epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం
* మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్
* “టికెట్ ఇస్తే గెలిచి వస్తాం” అంటూ నేతల వద్ద వేడుకోలు
* డివిజన్లలో తిరుగుతూ మద్దతు కోరుతున్న ఆశావహులు
* అధికార పార్టీలో టికెట్ కోసం గట్టి పోటీ

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడకముందే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రిజర్వేషన్లు ఖరారు కాలేదు.. ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించలేదు. అయినప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీల్లో టికెట్ల కోసం పోటాపోటీ మొదలైంది. ఖమ్మం కార్పొరేషన్ పై పట్టు సాధించాలనే లక్ష్యంతో అన్ని పార్టీలు ముందస్తు వ్యూహాలతో కదులుతుండగా, అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాల్లోనూ ఆశావహుల హడావుడి స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీల నివాసాలు రాజకీయ సందడితో కిటకిటలాడుతున్నాయి. టికెట్ ఆశిస్తున్న నేతలు, వారి అనుచరులు, కుల సంఘాల ప్రతినిధులు, కాలనీ పెద్దలు వరుసగా నాయకులను కలుస్తూ తమ అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతున్నారు. “టికెట్ ఇస్తే తప్పకుండా గెలిపిస్తాం” అన్న హామీ నేతల చెవుల్లో మార్మోగుతోంది. వ్యక్తిగత ప్రతిభ, ప్రజాసేవ అనుభవంతో పాటు సామాజిక సమీకరణలు, కుల బలం, స్థానిక లెక్కలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

రిజర్వేషన్లు ఖరారు కాకముందే వ్యూహాలు

పురపాలక ఎన్నికల్లో కీలకమైన అంశమైన వార్డు రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ రిజర్వేషన్ల ఖరారు పెండింగ్‌లో ఉంది. అయినప్పటికీ “మనకు అనుకూలమైన రిజర్వేషన్ వచ్చే అవకాశాలే ఎక్కువ” అన్న అంచనాతో అభ్యర్థులు ముందుగానే రంగంలోకి దిగారు. కొందరు ఏ రిజర్వేషన్ వచ్చినా సరే తమకు కాకపోతే భార్యకు లేదా కుటుంబ సభ్యులకు టికెట్ దక్కేలా ముందస్తు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ధోరణి పార్టీల్లో అంతర్గత చర్చలకు, అసంతృప్తులకు దారితీస్తోంది.
మున్సిపల్ చైర్మన్ పదవుల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో అమలైన రిజర్వేషన్లే కొనసాగుతాయన్న అంచనాతో చైర్మన్ పదవి ఆశావహులు ఇప్పటి నుంచే రాజకీయ కసరత్తును వేగవంతం చేశారు. వార్డు స్థాయి నుంచి చైర్మన్ స్థాయి వరకు ఒకేసారి పోటీ తీవ్రంగా ఉండటంతో పార్టీలకు అభ్యర్థుల ఎంపిక సవాల్‌గా మారే అవకాశం కనిపిస్తోంది.

అధికార పార్టీపైనే ఎక్కువ ఆశలు

అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని స్థానిక సంస్థల స్థాయిలోనూ పునరావృతం చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో అధికార పార్టీ టికెట్ దక్కితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న భావన ఆశావహుల్లో బలంగా ఉండటంతో కాంగ్రెస్‌లో పోటీ మరింత తీవ్రంగా మారింది.
మున్సిపల్ ఎన్నికలు అంటే స్థానిక సమస్యల పరిష్కారం, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాలు ముందుండాల్సి ఉండగా, ప్రస్తుతం టికెట్ల రాజకీయాలు ఈ అంశాలను వెనక్కి నెట్టుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరు ఎంతకాలంగా పార్టీలో ఉన్నారు? ఎవరి వెనుక ఎంత బలం ఉంది? ఎవరి కుల సమీకరణలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయి? అన్నవే ప్రధాన ప్రమాణాలుగా మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది పార్టీలకే కాక ప్రజాస్వామ్యానికీ ప్రమాదకర సంకేతమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.