epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రజలు కోరిన మార్పు చూపించాం

ప్రజలు కోరిన మార్పు చూపించాం
సంక్షోభ తెలంగాణను పట్టాలెక్కించాం
ప్రభుత్వానికి పీఆర్‌వోలే గొంతు
డిజిటల్‌లో వెనుకబడితే నష్టమే
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేళ్ల పాలనలోనే తెలంగాణ పాలనకు కొత్త దిశను నిర్దేశించిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ప్రజలు కోరిన మార్పును ప్రజల కళ్ల ముందే నిలబెట్టామని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామన్నారు. నాంపల్లిలోని మీడియా అకాడమీలో తెలంగాణ సమాచార–పౌర సంబంధాల శాఖ, మీడియా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా ప్రజా సంబంధాల అధికారుల కోసం నిర్వహించిన పునశ్చరణ తరగతుల్లో శుక్రవారం మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధికారం చేపట్టిన సమయంలో తెలంగాణ అన్ని రంగాల్లో తీవ్ర సంక్షోభంలో ఉందని మంత్రి గుర్తు చేశారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చామని, ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయని స్పష్టం చేశారు.

ఉపాధి కల్పనకు కీల‌క నిర్ణ‌యాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశంలో వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డులు, ఉపాధి కల్పన వంటి రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఇవి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెడుతున్నాయని అన్నారు. అయితే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకూ ప్రభుత్వానికీ మధ్య వారధిగా ఉండాల్సిన ప్రజా సంబంధాల అధికారుల పాత్ర బలపడాల్సిన అవసరం ఉందన్నారు.కాలానికి తగ్గట్టు పీఆర్‌వోలు పని తీరును మార్చుకోవాలని స్పష్టం చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు డిజిటల్, సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో వినియోగించకపోతే ప్రభుత్వానికి నష్టమేనని హెచ్చరించారు.

క్షేత్రస్థాయిలో పథకాల అమలును పరిశీలించి, వాస్తవ కథనాలతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రతి జిల్లాకు సమర్థవంతమైన డీపీఆర్‌వోలను నియమించాలని, డిప్యూటేషన్‌లను రద్దు చేసి అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని ఐ&పీఆర్ కమిషనర్‌కు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఐడీసీ చైర్మన్ మువ్వ విజయబాబు, ఐ&పీఆర్ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక, సీఎం సీపీఆర్వో జి. మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.