epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..??

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..??
ద‌ర్యాప్తు ఎందుకు ముందుకు సాగ‌డం లేదు..?
ర‌క్త‌చ‌రిత్ర‌లో రాజ‌కీయ కోణంపై అనుమానాలు
కాంగ్రెస్ నేత‌ల‌పై భార్య స్వ‌రాజ్యం ఫిర్యాదు
సీపీఎం పార్టీలోని ముఖ్య నేత‌పైనా అనుమానాలంట‌
కొత్త‌గా స‌రూర్‌న‌గ‌ర్‌లోని ఓ ల్యాండ్ వివాదం తెర‌పైకి
నేర‌స్థుల‌ను ప‌ట్టుకునేందుకు రెండు వారాలుగా 5టీంల వేట‌
అయినా ద‌ర్యాప్తులో ప్ర‌గ‌తి లేదా.. పోలీసుల గోప్య‌త‌పై వెల్ల‌డవుతున్న‌ అనేక అనుమానాలు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : క‌మ్యూనిస్టు సీనియ‌ర్ నేత సామినేని రామారావు హత్య కేసు మిస్ట‌రీగా మారింది. హ‌త్య జ‌రిగి రెండు వారాల‌వుతున్నా.. ఖ‌మ్మం పోలీసులు మాత్రం నిందితులు ప‌ట్టుకోలేక పోయారు. ఈ హ‌త్యలో రాజ‌కీయ కోణం ఉంద‌ని, రాజ‌కీయ క‌క్ష్యలే హ‌త్య‌కు దారితీశాయ‌ని ఆరోప‌ణ‌లు,విమ‌ర్శ‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో జాప్యం జ‌రుగుతుండ‌టంపై అనుమానాలు నెల‌కొంటున్నాయి. రెండు వారాలు పూర్త‌యినా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి పురోగ‌తిని పోలీసులు వెల్ల‌డించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడులో సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు సామినేని రామారావు గ‌త నెల 31న సొంత ఇంట్లోనే అత్యంత దారుణంగా హ‌త్య‌కు గుర‌య్యారు. వాకింగ్ వెళ్లోస్తుండ‌గా..ముగ్గురు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు వేట‌కొడ‌వ‌ళ్ల‌తో న‌రికి చంపారు. ఈ ముగ్గురు కూడా గ్రామానికి చెందిన వారు కాద‌ని పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో గుర్తించారు. హ‌త్య‌కు ముందు రెక్కి కూడా నిర్వ‌హించిన‌ట్లుగా కూడా తెలుస్తోంది. ఈనేప‌థ్యంలో ఈ హ‌త్య‌కు సుపారీ ఇచ్చి ఎవ‌రో చేయించార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

రాజ‌కీయ హ‌త్యేనా..?

సీపీఎం సీనియర్ నేత సామినేని రామారావు హత్య జిల్లాలో ప్రకంపనలు సృష్టించింది. సీపీఎం పార్టీలో మంచి గుర్తింపు ఆయ‌న్ను చంపాల్సిన అవ‌స‌రం ఎవ‌రికి ఉంది..? అందునా సుపారీ ఇచ్చి మ‌రీ ఆయ‌న అంత మొందించాల‌నే ల‌క్ష్యంతో చేసిన ఈ ఘాతుకానికి పెద్ద ఎత్తున వ్యూహ ర‌చ‌న జ‌రిగిన‌ట్లుగా స్ప‌ష్టమ‌వుతోంది. గ్రామంలో నెల‌కొన్న రాజ‌కీయ అంశాలు..హ‌త్య‌లు చేసుకునేంత స్థాయిలో లేవ‌ని పార్టీ వ‌ర్గాల నుంచి అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. స‌రూర్‌న‌గ‌ర్‌లోని ఓ ల్యాండ్ వివాదం నేప‌థ్యంలోనే సామినేని హ‌త్య జ‌రిగిన‌ట్లుగా ఒక ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే సొంత పార్టీలో కూడా సామినేని ప్ర‌భావాన్ని జీర్ణించుకోలేని ఓ ముఖ్య నేత‌కు ఈ హ‌త్య‌కు లింకులు ఉన్న‌ట్లుగా గుస‌గుస‌లు విన‌బ‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. సామినేని పార్టీలో కొర‌క‌రాని కొయ్య‌లా త‌యార‌వ‌డం, ఆయ‌న‌ ఎదుగుద‌ల‌ను ఒర్వ‌లేక‌నే ఓ ముఖ్య నేత కొద్దికాలంగా ఆగ్రహంతో ఉన్న‌ట్లుగా కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈనేప‌థ్యంలోనే సామినేని హ‌త్య‌కు గురికావ‌డంతో పోలీసులు ఆ ముఖ్య నేత‌కు సామినేనితో ఉన్న సంబంధాల‌ను ర‌హ‌స్యంగా ఆరా తీస్తున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గా తన భర్త హత్యలో గ్రామానికి చెందిన ఐదుగురు కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉందని అనుమానిస్తూ మృతుడి భార్య స్వరాజ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. క్లూస్ టీం, స్నిఫర్ డాగ్స్, సైబర్ టీం వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవరినీ అరెస్టు చేసినట్లు అధికారిక సమాచారం లేదు. సామినేని రామారావు హత్య కేసు దర్యాప్తులో జాప్యంపై సీపీఎం, మృతుడి కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ద‌ర్యాప్తులో జాప్యం.. పార్టీ నేత‌ల ఆందోళ‌న‌..!

సామినేని రామారావు హత్య కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతోందని సీపీఎం నాయకులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. హత్య జరిగి రెండు వారాలు దాటినా నిందితులను పోలీసులు ఇంకా అరెస్టు చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హంతకులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని, ఇది దద్దమ్మ సర్కార్ అంటూ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోనే ఈ హత్య జరగడంతో, దర్యాప్తులో రాజకీయ పక్షపాతం మరియు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని సీపీఎం ఆరోపించింది. ఇదిలా ఉండ‌గా..! ఈ హత్య జరగడం వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నట్లు ఆరోపిస్తూ ఇటీవ‌ల సీపీఎం రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డికి స్వ‌యంగా క‌లిసి విన‌తి అంద‌జేశారు. అయితే గతంలో తెల్దారుపల్లి గ్రామంలో త‌మ్మినేని కృష్ణ‌య్య హ‌త్య కూడా పాత క‌క్ష్య‌ల‌తోనే జ‌రిగిన‌ట్లుగా ఇది జ‌రిగి ఉంటుందా అన్న కోణంలో ఖ‌మ్మం పోలీసులు అనుమానిస్తున్న‌ట్లుగా విశ్వ‌సనీయంగా తెలుస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.