epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కమ్యూనిస్టులంతా ఏకం కావాలి

కమ్యూనిస్టులంతా ఏకం కావాలి
బీజేపీ మ‌తోన్మాదాన్ని రెచ్చ‌గొడుతోంది
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
డిసెంబర్ 26 ఖమ్మం శతాబ్ది సభలను విజయవంతం చేయాల‌ని పిలుపు

కాకతీయ, గోదావరిఖని : దేశంలో కమ్యూనిస్టు పార్టీ శతాబ్దిని పురస్కరించుకుని జరుగుతున్న ఉత్సవాలు చారిత్రాత్మకమని, ఈ సందర్భంలో కమ్యూనిస్టు శక్తులన్నీ ఐక్యంగా ముందుకు రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. భాస్కర్ రావు భవన్‌లో ఎఐటియుసి అర్జీ–1 బ్రాంచ్ నిర్వహించిన కార్మిక కుటుంబాల సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో వందేళ్లుగా ప్రజల మధ్య నిరంతర పోరాటం సాగిస్తున్న ఏకైక పార్టీ సీపీఐ అని తెలిపారు. మావోయిస్టులు ఆయుధాలు విడిచి ప్రజా స్రవంతిలోకి వచ్చి ఎడమపక్ష ఐక్యతకు సహకరించాలని సూచించారు. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ కగారు పేరుతో జరుగుతున్న అణచివేతలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.1942లో స్థాపించబడిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కార్మిక హక్కుల కోసం ఎన్నో మైలురాయి పోరాటాలు చేసినట్లు ఆయన గుర్తుచేశారు. శేషగిరిరావు, మఖ్దూం, సర్వదేవబట్ల రామనాథం, నల్లమల గిరిప్రసాద్ వంటి నేతలు యూనియన్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. భాస్కరరావు, కత్తుల కొమురయ్య, చంద దుర్గయ్య వంటి నాయకుల త్యాగాలు సింగరేణి చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు.యూనియన్ శ్రేణులు పార్టీతో మమేకమై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి బలాన్ని చాటాలని సూచించారు. బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అభ్యుదయవాదులను అణచివేస్తోందని విమర్శించారు.సమ్మేళనంలో పాల్గొన్న వందకు పైగా కార్మిక కుటుంబాలను సన్మానించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయడం సమయానుసారమని కూనంనేని స్పష్టం చేశారు.ఎఐటియుసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడుతూ కార్మికులు పొందిన ప్రతి హక్కుకూ ఎఐటియుసి పోరాటమే మూలమని తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ డిసెంబర్ 26 ఖమ్మం శతాబ్ది సభలకు 42 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు.ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సింగరేణి కార్మిక కుటుంబాలను ఒకే వేదికపైకి తేవడం గోదావరిఖని చరిత్రలో అరుదైన సంఘటనగా అభివర్ణించారు. మహిళలు పార్టీ–యూనియన్ కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొనాలని సూచించారు.కార్యక్రమంలో ఎల్ ప్రకాష్, కవ్వంపల్లి స్వామి, గౌతం గోవర్ధన్, గోసిక మోహన్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి కళాకారుల విప్లవ గేయాలు సభలో ఉత్సాహాన్ని నింపాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.