్) పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. బిహార్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అత్యంత పేద అభ్యర్థి ఆయనే. ముజాహిద్ ఆలం చరాస్తుల విలువ వెయ్యి రూపాయలే అని ఎన్నికల అఫిడవిట్‌లో ఉంది. గణిత శాస్త్ర గ్రాడ్యుయేట్ అయిన ముజాహిద్ ఆలం, ప్రస్తుతం ఓ ప్రైవేటు స్కూలులో టీచర్‌గా పనిచేస్తున్నారు.

శత్రుఘ్న వర్మ ఆస్తుల విలువ రూ.1000

పట్నాలోని బార్ అసెంబ్లీ స్థానం నుంచి పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున శత్రుఘ్న వర్మ పోటీ చేస్తున్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ కూడా వెయ్యి రూపాయలే. ముజఫర్‌పూర్‌ జిల్లాలోని మినాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి శివ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ కేవలం రూ.2,023. అరా అసెంబ్లీ స్థానం నుంచి విపక్ష మహా ఘట్బంధన్ కూటమిలోని సీపీఐ-ఎంఎల్ పార్టీ తరఫున కయాముద్దీన్ అన్సారీ పోటీ చేస్తున్నారు. ఆయన వద్ద రూ.20వేల నగదు, రూ.5వేల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నాయి

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.