epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

క‌డియంకు పొలిటిక‌ల్ ర్యాగింగ్‌

క‌డియంకు పొలిటిక‌ల్ ర్యాగింగ్‌
ఆడో.. మ‌గో తేల్చుకోవాలంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు
రాజ‌కీయ వ్య‌భిచారి అంటూ రాజ‌య్య ఫైర్‌
ద‌మ్ముంటే ఎన్నికల ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్‌
తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీ
గులాబీ శ్రేణుల వినూత్న నిర‌స‌న‌
ఫ్లెక్సీ తొలగింపున‌కు పోలీసుల ప్రయత్నం
బీఆర్ఎస్ నాయ‌కులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత
ఘన్‌పూర్ గడ్డపై మళ్లీ వేడేక్కిన రాజకీయం
కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యే
బీఆర్ఎస్‌లోనే ఉన్నానని ఇటీవ‌ల స్పీక‌ర్‌కు అఫిడవిట్
తాను ఏ పార్టో చెప్పుకోలేని సంక‌టి స్థితిలో క‌డియం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి ఎపిసోడ్ తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవ‌ల చోటుచేసుకుంటున్న ప‌రిణామాల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాను ఏ పార్టీలో ఉన్నానో ధైర్యంగా చెప్పుకోలేని సంక‌టి స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీన్ని అదునుగా భావిస్తున్న బీఆర్ఎస్ ఆయ‌న‌పై వ‌రుస‌గా విమ‌ర్శ‌ల దాడికి దిగుతోంది. పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ మొద‌లుకొని … మాజీ ఎమ్మెల్యే రాజ‌య్య వ‌ర‌కు ప‌దునైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రింత ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ శ్రేణులు ప్ర‌య‌త్నిస్తూ పొలిటిక‌ల్ ర్యాగింగ్‌కు పాల్ప‌డుతున్నారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన కడియం శ్రీహరి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇటీవ‌ల అసెంబ్లీ స్పీకర్‌కు అఫిడవిట్ ద్వారా తాను బీఆర్ఎస్‌లో ఉన్నానని తెలియజేశారు. దీంతో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. తిరుమలనాథ స్వామి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియంకు స్వాగతం అంటూ ఆపార్టీ శ్రేణులు శనివారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తీవ్ర వివాదానికి దారితీసింది. ఫ్లెక్సీని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగగా, దీనికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గట్టిగా అడ్డుకున్నారు. ఫ్లెక్సీ తొలగింపును నిరసిస్తూ గులాబీ శ్రేణులు నినాదాలు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు జోక్యం చేసు కొని పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయ‌డంతో గొడ‌వ స‌ద్దుమ‌నిగింది.

బీఆర్‌ఎస్ గుర్తింపు వాడటం సరికాదు : బీఆర్ఎస్ నాయకులు

పార్టీ మారిన తరువాత కూడా బీఆర్‌ఎస్ గుర్తింపు వాడటం సరికాదని, ఇది రాజకీయ నైతికతకు విరుద్ధమని అరెస్ట్ అయిన అనంతరం పలువురు బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని, పార్టీ మారిన కడియం స్పష్టమైన రాజకీయ వైఖరితో ప్రజల ముందుకు రావాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచిన కడియం శ్రీహరి అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. అయితే తాజాగా తాను ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని స్పీకర్‌కు అఫిడవిట్ ఇవ్వడం రాజకీయంగా తప్పుదోవ పట్టించే చర్యగా వారు అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. దమ్ముంటే బహిరంగంగా బీఆర్‌ఎస్ కండువా కప్పు కుని నియోజకవర్గంలో తిరగాలని సవాల్ విసిరారు. మున్సిపల్ కమిషనర్ పార్టీ ఏజెంట్‌లా వ్యవహరిస్తూ ఫ్లెక్సీ తొలగించారని ఆరోపించారు. అధికారులు రాజకీయాలకు దూరంగా ఉండి, స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాలని హెచ్చరించారు. వెంటనే కడియం బద్ధి తెచ్చుకోవాలి.. ఇకపై ఇలాంటి చర్యలు కొనసాగితే తెలంగాణ ఉద్యమాన్ని తలపించే రీతిలో గ్రామ గ్రామాన కడియంను తరిమికొడతామని బీఆర్‌ఎస్ శ్రేణులు హెచ్చరించారు.

కడియం శ్రీహరి ఆడా.. మ‌గా: కేటీఆర్‌

పంచాయతీ ఎన్నికల్లో 66శాతం గెలిచామని చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే.. పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు మరోసారి సవాల్‌ విసిరారు. ‘ఫిరాయింపు ఎమ్మెల్యేలు గబ్బిలాల్లా వేలాడుతున్నారు. పదవుల కోసం ఇంత దిగజారుతారా? అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల బతుకులు ఆగమైపోయాయి. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి ఆడోళ్లా.. మొగోళ్లా.. స్పీకర్‌ ముందే పచ్చి అబద్ధాలా?’ అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే, నైతికత ఉంటే బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి అక్రమంగా చేర్చుకున్న పది మంది ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించి, ఎన్నికల ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్‌ విసిరారు. తెలంగాణ ఎవరి వైపు ఉన్నదో ప్రజలు నిర్ణయిస్తారని,దమ్మూ ధైర్యం ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే రాజ‌య్య సైతం క‌డియం శ్రీహ‌రిపై త‌వ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. క‌డియం శ్రీహ‌రికికి ఏమాత్రం శిగ్గు, శ‌రం ఉన్నా వెంట‌నే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గుర్తుపై పోటీచేసి గెల‌వాల‌ని స‌వాల్ విసురుతున్నారు. రాజ‌కీయ వ్య‌భిచారానికి పాల్ప‌డుతున్నార‌ని ఘాటుగా విమ‌ర్శిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.