epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విద్య–వైద్య రంగాలకే ప్రథమ ప్రాధాన్యం

విద్య–వైద్య రంగాలకే ప్రథమ ప్రాధాన్యం
ఆసుపత్రుల పరిశుభ్రంగా ఉంచాలి
ఖమ్మం నగర జీవన ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి
త్వరలో మరో 2,500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల
బాలాజీ నగర్ అర్బన్ పీహెచ్‌సీ ప్రారంభం

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఖమ్మం నగర 4వ డివిజన్ బాలాజీ నగర్‌లో రూ.2.43 కోట్ల వ్యయంతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలతో వైద్య సిబ్బంది ప్రేమాభిమానాలతో వ్యవహరించాలని సూచించారు. వైద్య సిబ్బంది మంచి ప్రవర్తనతోనే రోగి బాధ సగం నయమవుతుందని వ్యాఖ్యానించారు.
ఆసుపత్రి పరిసరాల్లో పచ్చని మొక్కలు పెంచి, ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వైద్య శాఖకు కేటాయించిన నిధులతో పాటు అవసరమైతే కలెక్టర్‌, కమిషనర్‌ ద్వారా అదనపు నిధులు సమకూర్చి పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

అవసరమైతే ప్రత్యేక నిధులు

ఆసుపత్రి అవసరాలకు అవసరమైతే ప్రజాప్రతినిధులు, మంత్రుల ద్వారా ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో అందుబాటులో ఉన్న సిబ్బందిని అర్బన్ హెల్త్ సెంటర్లకు వినియోగించుకోవాలని, కొత్త పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు పంపితే చర్చించి ఆమోదింపజేస్తానన్నారు. మంచి విద్య, మెరుగైన వైద్య సదుపాయాలతో ఖమ్మాన్ని ప్రశాంత నగరంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్య–వైద్య రంగాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందన్నారు. ఇప్పటికే ఖమ్మం నగరంలో అర్హులైన పేదలకు 2,200 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించామని, త్వరలో మరో 2,500 ఇండ్ల మంజూరుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. రూ.13 వేల కోట్లతో రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, పేదలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో 6,000 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేశానని, పెండింగ్ నిర్మాణాలను పూర్తి చేసి నిర్వాసిత పేదలకు కేటాయించామని తెలిపారు.
ఖమ్మం మార్కెట్ ప్రాంతంలో రోడ్డుపై నివసిస్తున్న 28 పేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించి రోడ్డు విస్తరణ చేపట్టామని మంత్రి తెలిపారు. రోడ్డు విస్తరణలో ఎవరికైనా భవనాలు కోల్పోతే పది రెట్ల పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో అక్రమ గుడిసెలు వేయడానికి అధికారులు అనుమతించవద్దని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ… రూ.2.43 కోట్లతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్‌ను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కేంద్రం ద్వారా డివిజన్ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఉచితంగా నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. చిన్న చిన్న జ్వరాలు, రక్త పరీక్షల కోసం జనరల్ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని, హెల్త్ సెంటర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. గర్భిణీలకు 100 శాతం ఏఎన్‌సీ చెకప్‌లు, ప్రసవాలు, శిశువులకు టీకాలు ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. రామారావు, కార్పొరేటర్ డి. జ్యోతి రెడ్డి, ఆర్డీవో నర్సింహారావు, మునిసిపల్ ఈఈ కృష్ణలాల్‌, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.