epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పత్తి రైతుల సమస్యలపై గలమెత్తిన గంగుల

పత్తి రైతుల సమస్యలపై గలమెత్తిన గంగుల
సిసిఐ నిబంధనలు సడలించాలి
మిల్లుల సమ్మె వెంటనే విరమింపజేయాలి

కాకతీయ, కరీంనగర్ : పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సిసిఐ కొనుగోలు విధానాల్లో మార్పులు చేసి, రైతులకు ఉపశమనం కల్పించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జిల్లా అధికారులను కోరారు. ఈ మేరకు పత్తి రైతులతో కలిసి జిల్లా కలెక్టరేట్ ఎదుట బుధవారం నిరసన తెలుపుతూ అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్‌కు వినతిపత్రం సమర్పించారు.గంగుల కమలాకర్ మాట్లాడుతూ.ప్రస్తుత పరిస్థితుల్లో రైతు పండించిన పత్తి మొత్తం కొనుగోలు అయ్యేలా సిసిఐ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిసిఐ జిన్నింగ్ మిల్లులకు ఎల్–1, ఎల్–2, ఎల్–3 అంటూ కేటాయింపులు చేసి ప్రతి మిల్లుకు 1450 క్వింటాళ్ల పరిమితి విధించడంతో రైతులు ఒకే మిల్లుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల మిల్లు యజమానులు కొర్రీలు పెట్టి రైతులను నష్టపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిమితిని వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.పత్తి రైతుల్లో పెద్దశాతం కౌలు రైతులేనని, గతంలో పట్టేదారు ఆధార్,పాసుబుక్ సమర్పిస్తే వచ్చిన ఓటిపి ద్వారా సిసిఐ కొనుగోలు జరిగేదని గుర్తు చేశారు. అయితే ఇప్పుడది నిలిపివేసి, తప్పనిసరిగా పట్టేదారే వచ్చి వేలిముద్రతో స్లాట్ బుక్ చేయాల్సిన నిబంధన పెట్టడం కౌలు రైతులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోందని పేర్కొన్నారు. ఈ నిబంధన రైతు ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధమని తెలిపారు.మునుపు సిసిఐ రైతు నుంచి ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు పత్తి కొనుగోలు చేసేదని, అయితే ఇప్పుడది 7 క్వింటాళ్లకు తగ్గించడంతో మిగిలిన పత్తిని రైతులు ప్రైవేటు దళారులకే అమ్మాల్సిన దుస్థితి నెలకొన్నదని కమలాకర్ వివరించారు. సిసిఐ రేటు రూ.8,110 ఉండగా దళారులు రూ.6,000 మాత్రమే ఇస్తుండటంతో క్వింటాల్‌కు రూ.2,100, ఎకరాకు రూ.16వేలకు పైగా రైతు నష్టపోతున్నాడని పేర్కొన్నారు.ఇక అకాల వర్షాల వలన పత్తి కాయలు నల్లబారిపోయి, సిసిఐ ‘నష్టం’ అంటూ కొనుగోలు నిరాకరిస్తోందని, దళారులు మాత్రం నాలుగు,ఐదు వేలకే కొనడం వల్ల రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లాలో జిన్నింగ్ మిల్లు యజమానుల సమ్మె కొనసాగుతోందని, దాని ప్రభావం రైతులపై పడుతోందని పేర్కొంటూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకుని మిల్లుల సమ్మె విరమింపజేసి, సిసిఐ ద్వారా పత్తి మొత్తాన్ని కొనుగోలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని
భారత రాష్ట్ర సమితి తరఫున గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.