epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో క్రాష్..!

పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో క్రాష్..!
పీకే అంచనాలను తారుమారు చేసిన ఓటర్లు
పోస్టల్ బ్యాలెట్లలో ఆశ, ఫ‌లితాల్లో నిరాశ

కాక‌తీయ‌, జాతీయం: దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్ కిషోర్ (పీకే) అనేక రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చిన వ్యక్తిగా ఖ్యాతి సంపాదించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ నుంచి తమిళనాడు వరకు.. పలు రాష్ట్రాల్లో పార్టీలు విజయం సాధించేందుకు తన సలహాలు, మైక్రో స్ట్రాటజీలు కీలకమని ఆయన టీమ్ చెప్పుకుంటూ వచ్చింది. కానీ, సొంత రాష్ట్రం బీహార్‌లో ‘జన్ సురాజ్’ అనే ప్రయోగంతో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టిన పీకే, ఈసారి మాత్రం తన లెక్కల్లో ఘోరంగా తడబడ్డారు.

బీహార్‌లో ఈసారి మార్పు ఖాయం.. ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంతో అసంతృప్తిగా ఉన్నారు.. జన్ సురాజ్ పార్టీ పలు ప్రాంతాల్లో అసాధారణ ప్రజాదరణ పొందుతోందని ఎన్నిక‌ల‌కు ముందు నుంచి పీకే తెగ ప్ర‌చారం చేశారు. ఎన్డీఏ కూటమి ఘోరంగా ఓటమి చెందుతుందని ఆయన పబ్లిక్‌గా ఎన్నోసార్లు చెప్పారు. అయితే కౌంటింగ్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే పీకే అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఎన్నికల రోజు తెల్లవారుజామున పోస్ట్ బ్యాలెట్ల లెక్కింపులో జన్ సురాజ్ పార్టీ రెండు స్థానాల్లో స్వల్ప ఆధిక్యం సాధించగా, పీకే అనుచరులలో కొంత ఉత్సాహం కనిపించింది.

అయితే అది ఎక్కువసేపు నిలువలేదు. ఆ ఆధిక్యం కొన్ని రౌండ్లలోనే ఆవిరైపోయి, తుది గమ్యానికి వచ్చేసరికి జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేని దుస్థితి ఎదురైంది. తుది ఫలితాల్లో ఎన్డీఏ కూటమి హ‌వా చూపించింది. స్పష్టమైన ఆధిక్యం కనబర్చి అధికారాన్ని ప‌దిలం చేసుకుంది. సర్వేలు సూచించినట్లుగానే, బీహార్ ఓటర్లు పెద్ద మార్పు అవసరం లేదని, ప్రస్తుత కూటమితోనే కొనసాగాలని సంకేతం ఇచ్చారు.

ఇక తన సొంత రాష్ట్రంలోనే పీకే చేసిన అంచనాలు విఫలమవడం ఆయన స్ట్రాటజిక్ ఇమేజ్‌కు భారీ దెబ్బ. జన్ సురాజ్ పార్టీ మరింత బలపడాలంటే ప్రసంగాలు, యాత్రలు, ప్రామిసెస్ మాత్రమే కాకుండా, గ్రామ స్థాయి బూట్స్-ఆన్-గ్రౌండ్ ఆర్గనైజేషన్‌ను నిర్మించాల్సిన అవసరం ఉన్నట్లు ఈ ఫలితాలు స్పష్టంగా చూపించాయి. మొత్తానికి పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో పూర్తిగా క్రాష్ అవ్వ‌డంతో సామాజిక మాధ్య‌మాల్లో ఆయ‌నపై భారీ ఎత్తున ట్రోల్స్ వ‌స్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.