epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రేగళ్ల పెద్దతండాలో ఫ్యాక్టరీ?

రేగళ్ల పెద్దతండాలో ఫ్యాక్టరీ?
అటవీ భూముల్లో పరిశ్రమ ఎలా?
ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారా!!
గిరిజన భూములకు మంగళం పాడే ప్రయత్న‌మా..!?
వైల్డ్ ఫారెస్ట్‌లో అనుమతులు ఎవరు ఇచ్చారు?
ఉద్యోగాల పేరుతో వసూళ్ల పర్వం?
జిల్లా కలెక్టర్ జోక్యం తప్పనిసరంటున్న గిరిజ‌నులు
ప్రత్యక్ష పోరాటానికి గిరిజనులు స‌న్న‌ద్ధం

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని *రేగళ్ల పెద్దతండా*లో టెక్స్టైల్ ఫ్యాక్టరీ స్థాపన పేరుతో జరుగుతున్న వ్యవహారం గిరిజన ప్రాంతంలో కలకలం రేపుతోంది. పూర్తిస్థాయి ఏజెన్సీ గ్రామాలతో, దట్టమైన అటవీ ప్రాంతాలతో చుట్టు ముట్టబడి ఉన్న ఈ గ్రామంలో నూరుశాతం గిరిజనులే నివసిస్తున్నారు. ఒకప్పుడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉన్న ఈ గ్రామ ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్లిన దశలూ ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఎలాంటి అనుమతులు లేకుండానే అటవీ భూముల్లో ఫ్యాక్టరీ స్థాపించేందుకు కొందరు పెద్దలు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారని గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవి, వన్యప్రాణ సంరక్షణ భూములు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో పరిశ్రమ స్థాపన ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అటవీ భూముల్లో పరిశ్రమ ఎలా?

రేగళ్ల పెద్దతండా పంచాయతీ పరిధిలోని మూన్య తండా వద్ద గిరిజనుల సాగులో ఉన్న భూమిని అకస్మాత్తుగా టెక్స్టైల్ ఫ్యాక్టరీ పేరుతో చదును చేయడంపై స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ప్రాంతంలో 95 శాతం మేర బంజారా గిరిజనులు అటవీ భూముల్లో సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాదారు పాసు పుస్తకాల కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న గిరిజనులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు. కొంతమంది గిరిజనులు తమ భూముల హక్కుల కోసం న్యాయస్థానాల మెట్లు కూడా ఎక్కారు. గతంలో దొరల ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునేందుకు గిరిజనులు పోరాటాలు చేసినా, డబ్బు బలం ముందు ఓడిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గిరిజనుల మధ్య చిచ్చు

దొరలు ఇతర ప్రాంతాలకు వెళ్లిన తరువాత, గిరిజనుల భూములను అటవీ హక్కుల చట్టం ప్రకారం వారి పేర్లపై నమోదు చేయకుండా, అదే గ్రామంలో ఉన్న కొంతమంది గిరిజనులను ఉపయోగించి గిరిజనులకు గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేగళ్ల పెద్దతండా పరిసర ప్రాంతాల్లో సగానికి సగం అటవీ భూమి ఉంది. కిన్నెరసాని అభయారణ్యం సరిహద్దులో ఉండటంతో వన్యప్రాణ సంరక్షణ నిబంధనలు కఠినంగా ఉన్నాయి. అటువంటి ప్రాంతంలో పరిశ్రమ స్థాపన జరిగితే కాలుష్య ప్రభావంతో గ్రామ జీవనం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు అభివృద్ధి పనులు కూడా అటవీ అనుమతుల లేమితో నిలిచిపోయిన ఈ ప్రాంతంలో, పరిశ్రమలకు ఎలా అనుమతులు వస్తాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఇంటికో ఉద్యోగం ఇస్తామని కొందరు బినామీలు ప్రచారం చేస్తూ గిరిజన యువత నుంచి వసూళ్లకు తెరలేపినట్లు సమాచారం. ఒక్కొక్కరి వద్ద పది నుంచి పదిహేను వేల రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫ్యాక్టరీ పేరుతో అమాయక గిరిజన యువతను మోసం చేస్తున్నారని గ్రామస్థులు మండిపడుతున్నారు.

అనుమతులు లేవు : డీఎఫ్‌వో కిష్ట‌గౌడ్‌

ఈ వ్యవహారంపై డీఎఫ్‌వో కిష్ట‌గౌడ్ స్పందించారు. “రేగళ్ల ప్రాంతంలోని అటవీ భూముల్లో ఎవరికీ పట్టాలు లేవు. గతంలో హైకోర్టు కూడా ఈ అంశాన్ని త్రోసిపుచ్చింది. అటవీ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు, ఎన్ఓసీలు ఇవ్వలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా ఫ్యాక్టరీ స్థాపన అసాధ్యం” అని తెలిపారు. ఫ్యాక్టరీ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అమలులో ఉన్న అటవీ హక్కుల చట్టం, పీసా చట్టాలను ఉల్లంఘించి ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి, ఫ్యాక్టరీ పేరుతో జరుగుతున్న వసూళ్లను ఆపాలని, గిరిజన భూములను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి, రేగళ్ల పెద్దతండాలో ఫ్యాక్టరీ పేరుతో జరుగుతున్న ఈ వ్యవహారం గిరిజనుల అభివృద్ధికా? దోపిడీకా? అనే ప్రశ్నలను బలంగా లేవనెత్తుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.