epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాకతీయ ఎఫెక్ట్‌..!

కాకతీయ ఎఫెక్ట్‌..!
మేడారంలో పోలీస్ ‘రెడ్ కార్పెట్’కు చెక్
గద్దెల వద్ద ప్రత్యేక సౌకర్యాలపై దుమారం
కాకతీయ కథనంతో ఉన్నతాధికారుల ఆరా
గద్దెల వద్ద ఓవర్ చేసిన అధికారికి క్లాస్‌?
భక్తులందరికీ సమాన దర్శనంపై ఆదేశాలు

కాకతీయ, ములుగు ప్రతినిధి : శుక్రవారం మేడారం సమ్మక్క–సారమ్మ మహాజాతరకు పది లక్షల మందికి పైగా భక్తులు తరలిరావడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల భద్రత, గద్దెల వద్ద క్రమశిక్షణ కోసం ఇనుప కంచెలు ఏర్పాటు చేసి, కంచె అవతల నుంచే దర్శనానికి అనుమతించారు. అయితే ఇదే సమయంలో కొందరు పోలీసు అధికారులు తమ కుటుంబ సభ్యులను నేరుగా సమ్మక్క–సారమ్మల గద్దెల వద్దకు తీసుకువెళ్లారని ఆరోపణలు వెల్లువెత్తాయి. సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడి, ఇనుప కంచె అవతల నుంచే దర్శనం చేసుకోవాల్సి వస్తుంటే, పోలీసు అధికారుల బంధువులకు మాత్రం ప్రత్యేక సౌకర్యాలు కల్పించడమేంటని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన మేడారంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కథనంతో కదిలిన ఉన్నతాధికారులు

ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కాకతీయ దినపత్రికలో “మేడారంలో పోలీస్ రెడ్ కార్పెట్” అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. కథనం వెలువడిన వెంటనే ములుగు జిల్లాకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. గద్దెల వద్ద వ్యవహారంపై ఆరా తీసిన ఉన్నతాధికారి, నిబంధనలు అతిక్రమించిన సంబంధిత అధికారులను పిలిపించి తీవ్రంగా మందలించినట్టు తెలిసింది. గద్దెల వద్ద ఓవర్ చేసిన ఓ మహిళా అధికారికి కూడా క్లాస్‌ ఇచ్చినట్టు సమాచారం. ఇకపై గద్దెల వద్దకు ఎవరినీ అనుమతించకూడదని, కేవలం అధికారికంగా అనుమతి పొందిన వీఐపీ, వీవీఐపీ లకే దర్శనానికి అవకాశం కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సాధారణ ప్రజలైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా, పోలీసు అధికారుల బంధువులైనా—ఎవరినీ ప్రత్యేకంగా గద్దెల వద్దకు తీసుకువెళ్లరాదని తేల్చిచెప్పారు. భక్తులందరికీ సమానంగా దర్శనం కల్పించడమే ప్రభుత్వ, పోలీసు శాఖల ప్రధాన బాధ్యతని పేర్కొంటూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నిర్ణయంతో భక్తుల్లో కొంతవరకు సంతృప్తి వ్యక్తమవుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.