epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విద్యార్థులున్నా ఉపాధ్యాయుల్లేరు..!

విద్యార్థులున్నా ఉపాధ్యాయుల్లేరు..!
94 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులే
ఇద్ద‌రిపైనే ప్రభుత్వ పాఠశాలలో బోధన భారం
న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న పాఠ‌శాల‌లో ఇదీ ప‌రిస్థితి
విద్యాశాఖ నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం
ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్

కాకతీయ, ఖమ్మం : ఖమ్మం పట్టణంలోని బుర్హాన్‌పురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా మారింది. మొత్తం 94 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో బోధన నాణ్యత దెబ్బతింటోందని, విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్న కారణంతో కొన్ని చోట్ల స్కూళ్లను మూసివేస్తున్న పరిస్థితి ఉన్నా, నగర కేంద్రంలోనే విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలో టీచర్లను కేటాయించకపోవడం విడ్డూరమని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి.

న‌లుగురు ఉండాల్సిన చోట.. ఇద్ద‌రే..!

గత నెలలో ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు పదవీ విరమణ పొందడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నిబంధనల ప్రకారం కనీసం నలుగురు ఉపాధ్యాయులు అవసరమైన పాఠశాలలో కేవలం ఇద్దరితోనే తరగతులు నిర్వహించడం అసాధ్యమని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడిపై అధిక భారం పడటంతో విద్యార్థులకు సరైన శ్రద్ధ చూపడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం పట్టణంలోనే ఈ పరిస్థితి ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చని విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో మౌలిక వసతులు కల్పిస్తున్నప్పటికీ, ఉపాధ్యాయుల కొరత ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తోందని వారు విమర్శించారు.
నలుగురు ఉపాధ్యాయులు అవసరమైన ఈ పాఠశాలకు వెంటనే మరో ఇద్దరిని కేటాయించాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.