epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్ర‌జ‌ల‌ను మ‌భ్యపెట్టేలా మంత్రి సీత‌క్క హామీలు

ప్ర‌జ‌ల‌ను మ‌భ్యపెట్టేలా మంత్రి సీత‌క్క హామీలు
వెయ్యి ఓట్లు లేని గ్రామానికి 200 ఇందిరమ్మ ఇళ్లంట‌
అసెంబ్లీ ఎన్నిక‌ల హామీలే నెర‌వేర్చ‌లేదు
ములుగులో చెక్కు చెదరని బీఆర్ఎస్ ఓటు బ్యాంక్
రెడ్కో మాజీ చైర్మన్ వై. సతీష్‌రెడ్డి

కాకతీయ,ములుగు ప్రతినిధి : ములుగు నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, అన్ని రకాల బెదిరింపులు, ప్రలోభాలు ఎదురైనా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌ చెక్కుచెదరకుండా నిలిచిందని రెడ్కో మాజీ చైర్మన్‌, బీఆర్ఎస్‌ నాయకుడు వై.సతీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం ములుగులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల మధ్య కేవలం 5 వేల ఓట్ల తేడా మాత్రమే ఉండటం బీఆర్ఎస్‌ బలాన్ని స్పష్టంగా చాటుతోందన్నారు. ప్రజలంతా బీఆర్ఎస్‌ వైపే ఉన్నారని పేర్కొన్నారు. మంత్రి సీతక్క సొంత గ్రామం జగ్గన్నపేటలో కాంగ్రెస్‌ అభ్యర్థిని బెదిరింపుల ద్వారా సర్పంచ్‌గా ఏకగ్రీవం చేశారని ఆరోపించారు. అయినప్పటికీ ఉపసర్పంచ్‌ పదవి మాత్రం బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన వ్యక్తికే రావడం బీఆర్ఎస్‌ బలానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. పోలింగ్‌ జరిగితే బీఆర్ఎస్‌ అభ్యర్థులే గెలుస్తారన్న భయంతో కాంగ్రెస్‌ పార్టీ పలు చోట్ల సర్పంచ్‌లను ఏకగ్రీవం చేసుకుందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువగా మంత్రి సీతక్క గ్రామాల్లో తిరిగి పంచాయతీ ఎన్నికల ప్రచారం చేశారని, లెక్కకు మించి హామీలు ఇచ్చారని విమర్శించారు.

వెయ్యి ఓట్లు లేని గ్రామానికి 200 ఇందిరమ్మ ఇళ్లంట‌

వెయ్యి మంది ఓటర్లు కూడా లేని గ్రామాల్లో 100 నుంచి 200 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనన్నారు. నియోజకవర్గం మొత్తానికి 15 వేల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రచారం చేసినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే ఇప్పటికీ నెరవేర్చలేదని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‌ అభ్యర్థులు, నాయకులపై పోలీసుల ద్వారా, కాంగ్రెస్‌ నేతల ద్వారా బెదిరింపులు చేశారని, పథకాల పేరుతో ప్రజలను భయపెట్టడం నెల రోజులుగా కొనసాగిందన్నారు. స్వయంగా మంత్రి సీతక్క అక్కడే ఉండి పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ చేశారని ఆరోపణలు గుప్పించారు. అన్ని అవరోధాలు ఉన్నప్పటికీ ములుగు ప్రజలు బీఆర్ఎస్‌కు అండగా నిలిచారని తెలిపారు. ఏటూరునాగారం వంటి కీలక గ్రామపంచాయతీని బీఆర్ఎస్‌ కైవసం చేసుకుందని పేర్కొన్నారు. రెండు విడతల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సుమారు 42 వేల ఓట్లు రాగా, బీఆర్ఎస్‌కు 37 వేల ఓట్లు వచ్చాయని, రెండు పార్టీల మధ్య కేవలం 5 వేల ఓట్ల తేడానే ఉందన్నారు.

ప్ర‌లోభాల‌కు లొంగ‌ని ప్ర‌జ‌లు..!

సీతక్క ఎంత ప్రలోభాలకు గురిచేసినా, ఎంత బెదిరించినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్‌ వైపే నిలిచారని స్పష్టం చేశారు. కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో బీఆర్ఎస్‌కు ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అధికార పార్టీ బెదిరింపులకు ఎదురునిలిచి పోరాడిన అభ్యర్థులకు, అండగా నిలిచిన పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అధికార పార్టీ ఒత్తిడులకు ఎవరూ భయపడవద్దని, రాష్ట్ర నాయకత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.