epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఒకేరోజు 3ఆల‌యాల‌కు అంబానీ రికార్డు డొనేషన్..లిస్ట్‌లో తిరుమ‌ల‌!

ఒకేరోజు 3ఆల‌యాల‌కు అంబానీ రికార్డు డొనేషన్..లిస్ట్‌లో తిరుమ‌ల‌!

కాక‌తీయ‌, జాతీయం : దేశంలోనే అత్యంత సంపన్నుడిగా, ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తగా నిలిచిన ముఖేశ్ అంబానీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ఆయన బిజినెస్‌ రికార్డులు క్రియేట్ చేస్తూనే, సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. ఆధ్యాత్మికత, దాతృత్వం.. ఈ రెండు అంశాల కలయికతో అంబానీ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆదివారం కూడా అదే జరిగింది. ఒకేరోజు మూడు రాష్ట్రాల్లోని మూడు ప్రసిద్ధ ఆలయాలకు మొత్తం రూ.165 కోట్లకు పైగా విరాళాలు ప్రకటించి హెడ్‌లైన్స్ లో నిలిచారు.

ఆదివారం వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖేశ్ అంబానీ, అనంతరం అద్భుతమైన సద్వినియోగంతో కూడిన దాతృత్వాన్ని ప్రదర్శించారు. తిరుమలలో నిత్యం రెండు లక్షల మందికి అన్నప్రసాదాలు తయారు చేసేందుకు అత్యాధునిక శాటిలైట్ కిచెన్‌ నిర్మాణానికి రూ.100 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ నూత‌న‌ వంటశాల అన్నప్రసాదం ట్రస్టుకు అంకితం కానుందని, ఇది అంబానీ కుటుంబం తరఫున భక్తి చిహ్నంగా ఉండబోతోందని రిలయన్స్ ప్రకటించింది.

తిరుమల దర్శనం తర్వాత ముఖేశ్ అంబానీ రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా ఆలయాన్ని సందర్శించారు. అక్కడ భక్తుల సౌకర్యార్థం యాత్రికుల సముదాయం నిర్మాణానికి ముందుకు వచ్చారు. మొత్తం రూ.50 కోట్ల వ్యయంతో రానున్న ఈ ప్రాజెక్ట్‌ మూడు సంవత్సరాల్లో పూర్తికానుంది. తొలి విడతగా రూ.15 కోట్ల చెక్కును అంబానీ దేవస్థానానికి అందజేశారు.

ఆ తర్వాత కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్‌ శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించిన అంబానీ, అక్కడ కూడా ప్రజా సేవలో భాగంగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి తన వంతు సహాయం చేశారు. తొలి విడతగా రూ.15 కోట్ల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. మొత్తానికి తిరుమలలో అన్నదానం, నాథ్‌ద్వారాలో వసతి, గురువాయూరులో వైద్యం – ఈ మూడు రంగాల్లో అంబానీ చేసిన విరాళాలు కేవలం దాతృత్వం కాదు, సమాజం పట్ల ఉన్న ఆయన బాధ్యతను ప్రతిబింబిస్తున్నాయి. బిజినెస్‌ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నా, భక్తి మార్గంలో సాదాసీదా యాత్రికుడిలా ఉండే అంబానీ… మరోసారి ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఇక ఒకేరోజు మూడు దేవాలయాల్లో రికార్డు డొనేష‌న్స్ ఇచ్చిన అంబానీపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.