epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పోలీస్ కమిషనరేట్‌ల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్

పోలీస్ కమిషనరేట్‌ల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్
జీహెచ్‌ఎంసీ పునర్విభజనతో పోలీస్ వ్యవస్థలో కీలక మార్పులు
మూడు కమిషనరేట్‌లను 12 జోన్‌లుగా విభజించిన ప్రభుత్వం
హైదరాబాద్‌కు ఆరు, సైబరాబాద్‌, రాచకొండకు మూడు చొప్పున జోన్‌లు
ఫ్యూచ‌ర్‌ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుపై కసరత్తు

కాకతీయ, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పునర్విభజన నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నగర విస్తీర్ణం, జనాభా పెరుగుదల, భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ల పరిధిని పునర్వ్యవస్థీకరించారు. మూడు కమిషనరేట్‌లను మొత్తం 12 జోన్‌లుగా విభజిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పులతో పోలీసింగ్ మరింత సమర్థవంతంగా మారనుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఆరు జోన్‌లు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం ఆరు జోన్‌లను ఏర్పాటు చేశారు. చార్మినార్ జోన్, గోల్కొండ జోన్, ఖైరతాబాద్ జోన్, రాజేంద్రనగర్ జోన్, సికింద్రాబాద్ జోన్, శంషాబాద్ జోన్
ఈ విభజనతో పాతబస్తీ నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం వరకు భద్రతా వ్యవస్థ మరింత కట్టుదిట్టం కానుందని అధికారులు చెబుతున్నారు.

సైబరాబాద్‌లో భారీ మార్పులు
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో కూడా కీలక మార్పులు చేపట్టారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిని మొయినాబాద్ నుంచి పటాన్‌చెరు వరకు విస్తరించారు. కూకట్‌పల్లి జోన్‌లోకి మాదాపూర్‌ను చేర్చారు. కుత్బుల్లాపూర్ జోన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఐటీ కారిడార్‌, నివాస ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ మార్పులు అవసరమయ్యాయని పోలీస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

రాచకొండలో మూడు జోన్‌లు
రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ను మూడు జోన్‌లుగా విభజించారు. ఎల్‌బీ నగర్ జోన్, మల్కాజిగిరి జోన్,
ఉప్పల్ జోన్, ఈ జోన్‌ల ఏర్పాటుతో శివారు ప్రాంతాల్లో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ మరింత పటిష్టంగా ఉండనుందని భావిస్తున్నారు.

భవిష్యత్ సిటీపై కసరత్తు
పోలీస్ జిల్లాలుగా యాదాద్రి జిల్లా ఎస్పీ పరిధిలోని మహేశ్వరం జోన్ మారనుంది. అలాగే షాద్‌నగర్‌, చేవెళ్ల ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేకంగా ‘ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్’ ఏర్పాటు చేయాలన్న యోచనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భవిష్యత్‌లో నగర విస్తరణకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు సమాచారం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.