epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అక్రమ బెల్లం తరలింపు భగ్నం

అక్రమ బెల్లం తరలింపు భగ్నం
రూ.11 లక్షల విలువైన బెల్లం స్వాధీనం
లారీ డ్రైవర్ అరెస్ట్, యజమాని పరార్

కాకతీయ, కూసుమంచి :నల్లబెల్లం, కట్టిక నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపుతున్న నేలకొండపల్లి ఎక్సైజ్‌ పోలీసులు మరోసారి భారీ దాడి చేశారు. కూసుమంచి మండలంలో అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు, శుక్రవారం రాత్రి జాతీయ రహదారి–365బీపై నిర్వహించిన రూట్‌ వాచ్‌లో అక్రమంగా బెల్లం తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. నాయకన్‌గూడెం గ్రామ సమీపంలో ఎక్సైజ్‌ పోలీసులు తనిఖీలు చేపట్టగా, మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న సుమారు 21,420 కిలోల నల్లబెల్లం, 200 కిలోల కట్టికను గుర్తించారు. పట్టుబడిన సరుకు విలువ దాదాపు రూ.11 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

లారీ డ్రైవర్ అరెస్ట్

ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన లారీ డ్రైవర్ షేక్‌ రసూల్‌ (ఏ–1)ను ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. లారీ యజమాని, కర్ణాటకకు చెందిన సాహెబ్‌ ఖాన్‌ (ఏ–2) పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుల నుంచి అక్రమ సరుకుతో పాటు లారీ, ఒక మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ సీఐ సుంకరి రమేష్ తెలిపారు. మండలంలో నాటుసారా తయారీకి బెల్లం వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్‌ ఎస్‌ఐలు లత, పృద్వి, సిబ్బంది శ్రీనివాస్‌, రామారావు, వెంకటేశ్వర్లు, లాలు, హరీష్‌, బలరాం, సునీత, శ్రీలక్ష్మి, సంపూర్ణ, వినీత్‌ పాల్గొన్నారు. అక్రమ నాటుసారా తయారీ, రవాణాపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.