epaper
Wednesday, October 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఓటు @ రూ. 5వేలు !

ఓటు @ రూ. 5వేలు !

జోరుగా ప్ర‌ధాన పార్టీల పోల్ మేనేజ్‌మెంట్ !

చివ‌రి ద‌శ‌కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్ర‌చారం

మరికొన్ని గంటల్లో ప్రచార పర్వానికి తెర

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్ !

నియోజకవర్గంలో మొత్తం 3,92,669 ఓటర్లు

ఇందులో 24 శాతం మైనారిటీలే..

ముస్లిం మైనార్టీ ఓట్ల‌పైనే ప్ర‌ధాన పార్టీల గురి

నవంబర్ 11న పోలింగ్ .. 14న‌ రిజ‌ల్ట్స్‌

ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు

నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ద్యం దుకాణాలు బంద్‌

ఉత్త‌ర్వులు జారీచేసిన సీసీ స‌జ్జ‌న్నార్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరింది. మరికొన్ని గంటల్లో ప్రచార పర్వానికి తెరపడనుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం… నవంబర్ 9 సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. దీంతో మైకులు బంద్ కావటమే కాదు ..ఇతర ప్రాంతాల నేతలు కూడా నియోజకవర్గం వదిలి వెళ్లాల్సి ఉంటుంది. కాగా.. ప్రచార ప‌ర్వం ముగియ‌నుండ‌గా.. వెంట‌నే ప్ర‌లోభాల ప‌ర్వం మొద‌లుకానుంది. అధికార కాంగ్రెస్, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీలు పోల్ మేనేజ్మేంట్‌పై ఫోకస్ పెట్టాయి. చివరి నిమిషం వరకు పట్టు విడవకుండా పనిచేయాలని పార్టీ అధినాయకత్వాలు ఇప్ప‌టికే కేడ‌ర్‌కు దిశానిర్దేశం చేశాయి. ఒక్కో ఓటును ఒడిసిప‌ట్టాల‌ని, డివిజన్లవారీగా పక్కాగా లెక్కలు వేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈక్ర‌మంలోనే గెలిచి తీరాల‌న్న ప‌ట్టుద‌ల‌తో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు ఓటుకు రూ. 5వేల చొప్పున పంచేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం వంద మంది ఓట‌ర్ల‌కు ఓ లీడ‌ర్ చొప్పున బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు, ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో న‌గ‌దు డంప్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దాదాపు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 24 శాతం మైనారిటీలు ఉన్నారు. అభ్య‌ర్థి గెలుపు ఓట‌ముల్లో ముస్లిం ఓట్లు కీల‌కంకానుండ‌టంతో పార్టీల‌న్నీ
ఆ వ‌ర్గంపై దృష్టిపెట్టాయి.

మ‌ద్యం దుకాణాలు బంద్‌

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నవంబర్ 11వ తేదీన పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇక నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి… ఫలితాలను ప్రకటించ‌నున్నారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌ దృష్ట్యా హైదరాబాద్‌ కమిషనర్​ ఆఫ్ పోలీస్​ సజ్జనార్‌ కీలక ఆదేశాలను జారీ చేశారు. నియోజకవర్గం పరిధిలో 9వ తేదీ (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి ఉపఎన్నిక జరగనున్న 11వ తేదీ (మంగళవాం) సాయంత్రం 6 గంటల వరకు, తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే 14వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 15 సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. నిర్దేశించిన సమయాల్లో మద్యం దుకాణాలన్నీ మూసి వేయాలని, హోటళ్లు, రెస్టారంట్‌లు, క్లబ్బులు మూసివేయాలని సజ్జనార్ ఆదేశించారు. శాంతిభద్రతల నేపథ్యంలో జూబ్లీహిల్స్​ నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని వివరించారు. పోలింగ్‌ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమని వివరించారు. ఓట్ల లెక్కింపు రోజున రహదారులు, జనావాసాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని, ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని సీపీ సజ్జనార్​ హెచ్చరించారు.

నువ్వానేనా అన్న‌ట్లుగా ..

ఈ ఏడాది జూన్ 8న బీఆర్ఎస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం పరిధిలో 3,92,669 ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికకు గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించింది . కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్‌కు ఎంఐఎం పార్టీ మ‌ద్ద‌తు ఇస్తోంది. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉండ‌గా ఆయ‌న‌కు జ‌న‌సేన స‌పోర్ట్ చేస్తోంది. వీరితోపాటు మరికొంత మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది. ప్రతి ఇంటికి వెళ్తూ… ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తమ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి .. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి కూడా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విస్తృత ప్రచారం చేప‌డుతున్నారు. అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించిన బీఆర్ఎస్ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా రోడ్ షోలు చేపట్టి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెంచారు. మరోవైపు బీజేపీ చీఫ్ రామచంద్రరావు దీపక్ రెడ్డికి మద్దతుగా డోర్ టు డోర్ కాంపెయిన్ చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారంలో పాల్గొని కేడ‌ర్‌లో ఉత్సాహం నింపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు రెండో విడతలో మరో 1,100 ఇందిరమ్మ ఇళ్లు పొలాల...

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం!

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం! 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనపై పునఃపరిశీలనకు సీఎం ఫ‌డ్న‌వీస్‌...

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ?

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ? 17 వేల మంది ఉద్యోగుల...

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు!

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు! దేవాదుల, కల్వకుర్తి నుంచి ఎందుకు నీళ్లు ఎత్తడం లేదు? తమ్మిడిహట్టి...

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా?

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా? ఖర్గే వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఓటర్ల ప్రత్యేక...

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం!

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం! అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా నేలకొండపల్లి 10 రోజుల్లో...

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు రోడ్‌–2 ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలు జ‌రిగాయి బినామీల‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు...

కన్నెపల్లి ర్యాంప్‌లో అద‌న‌పు వ‌సూళ్లు

కన్నెపల్లి ర్యాంప్‌లో అద‌న‌పు వ‌సూళ్లు కాసుల దందాకు టీజీఎండీసీ అధికారుల అండ! ఆదివారం ఒక్కో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.