epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అక్రమాస్తులు రూ. 100 కోట్లు!

అక్రమాస్తులు రూ. 100 కోట్లు!

వెంకట్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ త‌నిఖీలు

మొత్తం ఎనిమిది చోట్ల అధికారుల సోదాలు

భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తింపు

రూ.30 లక్షల నగదు, 3 కేజీల బంగారం సీజ్

పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

ఎల్బీనగర్‌లో ఇల్లు, విల్లా, 10 ప్లాట్స్ ..

గ‌త‌నెల‌లో రూ. 60 వేలు తీసుకుంటూ సస్పెన్షన్‌

హన్మకొండ అడిషనల్ కలెక్టర్‌పై అనేక అవినీతి ఆరోప‌ణ‌లు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: స‌స్పెన్ష‌న్‌లో ఉన్న హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు న‌మోదైంది. దీంతో అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) అధికారులు అత‌డి ఇల్లు స‌హా ఏడుచోట్ల ఏక‌కాలంలో సోదాలు చేప‌ట్టారు. ఈ సోదాల్లో వెంక‌ట‌ర్‌రెడ్డి వ‌ద్ద భారీగా అక్ర‌మాస్తులు ఉన్న‌ట్లు తేల్చారు. 4.65 కోట్ల విలువ చేసే విల్లాతో పాటు ఒక ఫ్లాట్ ఉన్నట్లు గుర్తించారు. 60 లక్షల విలువ చేసే వ్యాపార సముదాయం, 65 లక్షల విలువచేసే 8 ఓపెన్ ప్లాట్లు, 14.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ వందల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటితోపాటు ఇంట్లో రూ. 30 లక్షల నగదు 44.3 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, 297గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గత నెలలో 60 వేల లంచం తీసుకుంటూ వెంకటరెడ్డి ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. పాఠశాల అనుమతి విషయంలో ఆయన అవినీతికి పాల్పడడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

ఉన్నత స్థానంలో ఉండి కూడా…

గ‌త డిసెంబ‌ర్ 6న హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి రూ. 60వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబ‌డిన సంగ‌తి తెలిసిందే. వెంకట్ రెడ్డి అదనపు కలెక్టర్‌గా పనిచేయడంతో పాటు, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో.. ఓ ప్రైవేట్ స్కూల్‌కు సంబంధించిన రెన్యువల్ ఫైల్‌ను క్లియర్ చేసేందుకు పాఠశాల యాజమాన్యం నుంచి ఆయన లంచం డిమాండ్ చేశాడు. రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా కలెక్టరేట్ కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. ఉన్నత స్థానంలో ఉండి కూడా లంచానికి పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వెంక‌ట్‌రెడ్డి ఏసీబీకి ప‌ట్టుబ‌డ‌టంతో ఆయ‌న బాధితులు హ‌న్మ‌కొండ క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ఎదుట ప‌టాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.